Ind W vs Pak W: ఇదీ ఇండియా సత్తా-టీ20 ప్రపంచ‌క‌ప్‌లో గ్రాండ్ స్టార్ట్‌-పాకిస్థాన్ చిత్తు-ఈ విక్ట‌రీ ఎందుకు ఇంపార్టెంట్?

Ind W vs Pak W: అమ్మాయిలు అదరహో! టీమిండియా విమెన్ క్రికెట్ టీమ్ సత్తాచాటింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ ను చిత్తు చేసి టీ20 ప్రపంచకప్ ను గ్రాండ్ గా స్టార్ట్ చేసింది. టీమ్ ఆల్ రౌండ్ పర్ఫార్మెన్స్ తో సత్తాచాటింది. అయితే ఈ విక్టరీ టీమిండియాకు ఎందుకు అంత ఇంపార్టెంటో ఇక్కడ చూసేయండి.

Published on: Jun 15, 2026, 06:13:07 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Ind W vs Pak W: టీ20 ప్రపంచకప్ 2026లో ఇండియన్ విమెన్ టీమ్ కు అదిరిపోయే స్టార్ట్ దక్కింది. టోర్నీలో తమ ఫస్ట్ మ్యాచ్ లోనే భారత అమ్మాయిలు చెలరేగారు. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ ను చిత్తు చేశారు. హై వోల్టేజ్ యాక్షన్ పోరును వన్ సైడ్ చేసేశారు. ఆదివారం (జూన్ 14) రాత్రి జరిగిన మ్యాచ్ లో 64 రన్స్ తో గెలిచారు.

టీ20 ప్రపంచకప్ లో పాకిస్థాన్ పై ఇండియా బిగ్ విక్టరీ (AFP)
టీ20 ప్రపంచకప్ లో పాకిస్థాన్ పై ఇండియా బిగ్ విక్టరీ (AFP)

టీమిండియా అదుర్స్

ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ అంటే ఉండే హైప్ వేరే లెవల్. ఈ మెగా పోరులో మరోసారి ఇండియాదే డామినెన్స్. టీ20 ప్రపంచకప్ 2026 గ్రూప్-1 లో భాగంగా జరిగిన మ్యాచ్ లో పాక్ పై భారత్ గెలిచింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఇండియా 20 ఓవర్లలో 6 వికెట్లకు 170 రన్స్ చేసింది. ఛేజింగ్ లో పాక్ ను 106 రన్స్ కే కుప్పకూల్చింది భారత్.

ఎందుకంత ఇంపార్టెంట్?

టీ20 ప్రపంచకప్ లో పాకిస్థాన్ పై సాధించిన ఈ విక్టరీ ఇండియాకు చాలా ముఖ్యమైంది. కేవలం పాక్ ను చిత్తు చేశామనే కాదు.. ఇతర అంశాల్లోనూ ఇండియాకు ఈ మ్యాచ్ మంచి కాన్ఫిడెన్స్ ఇచ్చింది. ఆ విషయాలు ఏంటో చూద్దాం.

స్మృతి మంధాన‌ ఫామ్

విమెన్ టీమిండియా స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన‌ మళ్లీ ఫామ్ లోకి వచ్చింది. ఈ ఓపెనర్ ఫామ్ లో ఉంటే ఎంతటి విధ్వంసం చేస్తుందో మనందరికీ తెలిసిందే. రీసెంట్ గా ఇంగ్లాండ్ తో సిరీస్ లో మంధాన ఫెయిల్ అయింది. దీంతో టీ20 ప్రపంచకప్ లో మంధాన ఎలా ఆడుతుందోననే డౌట్లు వచ్చాయి. అయితే పాక్ తో మ్యాచ్ లో 44 బాల్స్ లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 68 రన్స్ కొట్టిన మంధాన మళ్లీ ఫామ్ అందుకుంది.

ఫినిషర్ రోల్

టీ20 మ్యాచ్ లో బ్యాటింగ్ ను ఎంత గొప్పగా స్టార్ట్ చేస్తారో, అంతే గొప్పగా ఫినిష్ చేయడం చాలా ఇంపార్టెంట్. పాకిస్థాన్ తో మ్యాచ్ లో రిచా ఘోష్ ఫినిషర్ రోల్ ను పర్ఫెక్ట్ గా ప్లే చేసింది. ఈ వికెట్ కీపర్ బ్యాటర్ కేవలం 17 బాల్స్ లోనే 34 రన్స్ కొట్టింది. ఇందులో 5 ఫోర్లు, ఓ సిక్సర్ ఉన్నాయి.

స్పిన్ బలం

బౌలింగ్ లోనూ టీమిండియా అదరగొట్టింది. ముఖ్యంగా మరోసారి మన స్పిన్ బలం డామినేట్ చేసింది. ఇంగ్లాండ్ లోని కండీషన్లలో పేసర్ల ఆధిపత్యం ఉంటుంది. కానీ ఇండియా స్పిన్నర్లు అక్కడా సత్తాచాటడం విశేషం. దీప్తి శర్మ 5 వికెట్లతో అదరగొట్టగా.. మన తెలుగమ్మాయి శ్రీ చరణి 3 వికెట్లతో సత్తాచాటింది.

గ్రాండ్ స్టార్ట్

పాకిస్థాన్ తో మ్యాచ్ అంటే టీమ్ పై ఉండే ఒత్తిడి అంతా ఇంతా కాదు. ఈ మ్యాచ్ పై ఫ్యాన్స్ చాలా ఆశలు పెట్టుకుంటారు. మ్యాచ్ రిజల్ట్ ఏ మాత్రం తేడా కొట్టినా కోట్లాది ప్రజల ఆగ్రహావేశాలకు గురికాక తప్పదు. ఇలాంటి పరిస్థితుల్లో గ్రౌండ్ లో భారత జట్టు అదరగొట్టింది.

ఇక ఈ మ్యాచ్ లో ఓడిపోయి ఉంటే భారత టీమ్ కు మానసిక స్థైర్యమూ దెబ్బతినే ప్రమాదం ఉండేది. పైగా ఇది టోర్నీలో భారత్ కు ఫస్ట్ మ్యాచ్. ఇలాంటి సినారియో ప్రకారం చూస్తే టీమిండియా ఈ విక్టరీతో తన కాన్ఫిడెన్స్ ను ఇంకా బిల్డ్ చేసుకుందని చెప్పొచ్చు.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More