Ind Vs Pak: మరికొన్ని గంటల్లోనే ఇండియా వర్సెస్ పాకిస్థాన్ హై వోల్టేజ్ మ్యాచ్.. టీ20 ప్రపంచకప్ లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Ind Vs Pak: క్రికెట్ ప్రపంచం అత్యంత ఆసక్తిగా ఎదురుచూసే ఇండియా వర్సెస్ పాకిస్థాన్ హై వోల్టేజ్ మ్యాచ్ కు మళ్లీ రంగం సిద్ధమైంది. మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా ఆదివారం ఈ మెగా పోరు జరగనుంది. టీమిండియా ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. ఈ మ్యాచ్ లైవ్ స్ట్రీమింగ్ వివరాలు ఇవే.

Published on: Jun 14, 2026, 17:09:24 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Ind Vs Pak: ఇండియన్ క్రికెట్ టీమ్ ఫ్యాన్స్ తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రికెట్ లవర్స్ ఎదురు చూస్తున్న సమయం వచ్చేస్తోంది. హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని టీమిండియా ఆదివారం (జూన్ 14) చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో తలపడుతోంది. మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో ఇవాళ ఇండియా వర్సెస్ పాకిస్థాన్ పోరుకు రంగం సిద్ధమైంది. బర్మింగ్‌హామ్‌లోని పాపులర్ ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో ఈ హై-వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది.

మరికొన్ని గంటల్లోనే ఇండియా వర్సెస్ పాకిస్థాన్ హై వోల్టేజ్ మ్యాచ్ (x/ICC)
మరికొన్ని గంటల్లోనే ఇండియా వర్సెస్ పాకిస్థాన్ హై వోల్టేజ్ మ్యాచ్ (x/ICC)

లైవ్ స్ట్రీమింగ్ వివరాలు

  • ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ ఇండియన్ టైమ్ ప్రకారం రాత్రి 7:00 గంటలకు ప్రారంభమవుతుంది. అంతకంటే ముందు రాత్రి 6:30 గంటలకు టాస్ వేస్తారు.
  • ఈ మ్యాచ్ బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ స్టేడియంలో జరగనుంది.
  • టీవీలో ఈ మ్యాచ్‌ను వీక్షించాలనుకునే అభిమానుల కోసం ‘స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్’ ఛానెళ్లలో ప్రత్యక్ష ప్రసారం అందుబాటులో ఉంటుంది.
  • ఇక డిజిటల్ స్క్రీన్‌లు లేదా మొబైల్స్‌లో చూడాలనుకునే వారి కోసం 'జియోహాట్‌స్టార్' (JioHotstar) యాప్, వెబ్‌సైట్‌లో లైవ్ స్ట్రీమింగ్ కానుంది.

గెలుపుతో బోణీ కొట్టాలని

ఇండియా, పాకిస్థాన్ జట్ల ఇటీవలి ఫామ్, హెడ్-టు-హెడ్ రికార్డులను పరిశీలిస్తే పేపర్ పై భారత్ స్పష్టమైన ఆధిక్యంతో పటిష్టంగా కనిపిస్తోంది. అయితే, టీ20 ఫార్మాట్‌లో ఏ జట్టునైనా తక్కువ అంచనా వేయలేం. ఏ జట్టు అయినా తమ రోజున అద్భుతంగా ఆడి మ్యాచ్ ఫలితాన్ని మార్చేయగలదు. వన్డే ప్రపంచ ఛాంపియన్లుగా ఉన్న భారత మహిళల జట్టు.. ఈ పొట్టి ఫార్మాట్ ప్రపంచకప్‌ను కూడా ఘనమైన విజయంతో ప్రారంభించాలని పట్టుదలగా ఉంది.

ఫామ్‌పై ఆందోళన

టీ20 ప్రపంచకప్ లో ఈ మెగా పోరుకు ముందు టీమిండియా కొన్ని లోపాలను సరిదిద్దుకోవాల్సి ఉంది. ఇటీవల ఇంగ్లాండ్‌తో జరిగిన ద్వైపాక్షిక టీ20 సిరీస్‌లో భారత్ పరాజయం చవిచూసింది. ఆ తర్వాత జరిగిన ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్‌లోనూ ఇంగ్లాండ్ చేతిలోనే ఓటమి ఎదురైంది. ముఖ్యంగా వైస్ కెప్టెన్ స్మృతి మంధాన ఫామ్ ప్రస్తుతం జట్టుకు పెద్ద ఆందోళనగా మారింది. ఈ తొలి మ్యాచ్‌లోనే ఆమె తిరిగి ఫామ్‌లోకి వచ్చి జట్టుకు బలమైన పునాది వేయాలని మేనేజ్‌మెంట్ ఆశిస్తోంది.

కెప్టెన్ ధీమా

పాకిస్తాన్‌తో మ్యాచ్‌కు ముందు భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ పూర్తి ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తపరిచింది. బయట వినిపించే మాటలను పట్టించుకోకుండా టీమ్ మొత్తం కేవలం ఆటపైనే దృష్టి పెట్టిందని స్పష్టం చేసింది.

​"మేమంతా ఈ టోర్నమెంట్ కోసం ఎంతో ఉత్సాహంగా ఉన్నాం. ఇది మా అందరికీ చాలా పెద్ద టోర్నమెంట్. మొదటి మ్యాచ్ ఎప్పుడూ చాలా కీలకం, ఎందుకంటే ఇది టోర్నమెంట్‌లో జట్టు ప్రయాణాన్ని శాసిస్తుంది. ఈ మ్యాచ్ కోసం మేమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. జట్టులోని ఆటగాళ్లంతా ఫిట్‌గా, పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉన్నారు" అని విలేకరుల సమావేశంలో హర్మన్‌ప్రీత్ కౌర్ వివరించింది.

భారత జట్టు

స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమిమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), భారతి ఫుల్మాలి, రిచా ఘోష్ (వికెట్ కీపర్), దీప్తి శర్మ, శ్రేయాంక పాటిల్, క్రాంతి గౌడ్, రేణుకా సింగ్ ఠాకూర్, శ్రీ చరణి, రాధా యాదవ్, అరుంధతి రెడ్డి, యాస్తికా భాటియా, నందిని శర్మ.

​పాకిస్తాన్ జట్టు

గుల్ ఫిరోజా, మునీబా అలీ (వికెట్ కీపర్), సైరా జబీన్, ఆయేషా జాఫర్, ఇరమ్ జావేద్, ఫాతిమా సనా (కెప్టెన్), అలియా రియాజ్, నటాలియా పర్వైజ్, ఐమన్ ఫాతిమా, డయానా బేగ్, నష్రా సంధు, రామీన్ షమీమ్, సాదియా ఇక్బాల్, తుబా హసన్, తస్మియా రుబాబ్.

People Also Ask- తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)

​ప్రశ్న: భారత్, పాకిస్తాన్ మహిళల టీ20 మ్యాచ్ ఎప్పుడు, ఏ సమయానికి ప్రారంభమవుతుంది?

జవాబు: ఈ మ్యాచ్ జూన్ 14న (ఆదివారం) భారత కాలమానం ప్రకారం రాత్రి 7:00 గంటలకు ప్రారంభమవుతుంది.

​ప్రశ్న: ఈ మ్యాచ్ ఏ మైదానంలో జరగనుంది?

జవాబు: ఇరు జట్ల మధ్య ఈ ప్రతిష్టాత్మక మ్యాచ్ బర్మింగ్‌హామ్‌లోని ప్రసిద్ధ ఎడ్జ్‌బాస్టన్ స్టేడియంలో జరగనుంది.

​ప్రశ్న: ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ లైవ్ ఏ ఓటీటీలో చూడవచ్చు?

జవాబు: ఈ మ్యాచ్ డిజిటల్ లైవ్ స్ట్రీమింగ్ జియోహాట్‌స్టార్ (JioHotstar) యాప్, అధికారిక వెబ్‌సైట్‌లో వీక్షించవచ్చు.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More