T20 World Cup: బిగ్ బజ్.. టీ20 ప్రపంచకప్ ఫైనల్ తర్వాత ఇండియన్ ష్యాన్స్ కు షాక్.. స్టార్ క్రికెటర్ రిటైర్మెంట్?
T20 World Cup: టీ20 ప్రపంచకప్ ఫైనల్ తర్వాత ఇండియన్ ఫ్యాన్స్ కు షాక్ తగిలే అవకాశముంది. ఈ మ్యాచ్ లో భారత్ ఓడినా, గెలిచినా కూడా స్టార్ బ్యాటర్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటిస్తాడనే బజ్ వైరల్ గా మారింది.
టీ20 ప్రపంచకప్ ఫైనల్ తర్వాత ఇండియన్ ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చేందుకు ఓ స్టార్ క్రికెటర్ రెడీ అయ్యాడని సమాచారం. ఈ తుదిపోరులో ఇండియా గెలిచినా లేదా ఓడినా కూడా అతను రిటైర్మెంట్ తీసుకునేందుకు ఫిక్స్ అయ్యాడని తెలిసిందే. ఆ స్టార్ క్రికెటరే.. ఇండియన్ టీ20 క్రికెట్ టీమ్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్.

సూర్యకుమార్ రిటైర్మెంట్
అవును.. సండే (మార్చి 8) టీ20 ప్రపంచకప్ ఫైనల్ తర్వాత మిస్టర్ 360 ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ ఆటకు గుడ్ బై చెప్పబోతున్నాడనే బజ్ తెగ వైరల్ గా మారింది. ఈ టైటిల్ పోరు తర్వాత సూర్య అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటిస్తాడని తెలిసింది. ఇకపై క్రికెట్లో స్కై కనిపించడనే ప్రచారం జోరుగా సాగుతోంది.
టీ20 ప్రపంచకప్ ఫైనల్
టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్లో న్యూజిలాండ్ తో ఇండియా తలపడనుంది. రేపు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఈ టైటిల్ ఫైట్ జరుగుతుంది. ఇందులో గెలిచిన టీమ్ 2026 టీ20 ప్రపంచకప్ ట్రోఫీని సొంతం చేసుకుంటుంది. ఈ పొట్టి కప్ లో సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలోనే భారత జట్టు ఆడుతోంది.
ఇక చాలని
సూర్యకుమార్ యాదవ్.. ఈ పేరు వింటేనే గ్రౌండ్ లో బ్యాట్ తో అతను క్రియేట్ చేసే విధ్వంసం, మైదానంలో 360 డిగ్రీల ఆటతీరుతో బాదే షాట్లు గుర్తుకొస్తాయి. కానీ స్కైలో కాస్త పదును తగ్గిందనే చెప్పాలి. ఇంతకుముందులా అతను ధనాధన్ ఇన్నింగ్స్ లు ఆడలేకపోతున్నాడు. ఈ టీ20 ప్రపంచకప్ లో పరుగులు చేసినా, బ్యాటింగ్ లో స్పీడ్ మాత్రం లేదు. అందుకే ఇక చాలని ఆటను వదిలేసేందుకు ఫిక్స్ అయ్యాడని టాక్.
ఈ టోర్నీలో
టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీలో సూర్యకుమార్ యాదవ్ 8 ఇన్నింగ్స్ ల్లో 242 పరుగులు చేశాడు. కానీ అతని యావరేజ్ 34.57, స్ట్రైక్ రేట్ 137.50 మాత్రమే. టీ20ల్లో సూర్య నుంచి ఇలాంటి స్ట్రైక్ రేట్ ఎక్స్ పెక్ట్ చేయనిదే. మామాలూగా సూర్య ఆడితేనే అతని స్ట్రైక్ రేట్ 150పైనే ఉండేది. కానీ ఈ పొట్టి కప్ లో మాత్రం అతని బ్యాటింగ్ స్లో అయింది. ఇషాన్ కిషన్ 189.20, సంజు శాంసన్ 201.73, శివమ్ దూబె 159.54 స్ట్రైక్ రేట్ తో రన్స్ సాధించారు.
ఇదే కారణమా?
సూర్యకుమార్ రిటైర్మెంట్ నిర్ణయం వెనుక కొన్ని కారణాలు ఉండొచ్చనే కామెంట్లు వస్తున్నాయి. ఇప్పుడు అతని జోరు తగ్గింది. ఇక సూర్యకుమార్ ఏజ్ కూడా 35 పైనే. ఇప్పుడు కేవలం టీ20ల్లో మాత్రమే ఆడుతున్నాడు. టీ20ల్లో కుర్రాళ్లకు ఛాన్స్ ఇవ్వాలని బీసీసీఐ ఆలోచిస్తోంది. ఇలా ఏ రకంగా చూసుకున్నా టీ20 ప్రపంచకప్ తర్వాత స్కై సర్వైవల్ అవడం కష్టమనే అభిప్రాయాలున్నాయి. అందుకే తనంతట తానుగా సూర్య రిటైర్మెంట్ నిర్ణయం తీసుకోబోతున్నాడని అంటున్నారు.
సూర్య స్టాట్స్
సూర్య కుమార్ యాదవ్ తన కెరీర్ లో ఇప్పటివరకూ ఒకే టెస్టు ఆడాడు. 37 వన్డేల్లో ఇండియాకు ప్రాతినిథ్యం వహించాడు. కానీ ప్రదర్శన అంతంతమాత్రమే. కేవలం 25.76 సగటుతో 773 రన్స్ సాధించాడు. ఇక 112 టీ20ల్లో 3272 పరుగులు ఖాతాలో వేసుకున్నాడు.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


