విరాట్ కోహ్లి చేసిన ఈ పోస్టుకు అర్థమేంటి.. రిటైర్మెంట్ పుకార్లకు చెక్ పెట్టినట్లేనా? తగ్గేదేలే అంటున్న స్టార్ బ్యాటర్..

విరాట్ కోహ్లి చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ కోసం వెళ్లిన కోహ్లి.. అక్కడి వెళ్లగానే ఈ పోస్ట్ చేయడం విశేషం. ఈ పోస్టుతో అతడు ఇక రిటైర్మెంట్ పుకార్లకు చెక్ పెట్టినట్లే అని భావిస్తున్నారు.

Updated on: Oct 16, 2025, 14:18:14 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ గురువారం (అక్టోబర్ 16) చేసిన ఓ పోస్ట్ ఆసక్తి రేపుతోంది. శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీలోని వన్డే టీమ్.. ఆస్ట్రేలియాతో జరగబోయే వైట్-బాల్ టూర్ కోసం పెర్త్‌లో దిగిన కొన్ని గంటలకే కోహ్లీ ఈ పోస్ట్ షేర్ చేశాడు. ఈ పోస్ట్ ద్వారా అతడు తన రిటైర్మెంట్ పుకార్లకు చెక్ పెట్టి ఉంటాడని భావిస్తున్నారు. ప్రస్తుతం విరాట్ కేవలం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న విషయం తెలిసిందే.

విరాట్ కోహ్లి చేసిన ఈ పోస్టుకు అర్థమేంటి.. రిటైర్మెంట్ పుకార్లకు చెక్ పెట్టినట్లేనా? తగ్గేదేలే అంటున్న స్టార్ బ్యాటర్ (AFP)
విరాట్ కోహ్లి చేసిన ఈ పోస్టుకు అర్థమేంటి.. రిటైర్మెంట్ పుకార్లకు చెక్ పెట్టినట్లేనా? తగ్గేదేలే అంటున్న స్టార్ బ్యాటర్ (AFP)

విరాట్ కోహ్లి పోస్ట్ ఇలా..

విరాట్ కోహ్లి గురువారం (అక్టోబర్ 16) ఉదయం.. పట్టుదల, మైండ్‌సెట్ గురించి చెప్పే ఒక మెసేజ్‌ని షేర్ చేశాడు. ఓటమి అంటే వెనకడుగు వేయడం కాదని, ప్రయత్నించడం ఎప్పుడైతే ఆపేస్తామో అదే అసలైన ఓటమని అని అతడు అనడం విశేషం.

పట్టు వదలకుండా ప్రయత్నిస్తేనే సక్సెస్ వస్తుందని, తాను ఇప్పుడప్పుడే మొత్తంగా క్రికెట్ కు దూరమవడానికి తాను రెడీగా లేనని చెప్పకనే చెప్పినట్టు ఉంది ఆ పోస్ట్. ఆ ట్వీట్ ఇలా ఉంది.. "ప్రయత్నం ఆపేద్దాం అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో, అప్పుడే నువ్వు నిజంగా ఓడిపోయినట్టు" అని విరాట్ అన్నాడు.

నిజానికి సెప్టెంబర్ 17న భారత ప్రధాని నరేంద్ర మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన తర్వాత బ్రాండ్ యాడ్స్ సంబంధించింది కాకుండా కోహ్లీ పెట్టిన మొదటి ట్వీట్ ఇదే కావడం గమనార్హం. నిజానికి కోహ్లీ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాకి దూరంగా ఉన్నాడు. చివరిసారిగా ఇండియా ఇంగ్లాండ్ టూర్‌లో ఉన్నప్పుడు యాక్టివ్‌గా ఉన్నాడు. అప్పుడు బర్మింగ్‌హామ్, ఓవల్‌లో గిల్ కెప్టెన్సీలోని టెస్ట్ టీమ్ ఆడిన తీరును మెచ్చుకున్నాడు.

ఆస్ట్రేలియా టూర్ ఓ పరీక్షే

విరాట్ కోహ్లీకి ఆస్ట్రేలియా సిరీస్ చాలా ముఖ్యమనే చెప్పాలి. అతని ఇంటర్నేషనల్ క్రికెట్ ఫ్యూచర్ గురించి గట్టిగా రూమర్స్ వస్తున్న టైమ్‌లో ఈ సోషల్ మీడియా పోస్ట్ వచ్చింది. 36 ఏళ్ల కోహ్లీ గతేడాది టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత జూన్‌లో టీ20ల నుంచి రిటైర్ అయ్యాడు. ఆ తర్వాత ఇంగ్లాండ్ టూర్ స్క్వాడ్ ప్రకటించడానికి రెండు వారాల ముందే టెస్ట్ క్రికెట్ నుంచి కూడా షాకింగ్‌గా తప్పుకున్నాడు. కోహ్లితోపాటు రోహిత్ కూడా ఇప్పుడు కేవలం వన్డే ఫార్మాట్‌లో మాత్రమే ఆడుతున్నాడు.

ఇద్దరినీ ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్‌కి ఎంపిక చేయడంతో ఈ చర్చలన్నింటికీ ఫుల్‌స్టాప్ పడుతుందని అందరూ అనుకున్నారు. కానీ రోహిత్‌ని కెప్టెన్సీ నుంచి తీసేశారు. అటు చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, ఇటు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కూడా 2027 వన్డే వరల్డ్ కప్ ప్లాన్స్‌లో వాళ్లు ఉంటారని కచ్చితంగా చెప్పలేదు. వాళ్ల ఏజ్‌ని, 50 ఓవర్ల ఫార్మాట్‌లో వాళ్లకు దొరికే తక్కువ మ్యాచ్‌లను చూసి, టీమ్ మేనేజ్‌మెంట్ ఇప్పుడే ఒక అంచనాకు రావడానికి రెడీగా లేదు.

ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా సిరీస్ ఇటు విరాట్, అటు రోహిత్ లకు కీలకం కానుంది. ఆస్ట్రేలియా సిరీస్ ఆ ఇద్దరికీ చివరి అంతర్జాతీయ సిరీస్ కాదని బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా స్పష్టం చేయడం అభిమానులకు ఊరట కలిగించేదే. దీంతో ఈ మూడు మ్యాచ్‌ల సిరీస్‌తో పాటు, నవంబర్ 30న మొదలయ్యే సౌతాఫ్రికాతో హోమ్ సిరీస్, జనవరిలో న్యూజిలాండ్‌తో ఇంకో సిరీస్‌లో కూడా వాళ్లు తమ సత్తా నిరూపించుకునే అవకాశం ఉంటుంది.

టీమిండియా ఆస్ట్రేలియా టూర్

ఇండియన్ టీమ్ రెండు బ్యాచ్‌లుగా పెర్త్‌కి బయలుదేరింది. కోహ్లీ, రోహిత్, గిల్, శ్రేయస్ అయ్యర్, మరికొందరు బుధవారం (అక్టోబర్ 15) ఉదయం ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నుంచి బయలుదేరిన మొదటి బ్యాచ్‌లో ఉన్నారు. సాయంత్రం బయలుదేరిన బ్యాచ్‌లో ఫీల్డింగ్ కోచ్ టి. దిలీప్, బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్, బ్యాటింగ్ కోచ్ సితాన్షు కొటక్, స్పిన్నర్ కుల్దీప్ యాదవ్, ఆల్-రౌండర్ అక్షర్ పటేల్, పేసర్ మహ్మద్ సిరాజ్ ఉన్నారు.

ఆస్ట్రేలియాకి లాంగ్ ఫ్లైట్ జర్నీ అవ్వడంతో ఇండియన్ టీమ్ గురువారం రెస్ట్ తీసుకునే అవకాశం ఉంది. బహుశా శుక్రవారం (అక్టోబర్ 17) నుంచి వన్డే సిరీస్ కోసం తమ ట్రైనింగ్ మళ్లీ మొదలుపెట్టొచ్చు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More