...
...
Next Story

కొత్త ఏడాదిలో టీమిండియా పూర్తి షెడ్యూల్ ఇదే.. రెండు టీ20 వరల్డ్ కప్‌లతో 2026లో క్రికెట్ ఫ్యాన్స్‌కు పండగే

వచ్చే ఏడాది అంటే 2026లో ఇండియన్ మెన్స్, వుమెన్స్ క్రికెట్ టీమ్స్ ఆడబోయే టోర్నీలు పూర్తి షెడ్యూల్ ఇక్కడ చూడండి. ఇటు మెన్స్, అటు వుమెన్స్ టీ20 వరల్డ్ కప్ లతో రాబోయే ఏడాది క్రికెట్ ఫ్యాన్స్ కు పండగే అని చెప్పొచ్చు.

Published on: Dec 22, 2025, 16:36:33 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

ఈ ఏడాది టీమిండియాకు మిశ్రమ ఫలితాలను ఇచ్చింది. వన్డే, టీ20ల్లో (వైట్ బాల్) ఛాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్, మహిళల వరల్డ్ కప్ గెలిచి అదరగొట్టినా.. టెస్టుల్లో (రెడ్ బాల్) మాత్రం దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా చేతిలో చిత్తుగా ఓడిపోయి నిరాశపరిచింది. ఇప్పుడు 2026లో టీమిండియా షెడ్యూల్ మరింత బిజీగా ఉంది.

కొత్త ఏడాదిలో టీమిండియా పూర్తి షెడ్యూల్ ఇదే.. రెండు టీ20 వరల్డ్ కప్‌లతో 2026లో క్రికెట్ ఫ్యాన్స్‌కు పండగే (PTI)
కొత్త ఏడాదిలో టీమిండియా పూర్తి షెడ్యూల్ ఇదే.. రెండు టీ20 వరల్డ్ కప్‌లతో 2026లో క్రికెట్ ఫ్యాన్స్‌కు పండగే (PTI)

ఇందులో పురుషుల టీ20 ప్రపంచకప్, మహిళల టీ20 ప్రపంచకప్, అండర్-19 ప్రపంచకప్ వంటి మెగా ఈవెంట్లు ఉన్నాయి. గౌతమ్ గంభీర్ కోచింగ్‌లో టెస్టుల్లో తడబడ్డా.. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో టీమిండియా సత్తా చాటింది. ఇక రాబోయే 2026 క్రికెట్ క్యాలెండర్ చాలా బిజీగా ఉండబోతోంది. పురుషుల, మహిళల క్రికెట్ జట్ల పూర్తి షెడ్యూల్ ఇక్కడ చూడండి.

ఇండియా మెన్స్ క్రికెట్ టీమ్ షెడ్యూల్ ఇలా..

ఈ ఏడాది భారత్ వేదికగా టీ20 ప్రపంచకప్ జరగనుండటం విశేషం.

జనవరి 15 - ఫిబ్రవరి 6 (అండర్ 19 వరల్డ్ కప్): నమీబియా, జింబాబ్వే వేదికగా అండర్-19 ప్రపంచకప్ జరగనుంది. భారత్ గ్రూప్-ఏలో బంగ్లాదేశ్, న్యూజిలాండ్, యుఎస్ఏలతో తలపడనుంది.

జనవరి (ఇండియాలో న్యూజిలాండ్ టూర్): వరల్డ్ కప్ సన్నాహకాల్లో భాగంగా న్యూజిలాండ్ జట్టు భారత్‌లో పర్యటించి 3 టీ20లు, 3 వన్డేలు ఆడనుంది.

ఫిబ్రవరి 7 నుంచి (టీ20 వరల్డ్ కప్): 2016 తర్వాత తొలిసారి భారత్ టీ20 ప్రపంచకప్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. గ్రూప్-ఏలో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్, నెదర్లాండ్స్, నమీబియా, యుఎస్ఏలతో భారత్ పోటీపడుతుంది.

జూన్ (ఇండియాలో ఆఫ్ఘనిస్తాన్ టూర్): ఆఫ్ఘనిస్తాన్ జట్టు భారత్‌కు వచ్చి ఒక టెస్ట్, 3 వన్డేలు ఆడుతుంది.

జులై (ఇంగ్లండ్‌లో టీమిండియా టూర్): ఇంగ్లండ్ గడ్డపై టీమిండియా 3 వన్డేలు, 5 టీ20లు ఆడనుంది.

ఆగస్టు (శ్రీలంకలో టీమిండియా టూర్): శ్రీలంకలో పర్యటించి 2 టెస్టులు ఆడుతుంది (ఇవి WTC సైకిల్ లో భాగం).

ఆగస్టు/సెప్టెంబర్: దుబాయ్ వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో 3 టీ20లు ఆడే అవకాశం ఉంది.

సెప్టెంబర్ - అక్టోబర్ (ఇండియాలో వెస్టిండీస్ టూర్): వెస్టిండీస్ జట్టు భారత్‌లో పర్యటించి 3 వన్డేలు, 5 టీ20లు ఆడుతుంది.

అక్టోబర్ తర్వాత: న్యూజిలాండ్ పర్యటన (అన్ని ఫార్మాట్లు), డిసెంబర్‌లో శ్రీలంకతో స్వదేశంలో సిరీస్ ఉన్నాయి.

మహిళల క్రికెట్ షెడ్యూల్

మహిళల క్రికెట్‌లోనూ ఈ ఏడాది కీలక టోర్నీలు ఉన్నాయి. ముఖ్యంగా లార్డ్స్ మైదానంలో టెస్ట్ మ్యాచ్ ఆడనుండటం విశేషం.

జనవరి 9 - ఫిబ్రవరి 5 (డబ్ల్యూపీఎల్): మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) ఈసారి జనవరిలోనే మొదలవుతుంది.

ఫిబ్రవరి - మార్చి: ఆస్ట్రేలియా పర్యటనలో 3 టీ20లు, 3 వన్డేలు, ఒక టెస్ట్ మ్యాచ్ ఆడుతారు.

మే - జూన్: ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్.

జూన్ 12 - జులై 5 (వుమెన్స్ టీ20 వరల్డ్ కప్): ఇంగ్లాండ్ వేదికగా మహిళల టీ20 ప్రపంచకప్ జరగనుంది. భారత్ గ్రూప్ లో ఆస్ట్రేలియా, పాకిస్థాన్, దక్షిణాఫ్రికా ఉన్నాయి.

జులై: క్రికెట్ మక్కాగా పిలిచే లండన్‌లోని లార్డ్స్ (Lord's) మైదానంలో తొలిసారిగా భారత మహిళల జట్టు టెస్ట్ మ్యాచ్ ఆడనుంది.

ఆగస్టు: మహిళల ఆసియా కప్

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe