580 కి.మీ రేంజ్ ఇచ్చే ఎంజీ సైబర్‌స్టర్ కొన్న షఫాలీ వర్మ- ధర తెలిస్తే షాక్..!
ప్రముఖ భారత మహిళల జట్టు క్రికెటర్ షఫాలీ వర్మ కొత్త కారు కొనుగోలు చేశారు. దాని పేరు 'ఎంజీ సైబర్‌స్టర్'. ఇదొక ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారు. ఈ మోడల్ రేంజ్, ధర, ఫీచర్స్ వంటి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
ఐసీసీ మహిళల క్రికెట్ ప్రపంచకప్ 2025లో భారత మహిళల క్రికెట్ జట్టు సాధించిన అద్భుత విజయం అభిమానులకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. దేశ మహిళల క్రికెట్ చరిత్రలో ఇదొక నూతన శకం అని అందరు అభివర్ణిస్తున్నారు. ఇక ఇప్పుడు ఈ ఉత్సాహాన్ని మరింత పెంచుతూ.. స్టార్ బ్యాటర్ షఫాలీ వర్మ తనకు తాను ఒక స్పోర్ట్స్ కారును బహుమతిగా ఇచ్చుకున్నారు. అదే ఎంజీ సైబర్‌స్టర్. దీని ఎక్స్‌షోరూం ధర రూ. 75లక్షలు

ఎంజీ సైబర్‌స్టర్ డెలివరీ..
షఫాలీ వర్మ తన ఎంజీ సైబర్‌స్టర్‌తో ఉన్న ఫొటోలను ఇటీవలే షేర్ చేసింది ఎంజీ ఇండియా. ఈ ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారును రెడ్ కార్పెట్‌పై పార్క్ చేసి ఉన్న క్రికెట్ మైదానంలో ఆమె కనిపించారు. ఈ ప్రత్యేక డెలివరీ సందర్భంగా, షఫాలీ తన కారు రంగుకు సరిపోయే దుస్తులను ధరించి, ఈ ఈవెంట్‌కు ప్రత్యేక శైలిని జోడించారు.
కారు డెలివరీకి సంబంధించిన వీడియో కూడా ఆన్‌లైన్‌లో పోస్ట్ చేశారు. ఆ క్లిప్‌లో షఫాలీ మైదానానికి చేరుకుని సైబర్‌స్టర్‌ని డెలివరీ తీసుకున్నారు. అనంతరం ఆమె కారును పరిశీలించారు.
ఎంజీ సైబర్‌స్టర్ స్పెసిఫికేషన్లు..
ఇక ఎంజీ సైబర్‌స్టర్ వివరాల విషయానికొస్తే, ఇందులో 77 కేడబ్ల్యూహెచ్ అల్ట్రా-తిన్ బ్యాటరీ ప్యాక్ ఉంది. ఇది డ్యూయల్-మోటార్ ఆల్-వీల్-డ్రైవ్ పవర్‌ట్రైన్‌తో కనెక్ట్ చేసి ఉంటుంది. ఈ బ్యాటరీ ప్యాక్ పరిశ్రమలోనే అత్యంత సన్ననిదిగా (కేవలం 110 ఎంఎం) గుర్తింపు తెచ్చుకుంది.
ఈ సెటప్ 510 పీఎస్ పవర్‌ని, 725 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
లాంచ్ కంట్రోల్ మోడ్ ఉపయోగించి, ఇది కేవలం 3.2 సెకన్లలో 0 నుంచి 100 కేఎంపీహెచ్ వేగాన్ని చేరుకోగలదు!
ఈ ఎంజీ సైబర్‌స్టర్ సింగిల్ ఛార్జ్‌తో 580 కి.మీ రేంజ్‌ని ఇస్తుంది.
ఎంజీ సైబర్‌స్టర్- డిజైన్, ఇంటీరియర్ ఫీచర్లు..
ఎంజీ సైబర్‌స్టర్ తన సొగసైన కూపే డిజైన్‌తో ప్రత్యేకంగా నిలుస్తుంది. ప్రత్యేకించి ఆకర్షణీయమైన ఎలక్ట్రానిక్ సిజర్ డోర్స్‌తో ఇది హైలైట్ అవుతుంది. ముందు భాగంలో షార్ప్ ఎల్ఈడీ హెడ్‌లైట్‌లు, పెద్ద ఎయిర్ వెంట్స్ ఉన్నాయి. 20-ఇంచ్ అల్లాయ్ వీల్స్, ఆరో (బాణం) ఆకారంలో ఉన్న వెనుక ఎల్ఈడీ టెయిల్‌లైట్లు దీని బోల్డ్ లుక్‌ను పెంచుతాయి.
లోపలి భాగంలో, కేబిన్ టెక్నాలజీతో నిండి ఉంది. ఇందులో డ్యూయల్ 7-ఇంచ్ డిస్‌ప్లేలు, 10.25-ఇంచ్ డిజిటల్ క్లస్టర్, నిలువు ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ ఉన్నాయి.
హైదరాబాద్‌లో ఎంజీ సైబర్‌స్టర్ ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారు ఆన్‌రోడ్ ప్రైజ్ రూ. 78.80 లక్షలుగా ఉంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


