మన వంటగదిలో నిత్యం వాడే స్పూన్ రూపాన్ని కొత్తగా మార్చగలమా? 'ఇక దీని రూపం మారదు' అన్న మాటను సవాలుగా తీసుకుని, ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన వ్యాపార వేదిక ‘షార్క్ ట్యాంక్ యూఎస్‌ఏ’లో రూ. 3 కోట్ల పెట్టుబడి సాధించాడు ఒక భారతీయ యువకుడు. గుజరాత్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (ఎన్ఐడీ) అహ్మదాబాద్ మాజీ విద్యార్థి, ‘పాలిగాన్స్ డిజైన్’ వ్యవస్థాపకుడు రాహుల్ అగర్వాల్ రూపొందించిన 'పాలిగాన్స్' ఫ్లాట్ మెజరింగ్ స్పూన్ ఇప్పుడు అంతర్జాతీయ డిజైన్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
ఒరిగామి కళతో పుట్టిన వినూత్న ఆలోచన!

జపాన్ సాంప్రదాయ కాగితపు మడత కళ 'ఒరిగామి' నుంచి స్ఫూర్తి పొంది రాహుల్ అగర్వాల్ ఈ వినూత్న స్పూన్‌ను తయారు చేశారు. సాధారణంగా వంటగదిలో వివిధ పరిమాణాల్లో పొడులు లేదా ద్రవాలను కొలవడానికి ఆరు రకాల కొలతల గరిటెలు (మెజరింగ్ స్పూన్ సెట్) వాడాల్సి వస్తుంది. కానీ పాలిగాన్స్ కేవలం రెండు సన్నని, చదునైన కార్డుల రూపంలో ఉంటుంది. వీటి మందం కేవలం 2.8 ఎంఎం మాత్రమే!
మన వేళ్లతో తగినంత ఒత్తిడి ఇచ్చి పట్టుకున్నప్పుడు ఇది కావాల్సిన పరిమాణంలోకి మడతపడుతుంది. చిన్న స్పూన్ ద్వారా 1/4, 1/2, 1 టీస్పూన్ కొలతలను, పెద్ద స్పూన్ ద్వారా 1/2, 1, 2 టేబుల్ స్పూన్ల కొలతలను కచ్చితత్వంతో తీసుకోవచ్చు. ఈ స్పూన్లను అత్యంత నాణ్యమైన ఫుడ్-గ్రేడ్ థర్మోప్లాస్టిక్, హైడ్రోఫోబిక్ సిలికాన్, శక్తివంతమైన నియోడిమియం అయస్కాంతాలతో (Neodymium Magnets) తయారు చేశారు.
'స్పూన్ డిజైన్ మార్చలేవు' అన్న సీనియర్.. సవాలుగా తీసుకున్న రాహుల్!
ఈ ఆవిష్కరణ వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. 2014లో రాహుల్ అగర్వాల్ ఎన్ఐడీ అహ్మదాబాద్‌లో చదువుతున్నప్పుడు, ఒక సీనియర్ ఆయనతో మాట్లాడారు. స్పూన్ డిజైన్ తన తుది రూపానికి చేరిపోయిందని, ఇక దీన్ని ఎవరూ మెరుగుపరచలేరని చెప్పారు. అసలు వంట చేయడం కూడా రాని రాహుల్, ఆ మాటను ఒక సవాలుగా తీసుకున్నారు.
{{/usCountry}}ఈ ఆవిష్కరణ వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. 2014లో రాహుల్ అగర్వాల్ ఎన్ఐడీ అహ్మదాబాద్‌లో చదువుతున్నప్పుడు, ఒక సీనియర్ ఆయనతో మాట్లాడారు. స్పూన్ డిజైన్ తన తుది రూపానికి చేరిపోయిందని, ఇక దీన్ని ఎవరూ మెరుగుపరచలేరని చెప్పారు. అసలు వంట చేయడం కూడా రాని రాహుల్, ఆ మాటను ఒక సవాలుగా తీసుకున్నారు.
{{/usCountry}}కేవలం మూడు రోజుల్లోనే చదునైన ప్యానెల్ ఆధారంగా స్పూన్ తయారు చేసే ప్రాథమిక ఆలోచనను రూపొందించారు. ఆ తర్వాత ఏళ్ల తరబడి శ్రమించి, రకరకాల ప్రయోగాలు చేసి తుది రూపాన్ని తీసుకొచ్చారు. ఈ వినూత్న డిజైన్‌కు అంతర్జాతీయంగా ఇప్పటికే 20కి పైగా ప్రముఖ డిజైన్ అవార్డులు వరించడం విశేషం.
షార్క్ ట్యాంక్‌లో 350000 డాలర్ల డీల్ సొంతం!
ప్రముఖ బిజినెస్ రియాలిటీ షో 'షార్క్ ట్యాంక్ యూఎస్‌ఏ' సీజన్ 18, ఎపిసోడ్ 4 లో రాహుల్ అగర్వాల్ తన 'పాలిగాన్స్' ఉత్పత్తులను ప్రదర్శించారు. ఈ ఎపిసోడ్‌లో ప్రముఖ భారతీయ సంతతి నటి, ప్రొడ్యూసర్ మైండీ కాలింగ్ గెస్ట్ షార్క్‌గా వ్యవహరించారు.
ఈ వినూత్న డిజైన్‌ను చూసి ముగ్ధులైన ప్రముఖ ఇన్వెస్టర్లు లోరీ గ్రీనర్, మైండీ కాలింగ్ కలిసి రాహుల్ కంపెనీకి 350,000 డాలర్లు (సుమారు రూ. 3.32 కోట్లు) పెట్టుబడి ఆఫర్ చేశారు. దీనికి ప్రతిఫలంగా కంపెనీలో 8 శాతం ఈక్విటీ, మరో 2 శాతం అడ్వైజరీ షేర్లను (మొత్తం 10%) రాహుల్ వారికి కేటాయించారు. ఈ డీల్‌తో పాలిగాన్స్ డిజైన్స్ కంపెనీ విలువ 3.5 మిలియన్ డాలర్లకు చేరింది. మైండీ కాలింగ్ ఈ డిజైన్‌ను "అద్భుతమైన ఆవిష్కరణ, నిత్య జీవితంలో ఎంతో ఉపయోగకరం" అని ప్రశంసించారు.
సరికొత్త ఆలోచనలకు ఎల్లప్పుడూ ఆదరణ ఉంటుందని, సాధారణ వంటగది వస్తువులోనూ విప్లవాత్మక మార్పులు తెచ్చిన భారతీయ డిజైనర్ రాహుల్ అగర్వాల్ ప్రయాణం ప్రపంచవ్యాప్తంగా ఉన్న యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్లకు స్ఫూర్తిగా నిలుస్తోంది.