US Israel Strikes : అప్రమత్తంగా ఉండండి...! ఇరాన్‌, ఇజ్రాయెల్‌లోని పౌరులకు భారత ఎంబసీ అడ్వైజరీ

ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో భారత్ అలర్ట్ అయింది. ఇజ్రాయెల్‌, ఇరాన్‌లోని భారత రాయబార కార్యాలయాలు అడ్వైజరీ జారీ చేశాయి. అనవసర ప్రయాణాలు చేయొద్దంటూ భారత పౌరులను హెచ్చరించాయి. 

Published on: Feb 28, 2026, 17:03:24 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడులతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు తాము కూడా ప్రతీకార దాడులు చేయబోతున్నామని ఇరాన్ కూడా స్పష్టం చేసింది. దీంతో ఆయా దేశాల్లోలని పౌరులు భయాందోళన పరిస్థితుల మధ్య బిక్కుబిక్కుమంటున్నారు. ఈ ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో ఇజ్రాయెల్‌, ఇరాన్‌లోని భారత రాయబార కార్యాలయాలు అడ్వైజరీ జారీ చేశాయి. అనవసర ప్రయాణాలు చేయవద్దంటూ భారత పౌరులను హెచ్చరించాయి.

అప్రమత్తంగా ఉండండి...! ఇరాన్‌, ఇజ్రాయెల్‌లోని పౌరులకు భారత ఎంబసీ అడ్వైజరీ
అప్రమత్తంగా ఉండండి...! ఇరాన్‌, ఇజ్రాయెల్‌లోని పౌరులకు భారత ఎంబసీ అడ్వైజరీ

జాగ్రత్తగా ఉండాలి - భారత ఎంబసీ

అంతేకాకుండా గల్ఫ్ ప్రాంతంలోని ఇతర దేశాలతో పాటు యూఏఈ, సౌదీ అరేబియా, జోర్డాన్ లోని భారత రాయబార కార్యాలయాలు కూడా హెచ్చరికలు జారీ చేశాయి. పౌరులు అత్యంత జాగ్రత్తగా ఉండాలని…. స్థానిక అధికారులు జారీ చేసిన సలహాలను జాగ్రత్తగా పాటించాలని కోరాయి.

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) లోని భారత రాయబార కార్యాలయం పేర్కొన్న వివరాల ప్రకారం… "అనవసరమైన ప్రయాణాలకు దూరంగా ఉండండి. తగిన జాగ్రత్తలు తీసుకోండి. అప్రమత్తంగా ఉండాలి. యుఎఇ అధికారులు మరియు రాయబార కార్యాలయం జారీ చేసిన భద్రతా మార్గదర్శకాలు మరియు సలహాలను పాటించాలి" అని కోరింది.

అబుదాబిలోని భారత రాయబార కార్యాలయం, దుబాయ్ లోని కాన్సులేట్ జనరల్ యథాతథంగా పనిచేస్తున్నాయి. టోల్ ఫ్రీ నంబర్ (800-46342), వాట్సాప్ నంబర్ (971543090571) తో పాటు అత్యవసర సందర్భాల్లో అక్కడ ఉన్న భారతీయ పౌరులను సంప్రదించడానికి రెండు ఇమెయిల్ ఐడిలను (pbsk.dubai@mea.gov.in మరియు ca.abudhabi@mea.gov.in) అందుబాటులోకి తీసుకువచ్చారు.

సౌదీ అరేబియాలోని భారతీయులందరూ అప్రమత్తంగా ఉండాలని…. దేశంలో ప్రబలంగా ఉన్న భద్రతా మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని రియాద్ లోని భారత రాయబార కార్యాలయం కోరింది. 00-966-11-4884697, 00-966-542126748 (వాట్సాప్ మాత్రమే), 800 247 1234 (టోల్ ఫ్రీ mea.gov.in) నంబర్లను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు సూచించింది.

“ప్రస్తుత ప్రాంతీయ పరిస్థితుల దృష్ట్యా… జోర్డాన్లోని భారతీయ పౌరులు మరియు పర్యాటకులందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో ఉంటే ఫోన్ నంబర్ (00962-770 422 276) ను సంప్రదించండి” అని జోర్డాన్ లోని భారత ఎంబసీ కార్యాలయం సూచించింది.

విమాన ప్రయాణాలపై ఎఫెక్ట్…!

ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య యుద్ధం ముదురుతున్న నేపథ్యంలో విమాన ప్రయాణాలకు భారీ అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం అధికారులు హెచ్చరించారు. భద్రతా కారణాల దృష్ట్యా పలు విమానయాన సంస్థలు తమ మార్గాలను మార్చుకోవడం లేదా సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేయడం వంటి చర్యలు తీసుకుంటున్నాయని పేర్కొన్నారు.

ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని విదేశాలకు వెళ్లే ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని విమానాశ్రయం అడ్వైజరీ సూచించింది. ఢిల్లీ విమానాశ్రయం నుండి యూరప్, అమెరికా, మధ్యప్రాచ్య దేశాలకు వెళ్లే ప్రయాణికులపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More