అమెరికా- ఇజ్రాయెల్ జాయింట్ ఆపరేషన్..! ఇరాన్ పై భీకర దాడి
US Israel Attacks on Iran : అణు ఒప్పందంపై అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా క్షిపణి దాడులకు దిగింది.
అణు ఒప్పందంపై అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. శనివారం ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ క్షిపణి దాడులకు పాల్పడింది. టెహ్రాన్ అంతటా భారీ పేలుళ్లు వినిపించాయి.

ఇరాన్ దేశ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ నివాసం, నిఘా ప్రధాన కార్యాలయం సహా మొత్తం 30 ప్రాంతాలు లక్ష్యంగా ఈ దాడులు జరిగాయి. ఈ దాడులను ఇరాన్ మీడియా కూడా ధ్రువీకరించింది.
మిలటరీ స్థావరాలే లక్ష్యంగా ఈ దాడులు జరుగుతున్నాయి. ‘లయన్స్ రోర్’ పేరుతో ఇజ్రాయెల్ ఆపరేషన్ చేపట్టగా…భారీ సంఖ్యలో ఇరాన్ సైనికులు మరణించినట్లు తెలుస్తోంది. టెహ్రాన్, ఇస్ఫహాన్ సహా కీలక నగరాల్లో దాడులు జరిగాయి. ఇరాన్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయి.
స్పందించిన ట్రంప్…
ఇరాన్ మీద దాడులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఇరాన్ అణు ఆయుధాలను మళ్లీ తయారు చేస్తుందన్నారు. అమెరికా సైన్యం ఇరాన్ పై దాడులు చేపట్టిందన్నారు. అమెరికా ప్రజలకు పొంచి ఉన్న ప్రమాదాన్ని ఎదర్కొనేందుకు దాడులు చేపట్టామని ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా సైనిక స్థావరాలకు ముప్పు ఉండటం వల్లే దాడులు చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. మరోవైపు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మాట్లాడుతూ… ఈ జాయింట్ ఆపరేషన్ ను ధ్రువీకరించారు. ఈ దాడుల సమయంలో 86 ఏళ్ల ఖమేనీ తన కార్యాలయాల్లో ఉన్నారా లేదా అనేది తెలియాల్సి ఉంది.
ఇరాన్ ప్రతిదాడులు…
ఇక ఇజ్రాయెల్ పై ఇరాన్ ప్రతిదాడులు చేపట్టింది. ఇజ్రాయెల్ పై బాలిస్టిక్ మిస్సైళ్లతో దాడికి దిగింది. ఇజ్రాయెల్ రాజధాని టెల్అవీవ్ లక్ష్యంగా ప్రతిదాడులు చేస్తోంది. 35కి పైగా మిస్సైళ్లను ప్రయోగించినట్లు తెలుస్తోంది.
అమెరికా, ఇజ్రాయెల్ దాడులపై ఇరాన్ కూడా తగ్గే ప్రసక్తే లేదని చెబుతోంది. యుద్ధం మీరు ప్రారంభించారు… మేం ముగింపు పలుకుతామని హెచ్చరిస్తోంది. యుద్ధానికి ముగింపు ఊహించని రీతిలో ఉంటుందని వార్నింగ్ ఇచ్చింది.
ఇక ఊహించని దాడి ఘటనతో ఇరాన్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ప్రాణాలను అరచేతిలో పట్టుకుని బిక్కు బిక్కుమంటూ అక్కడి ప్రజలు గడుపుతున్నారు. మరోవైపు ఇరాన్ ప్రతిదాడులతో ఇజ్రాయెల్‌లో కూడా భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. మిస్సైల్ దాడులకు పాల్పడుతున్న నేపథ్యంలో…. ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉండగా…. ఇరాన్ తన గగనతలాన్ని మూసివేసింది. మొబైల్ ఫోన్ సేవలను నిలిపివేసింది.టెహ్రాన్ అంతటా పేలుళ్లు మోగడంతో పైలట్లకు హెచ్చరికలు జారీ అయ్యాయి.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

