Indian Navy Recruitment : ఇండియన్ నేవీలో అగ్నివీర్ ఎస్ఎస్ఆర్, ఎంఆర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల..
Indian Navy Recruitment : 2027 బ్యాచ్‌కు సంబంధించి అగ్నివీర్ ఎస్ఎస్ఆర్, ఎంఆర్, స్పెషలిస్ట్ సెయిలర్ (మెడికల్) పోస్టుల భర్తీకి దరఖాస్తులను భారత నౌకాదళం ఆహ్వానిస్తోంది. అర్హులైన అభ్యర్థులు మార్చ్ 14 నుంచి ఏప్రిల్ 6, 2026 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. వివరాల్లోకి వెళితే..
దేశ రక్షణ రంగంలో చేరాలనుకునే యువతకు భారత నౌకాదళం గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. అగ్నివీర్ పథకం కింద అగ్నివీర్ ఎస్ఎస్ఆర్, ఎంఆర్, మెడికల్ సెయిలర్ వంటి విభాగాల్లో ఖాళీలను భర్తీ చేసేందుకు తాజాగా నోటిఫికేషన్ వెలువడింది. ఈ నియామక ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలు, అర్హతలు, ఎంపిక విధానాన్ని ఇక్కడ తెలుసుకోండి.

ఇండియన్ నేవీ అగ్నివీర్ రిక్రూట్మెంట్ 2026- ముఖ్యమైన తేదీలు..
దరఖాస్తు ప్రారంభం: మార్చి 14, 2026
చివరి తేదీ: ఏప్రిల్ 6, 2026
(అభ్యర్థులు గడువులోపు దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది.)
దరఖాస్తు సవరణ : ఏప్రిల్ 10, 11 తేదీల్లో అవకాశం ఉంటుంది.
పరీక్ష తేదీ : మే 2026 (తాత్కాలికం)
ఫలితాల విడుదల: జూన్ 2026
ఇండియన్ నేవీ అగ్నివీర్ రిక్రూట్మెంట్ 2026- పోస్టుల వారీగా విద్యా అర్హతలు..
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కనీసం 50% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.
అగ్నివీర్ ఎంఆర్ : 10వ తరగతి ఉత్తీర్ణత.
అగ్నివీర్ ఎస్ఎస్ఆర్ : ఇంటర్మీడియట్ (12వ తరగతి)లో గణితం, భౌతికశాస్త్రం చదివి ఉండాలి. లేదా మూడేళ్ల ఇంజనీరింగ్ డిప్లొమా పూర్తి చేసిన వారు కూడా అర్హులే.
అగ్నివీర్ ఎస్ఎస్ఆర్ (మెడికల్): ఇంటర్మీడియట్‌లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ (పీసీబీ) సబ్జెక్టులు కలిగి ఉండాలి.
గమనిక: వయోపరిమితి ఒక్కో పోస్టుకు భిన్నంగా ఉంటుంది. అభ్యర్థులు పూర్తి వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్‌ను చూడాలని సూచించడమైనది.
ఇండియన్ నేవీ అగ్నివీర్ రిక్రూట్మెంట్ 2026- ఎంపిక విధానం..
నౌకాదళంలో ఎంపిక ప్రక్రియ అత్యంత పారదర్శకమైన, కఠినమైన దశల్లో జరుగుతుంది.
దశ-1 (ఐఎన్ఈటీ): కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష
షార్ట్‌లిస్టింగ్: రాత పరీక్షలో మెరిట్ సాధించిన వారిని తదుపరి దశకు ఎంపిక చేస్తారు.
దశ-2 (పీఎఫ్‌టీ): శారీరక సామర్థ్య పరీక్షలు. ఇందులో రన్నింగ్, స్క్వాట్స్, పుష్-అప్స్, సిట్-అప్స్ ఉంటాయి.
రాత పరీక్ష అండ్ వైద్య పరీక్ష: ఫిజికల్ టెస్ట్ అనంతరం మరో రాత పరీక్ష, సమగ్ర వైద్య పరీక్షలు నిర్వహిస్తారు.
శిక్షణ: తుది మెరిట్ జాబితాలో నిలిచిన వారికి ఐఎన్ఎస్ చిల్కాలో శిక్షణ ఇస్తారు.
ఇండియన్ నేవీ అగ్నివీర్ రిక్రూట్మెంట్ 2026- దరఖాస్తు చేయడం ఎలా?
ఆసక్తి గల అభ్యర్థులు ఇండియన్ నేవీ అధికారిక వెబ్‌సైట్ సందర్శించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
పరీక్ష ఫీజు: రూ. 550 చెల్లించాల్సి ఉంటుంది.
పురుషులు, మహిళా అభ్యర్థులు ఇద్దరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
భారత నౌకాదళంలో చేరి దేశానికి సేవ చేయాలనుకునే వారికి ఇది ఒక సువర్ణావకాశం. మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ను క్రమం తప్పకుండా చూస్తూ ఉండండి.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


