దేశంలోని ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసీఎల్) నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. వివిధ విభాగాల్లో ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రకటించింది. గ్రాడ్యుయేట్ ఇంజనీర్, మార్కెటింగ్ ఆఫీసర్, లా ఆఫీసర్, అసిస్టెంట్ క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్ వంటి పలు కీలక పోస్టులను ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు సెప్టెంబర్ 3వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
ఐఓసీఎల్ రిక్రూట్‌మెంట్ 2026- ముఖ్యమైన తేదీలు..
ఆగస్ట్ 14న విడుదలైన ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ అదే రోజున ప్రారంభమైంది.
దరఖాస్తుకు చివరి తేదీ: సెప్టెంబర్ 3 (సాయంత్రం 5 గంటల వరకు)
అడ్మిట్ కార్డుల విడుదల: సెప్టెంబర్ 15
కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ): సెప్టెంబర్ 24 (తాత్కాలికం)
అయితే, ఇవి టెంటెటివ్ డేట్స్ మాత్రమే అని, ఈ తేదీల్లో మార్పులు ఉండే అవకాశం ఉందని, అభ్యర్థులు ఎప్పటికప్పుడు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని ఇండియన్ ఆయిల్ స్పష్టం చేసింది.
ఐఓసీఎల్ రిక్రూట్‌మెంట్ 2026- అర్హత, ఎక్స్‌పీరియెన్స్..
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ రిక్రూట్‌మెంట్ 2026 కోసం అప్లై చేస్తున్న అభ్యర్థుల వయోపరిమితి జులై 1, 2026 నాటికి ఈ కింది విధంగా ఉండాలి:
గ్రాడ్యుయేట్, డిప్లొమా ఇంజనీర్లు: 26 సంవత్సరాలు మించకూడదు.
మార్కెటింగ్ ఆఫీసర్: 28 సంవత్సరాలు.
లా ఆఫీసర్, అసిస్టెంట్ క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్: 30 సంవత్సరాలు.
రిజర్వుడ్ కేటగిరీల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోసడలింపు వర్తిస్తుంది. ఇకపోతే, లా ఆఫీసర్, అసిస్టెంట్ క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్ పోస్టులకు మాత్రం నిర్దిష్టమైన పని అనుభవం తప్పనిసరి చేశారు. లా ఆఫీసర్ పోస్టుకు దరఖాస్తు చేసేవారు కనీసం రెండేళ్ల లీగల్ ప్రాక్టీస్ అనుభవం కలిగి ఉండాలి.
ఐఓసీఎల్ రిక్రూట్‌మెంట్ 2026- ఎంపిక విధానం..
అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో భాగంగా మొదట కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ) నిర్వహిస్తారు. ఇందులో ప్రతిభ కనబరిచినవారికి గ్రూప్ డిస్కషన్, గ్రూప్ టాస్క్, పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటాయి.
{{/usCountry}}అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో భాగంగా మొదట కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ) నిర్వహిస్తారు. ఇందులో ప్రతిభ కనబరిచినవారికి గ్రూప్ డిస్కషన్, గ్రూప్ టాస్క్, పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటాయి.
{{/usCountry}}సీబీటీ పరీక్షలో మొత్తం 100 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు ఉంటాయి. జనరల్ ఆప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లీష్‌తో పాటు సంబంధిత సబ్జెక్ట్ నాలెడ్జ్ నుంచి ప్రశ్నలు వస్తాయి. ప్రతి సరైన సమాధానానికి ఒక మార్కు ఉంటుంది. అలాగే ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కుల చొప్పున నెగెటివ్ మార్కింగ్ వర్తిస్తుంది. ఫైనల్ మెరిట్ జాబితాలో సీబీటీకి 85 శాతం, గ్రూప్ డిస్కషన్‌కు 5 శాతం, ఇంటర్వ్యూకి 10 శాతం వెయిటేజీ కేటాయించారు. జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులు ప్రతి విభాగంలో కనీసం 40 శాతం, ఓవరాల్‌గా 45 శాతం మార్కులు సాధించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఇది 35 శాతం (సెక్షన్), 40 శాతం (ఓవరాల్)గా ఉంది.
ఐఓసీఎల్ రిక్రూట్‌మెంట్ 2026- వేతనాలు..
ఐఓసీఎల్ రిక్రూట్‌మెంట్ 2026కి ఎంపికైన అభ్యర్థులకు గ్రేడ్‌ను బట్టి భారీ వేతనాలు లభిస్తాయి.
గ్రేడ్ ఏ: ప్రారంభ మూలవేతనం నెలకు రూ. 50,000 నుంచి రూ. 1.6లక్షల వరకు ఉంటుంది. వార్షిక సీటీసీ సుమారు రూ. 18.4 లక్షల వరకు లభిస్తుంది.
గ్రేడ్ ఏ0: ప్రారంభ మూలవేతనం నెలకు రూ. 40,000 నుంచి రూ. 1.4లక్షల వరకు ఉంటుంది. వార్షిక సీటీసీ దాదాపు రూ. 14.8 లక్షలు.
గ్రేడ్ ఈ0: ప్రారంభ మూలవేతనం నెలకు రూ. 30,000 నుంచి రూ. 1.2లక్షల వరకు ఉంటుంది. వార్షిక సీటీసీ సుమారు రూ. 11.1 లక్షలు.
వీటితో పాటు డీఏ, హెచ్‌ఆర్‌ఏ, మెడికల్ సదుపాయాలు, ప్రావిడెంట్ ఫండ్ వంటి అనేక రకాల అలవెన్సులు వర్తిస్తాయి.
ఐఓసీఎల్ రిక్రూట్‌మెంట్ 2026- దరఖాస్తు విధానం, ఫీజు..
ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు దరఖాస్తు రుసుము నుంచి మినహాయింపు ఇచ్చారు. మిగిలిన అన్ని కేటగిరీల అభ్యర్థులు నాన్-రీఫండబుల్ ఫీజు కింద రూ. 1,000, జీఎస్టీ చెల్లించాలి.
అభ్యర్థులు కేవలం ఆన్‌లైన్ ద్వారా మాత్రమే అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఎలాంటి ఆఫ్‌లైన్ దరఖాస్తులు స్వీకరించమని కంపెనీ స్పష్టం చేసింది.