Tiktok Video : అమెరికా వెళ్లినా అంతేనా బ్రో.. వార్ మెమోరియల్ ముందు డ్యాన్స్.. అమెరికన్లు సీరియస్!

Tiktok video : అమెరికాలో రెండో ప్రపంచ యుద్ధం స్మారక చిహ్నం వద్ద ఇండియాకు చెందిన వ్యక్తులు డ్యాన్స్ చేశారు. దీంతో అమెరికన్లు చాలా సీరియస్ అవుతున్నారు. అది డ్యాన్స్ చేసే ప్రదేశామా అంటూ ఫైర్ అవుతున్నారు.

Published on: Mar 09, 2026 2:28 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

చాలా మంది ఇండియన్స్‌కు ఇప్పుడు రీల్స్ పిచ్చి పట్టుకుంది. ఎక్కడకు వెళ్లినా అదే పనిలో ఉంటున్నారు. పక్కన ఉన్నది ఏంటి, వీడియోలు చేయెుచ్చా? లేదా అనేది కూడా ఆలోచించడం లేదు. వీడియోలు తీయడం, సోషల్ మీడియాలో పెట్టేయడం.. తర్వాత కాంట్రవర్సీ క్రియేట్ అవ్వడం. కొందరైతే ప్రాణాల మీదకు తెచ్చుకునేలా కూడా రీల్స్ చేస్తున్నారు. ఇక తాజాగా అమెరికాలో ఓ మహిళతో కలిసి ఒక కొరియోగ్రాఫర్ టిక్‌టాక్ వీడియో తీశాడు. వీడియో తీసిన ప్రదేశంపై అమెరికన్లు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు.

మధు రాజు డ్యాన్స్ వీడియో
మధు రాజు డ్యాన్స్ వీడియో

తెలుగు పాటలతో గుర్తింపు పొందిన టిక్‌టాకర్, కొరియోగ్రాఫర్ మధు రాజు ఓ వీడియోను ఆన్‌లైన్‌లో పోస్ట్ చేశాడు. ఇప్పుడు ఆ వీడియోతో అమెరికాలో ఉంచుతారా? పంపించేస్తారా? అనేదాకా వచ్చింది. వివాదాస్పద డ్యాన్స్ వీడియో తర్వాత బహిష్కరణ భయాలు పెరగడంతో అతడి కెరీర్‌ మీద ప్రభావం పడేలా ఉంది. వాషింగ్టన్ డి.సి.లోని రెండో ప్రపంచ యుద్ధ స్మారక చిహ్నం వద్ద ఒక మహిళాతో కలిసి మధు రాజు అనే కొరియోగ్రాఫర్ టిక్ టాక్ డ్యాన్స్ వీడియో తీశాడు.

దాదాపు 400,000 మంది అమరవీరులైన అమెరికన్లను గౌరవించే ఒక పవిత్ర స్థలం ఇది. ఈ వార్ మెమోరియల్ ముందే మధు రాజు, ఒక మహిళ డ్యాన్స్ చేస్తూ వీడియో తీశారు. దీనిని టిక్ టాక్‌లో పోస్ట్ చేశారు. ఇది కాస్త వైరల్ అయింది. ఈ వార్ మెమోరియల్‌ను అమెరికన్లు చాలా గౌరవంగా చూస్తారు. ఇలాంటి స్థలంలో డ్యాన్స్‌లు చేయడంతో ఫైర్ అవుతున్నారు. ఇప్పుడు యూఎస్ అధికారులు ఈ విషయంపై దృష్టిసారించారు.

టెక్సాస్‌లోని డల్లాస్‌లోని MAD డాన్స్ స్టూడియో నిర్వహిస్తున్నాడు మధు రాజు. పాలో ఆల్టో నెట్‌వర్క్స్‌లో క్లౌడ్ నెట్‌వర్క్ సెక్యూరిటీ ఇంజనీర్‌గా కూడా పనిచేస్తున్నాడు. అతడిని ఉద్యోగం నుంచి తొలగించాలని కంపెనీని ట్యాగ్ చేస్తూ అనేక పోస్టులు పెట్టారు అమెరికన్లు. అతని స్థానంలో ఒక అమెరికన్ ఉద్యోగిని నియమించాలని కూడా పిలుపునిచ్చారు.

డ్యాన్స్ చేసిన తర్వాత టిక్‌టాక్‌లో వీడియోను మధు రాజు పోస్ట్ చేశాడు. ఆ తర్వాత విమర్శలు వచ్చాయి. తన అకౌంట్ నుండి ఫుటేజ్‌ను తొలగించడానికి ప్రయత్నించినప్పటికీ.. అప్పటికే చాలా మంది దానిని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. చాలా మందికి ఇది రీచ్ అయింది. అయితే ప్రస్తుతం రాజు సోషల్ మీడియాలో కనిపించడం లేదు.

ఈ కాంట్రవర్సీ కాస్త రాజు ఇమ్మిగ్రేషన్ స్టేటస్‌పై పడేలా ఉంది. గౌరవప్రదమైన వార్ మెమోరియల్ వద్ద మధు రాజు డాన్స్ వీడియోతో అధికారులకు అనేక ఫిర్యాదులు వెళ్లాయి. రాజు వీసా రద్దుకు దారితీసే అవకాశం కూడా ఉందంటున్నారు. అధికారులు ఇప్పుడు అతని కేసును పరిశీలిస్తున్నారని నివేదికలు సూచిస్తున్నాయి.

రాజుతో కలిసి నృత్యం చేసిన మహిళ గురించి తెలియాల్సి ఉంది. రెండో ప్రపంచ యుద్ధం స్మారక చిహ్నం వైరల్ వీడియోలకు స్థలం కాదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. సోషల్ మీడియాలో మధు రాజుపై విమర్శలు వస్తూనే ఉన్నాయి. రాజు తను చేసిన డ్యాన్స్ వీడియోపై క్షమాపణలు చెప్పాడు, కానీ అధికారులు తమ దర్యాప్తును కొనసాగిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతానికి ఇమ్మిగ్రేషన్ సమీక్ష కొనసాగుతున్నందున యునైటెడ్ స్టేట్స్‌లో అతని భవిష్యత్తు ఏంటో ఇక తెలియాల్సి ఉంది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More