భారత స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం భారీ నష్టాలతో కుప్పకూలాయి. మధ్యాహ్నం 3.15 గంటల సమయానికి బెంచ్‌మార్క్ సూచీ నిఫ్టీ 1.71 శాతం పతనమవ్వగా, బీఎస్ఈ సెన్సెక్స్ ఏకంగా 1177 పాయింట్లు నష్టపోయి 71,461 పాయింట్ల వద్దకు చేరింది. ఈ ఆకస్మిక పతనంతో బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ) నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్‌లో ఏకంగా రూ.10 లక్షల కోట్లకు పైగా ఇన్వెస్టర్ల సంపద ఆవిరైపోయింది.
మార్కెట్లను ముంచెత్తిన కారణాలు

భారత మార్కెట్ల పతనానికి భారత రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) తీసుకున్న కఠిన నిర్ణయమే ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. బుధవారం ఆర్బీఐ రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. 2023 ఫిబ్రవరి తర్వాత ఆర్బీఐ వడ్డీ రేట్లను పెంచడం ఇదే తొలిసారి.
"ఇటీవలి రెపో రేటు పెంపు వల్ల ద్రవ్య లభ్యత, అప్పుల వ్యయంపై ఇన్వెస్టర్లలో ఆందోళనలు పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి కూడా ఒత్తిడి పెరగడంతో ఇన్వెస్టర్లు రక్షణాత్మక వైఖరి అవలంబిస్తున్నారు. స్వల్పకాలంలో హెచ్చుతగ్గులు ఎక్కువగా ఉంటాయి. త్రైమాసిక ఫలితాలు, చమురు ధరలు, ఆర్బీఐ నిర్ణయాలపై మార్కెట్ గమనం ఆధారపడి ఉంటుంది" అని విభవంగల్ అనుకూలకార ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపక మేనేజింగ్ డైరెక్టర్ సిద్ధార్థ్ మౌర్య వివరించారు.
క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుదల, విదేశీ ఇన్వెస్టర్ల నిరంతర అమ్మకాలు కూడా మార్కెట్‌ను కిందకు లాగాయని ఆయన పేర్కొన్నారు. ద్రవ్యోల్బణ భయాలు, పెరుగుతున్న బాండ్ ఈల్డ్స్, రూపాయి బలహీనపడటం ఇన్వెస్టర్లను మరింత జాగ్రత్తగా వ్యవహరించేలా చేస్తున్నాయని తెలిపారు.
సెగ రేపుతున్న బాండ్ ఈల్డ్స్, క్రూడ్ ఆయిల్
అమెరికా 10 ఏళ్ల ట్రెజరీ బాండ్ ఈల్డ్స్ 5.3 శాతం మార్కు వద్ద కొనసాగుతుండటంతో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లకు (ఎఫ్‌ఐఐ) అది ఆకర్షణీయమైన పెట్టుబడి మార్గంగా మారింది. దీంతో వారు భారత ఈక్విటీ మార్కెట్ల నుంచి వరుసగా పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నారు.
మరోవైపు బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధరలు బారెల్‌కు 103 డాలర్లకు చేరువై రెండు వారాల గరిష్ఠ స్థాయికి చేరాయి. నవంబర్ మిడ్‌టెర్మ్ ఎన్నికలకు ముందే ఇరాన్‌పై కొత్త దాడులు చేసేందుకు వ్యూహాలు సిద్ధం చేయాలని డొనాల్డ్ ట్రంప్ పరిపాలనా యంత్రాంగం పెంటగాన్‌ను ఆదేశించినట్లు వార్తలు వెలువడ్డాయి. ఈ పరిణామాలే క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుదలకు కారణమయ్యాయి.
నష్టపోయిన, లాభపడిన షేర్లు
{{/usCountry}}మరోవైపు బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధరలు బారెల్‌కు 103 డాలర్లకు చేరువై రెండు వారాల గరిష్ఠ స్థాయికి చేరాయి. నవంబర్ మిడ్‌టెర్మ్ ఎన్నికలకు ముందే ఇరాన్‌పై కొత్త దాడులు చేసేందుకు వ్యూహాలు సిద్ధం చేయాలని డొనాల్డ్ ట్రంప్ పరిపాలనా యంత్రాంగం పెంటగాన్‌ను ఆదేశించినట్లు వార్తలు వెలువడ్డాయి. ఈ పరిణామాలే క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుదలకు కారణమయ్యాయి.
నష్టపోయిన, లాభపడిన షేర్లు
{{/usCountry}}గురువారం నాటి ట్రేడింగ్‌లో అదానీ ఎంటర్‌ప్రైజెస్, ఐటీసీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, అదానీ పోర్ట్స్, మ్యాక్స్ హెల్త్‌కేర్, ఎస్‌బీఐ లైఫ్, అపోలో హాస్పిటల్స్ వంటి ప్రముఖ షేర్లు తీవ్ర నష్టాలను చవిచూశాయి. అదానీ గ్రీన్ 7.52 శాతం, అదానీ ఎంటర్‌ప్రైజెస్ 5.57 శాతం, పేటీఎం 5.25 శాతం నష్టపోయాయి.
అయితే మార్కెట్ నష్టాల్లో ఉన్నప్పటికీ ఐటీ దిగ్గజాలు ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్, టెక్ మహీంద్రా సహా టైటన్, నెస్లే ఇండియా, ట్రెంట్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ షేర్లు లాభాల్లో ట్రేడయ్యాయి. మార్కెట్ ముగిసిన తర్వాత ప్రముఖ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) తమ రెండో త్రైమాసిక (Q2FY27) ఆర్థిక ఫలితాలను వెల్లడించనుండటంతో ఇన్వెస్టర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.