Petrol Diesel price cut : గుడ్​ న్యూస్! పెట్రోల్​, డీజిల్​ ధరలను తగ్గించిన నయారా- ఎంతంటే..

Nayara petrol price : అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు (క్రూడ్ ఆయిల్) ధరలు తగ్గుముఖం పట్టడంతో దేశీయ ఇంధన మార్కెట్లో కీలక చలనం వచ్చింది. భారతదేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ ఇంధన రిటైలర్ అయిన ‘నయారా ఎనర్జీ’ దేశవ్యాప్తంగా తన బంకుల్లో పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది.

Published on: Jul 1, 2026, 08:47:49 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

దేశంలోనే అతిపెద్ద, ప్రముఖ ప్రైవేట్ చమురు సంస్థ నయారా ఎనర్జీ.. వాహనదారులకు భారీ ఉపశమనం కలిగించింది! అంతర్జాతీయంగా చమురు ధరలు దిగిరావడంతో.. నయారా ఎనర్జీ తన దేశవ్యాప్త నెట్‌వర్క్‌లో పెట్రోల్ ధరను లీటరుకు రూ. 5, అలాగే డీజిల్ ధరను లీటరుకు రూ. 3 మేర తగ్గించింది.

పెట్రోల్​, డీజిల్​ ధరలను తగ్గించిన నయారా.. (AFP)
పెట్రోల్​, డీజిల్​ ధరలను తగ్గించిన నయారా.. (AFP)

పశ్చిమాసియా (మిడిల్ ఈస్ట్) ప్రాంతంలో ఉద్రిక్తతలు తగ్గడంతో గ్లోబల్ మార్కెట్లో చమురు ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. ఈ నేపథ్యంలో రిటైల్ మార్కెట్లో ఇంధన ధరలను తగ్గించిన మొదటి సంస్థగా నయారా ఎనర్జీ నిలిచింది.

అయితే, ట్యాక్స్​లు, వ్యాట్​ల కారణంగా వివిధ రాష్ట్రాల్లోని నయారా పెట్రోల్​ బంకుల వద్ద ఇంధన ధరలు వేరువేరుగా ఉంటాయి.

LPG price cut : గుడ్​ న్యూస్! ఎల్పీజీ గ్యాస్ సిలిండర్​ ధర తగ్గింపు- ఎంతంటే..

అంతర్జాతీయ మార్కెట్ ప్రభావం..

గతంలో అమెరికా-ఇరాన్ యుద్ధం తీవ్రస్థాయికి చేరి అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు ఆకాశాన్ని తాకినప్పుడు.. దేశంలో అందరికంటే ముందుగా ఇంధన ధరలను పెంచిన రికార్డు కూడా నయారా ఎనర్జీ పేరిటే ఉంది. లీటరు పెట్రోల్​పై రూ. 5.30, లీటరు డీజిల్​పై రూ. 3 ప్రైజ్​ హైక్​ చేసింది. అయితే, ప్రస్తుత అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో ముడి చమురు ధరల తగ్గుదల ప్రయోజనాన్ని కస్టమర్లకు బదిలీ చేయడంలోనూ ఈ సంస్థే ముందడుగు వేసింది. దేశవ్యాప్తంగా వేల సంఖ్యలో రిటైల్ బంకులను నిర్వహిస్తున్న నయారా ఎనర్జీ తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రైవేట్ బంకులను ఆశ్రయించే వాహనదారులకు, ముఖ్యంగా రవాణా రంగానికి పెద్ద ఊరట లభించనుంది.

ప్రస్తుతం ప్రభుత్వ రంగ చమురు సంస్థలైన ఐఓసీ, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్​లు ధరల తగ్గింపుపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయనప్పటికీ.. ప్రైవేట్ రంగంలో వచ్చిన ఈ మార్పుతో రాబోయే రోజుల్లో ప్రభుత్వ రంగ సంస్థలు కూడా ఇంధన ధరలను తగ్గించే దిశగా అడుగులు వేసే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.

గుజరాత్​ వాద్​నగర్​లో నయారా ఎనర్జీ ప్రతియేటా 20 మిలియన్ టన్నుల రిఫైనరీని నడుపుతోంది. ఇది దేశంలోనే అతిపెద్ద నెంబర్.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More