LPG price cut : గుడ్​ న్యూస్! ఎల్పీజీ గ్యాస్ సిలిండర్​ ధర తగ్గింపు- ఎంతంటే..

LPG cylinder price in Hyderabad : సామాన్యుడికి అదిరిపోయే గుడ్​ న్యూస్! ఎల్పీజీ సిలిండర్​ ధరను తగ్గిస్తున్నట్టు చమురు మార్కెటింగ్ సంస్థలు పేర్కొన్నాయి. వాణిజ్య సిలిండర్ ధర ఏకంగా రూ. 183.50 దిగొచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

Published on: Jul 1, 2026, 08:03:49 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

భగ్గుమంటున్న నిత్యావసర ధరలతో అల్లాడిపోతున్న సామాన్యుడికి గుడ్​ న్యూస్​! కీలకమైన ఎల్పీజీ సిలిండర్​ ధరను తగ్గిస్తున్నట్టు చమురు మార్కెటింగ్​ సంస్థ ప్రకటించాయి. 19 కేజీల వాణిజ్య సిలిండర్​ ధర రూ. 183.50 తగ్గింది. ఈ ధర తగ్గింపు జులై 1, అంటే నేటి నుంచే అమల్లోకి వచ్చింది.

ఎల్పీజీ గ్యాస్ సిలిండర్​ ధర తగ్గింపు..
ఎల్పీజీ గ్యాస్ సిలిండర్​ ధర తగ్గింపు..

తాజా ధర తగ్గింపుతో దేశ రాజధాని దిల్లీలో కమర్షియల్ గ్యాస్​ సిలిండర్​ ధర రూ. 2,930కి చేరింది.

కాగా ఇళ్లల్లో వినియోగించే 14.2 కేజీల ఎల్పీజీ సిలిండర్​ ధర మాత్రం మారలేదు. దిల్లీలో దీని ధర రూ. 942గా ఉంది.

వివిధ నగరాల్లో 19 కేజీల గ్యాస్ సిలిండర్​ ధరలు ఇలా..

  • దిల్లీ- రూ. 2930
  • ముంబై- రూ. 2885.50
  • కోల్​కతా- రూ. 3072
  • చెన్నై- రూ .3100
  • బెంగళూరు- రూ. 3021
  • హైదరాబాద్​- రూ. 3191
  • విజయవాడ- రూ. 3128

కాగా హైదరాబాద్​, విజయవాడలో 14.2 కేజీల ఎల్పీజీ సిలిండర్​ ధరలు వరుసగా రూ. 994, రూ. 966.50గా ఉన్నాయి.

ఎల్పీజీ సిలిండర్​ ధరలు తగ్గడం ఎందుకు ముఖ్యం?

అమెరికా- ఇరాన్ యుద్ధం కారణంగా కీలకమైన స్ట్రెయిట్ ఆఫ్​ హర్ముజ్ చాలా నెలల పాటు మూతపడింది. ఫలితంగా అంతర్జాతీయంగా చమురు ధరలు భగ్గుమన్నాయి. అందుకే, నష్టాలను పూడ్చుకునేందుకు చమురు మార్కెటింగ్​ సంస్థలు మే నెల నుంచి సిలిండర్ల ధరలను పెంచుతూ వచ్చాయి.

మరీ ముఖ్యంగా 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలకు రెక్కలొచ్చాయి. ఇది రెస్టారెంట్లు, హోటళ్లను తీవ్రంగా ప్రభావితం చేసింది. ఫలితంగా ఆయ చోట్ల మెన్యూలో, వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఇది సామాన్యుడిపై పెను ప్రభావం చూపించింది.

ఇప్పుడు స్ట్రెయిట్ ఆఫ్​ హర్ముజ్​ దగ్గర పరిస్థితులు శాంతించాయి! అమెరికా- ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం చర్చలు నడుస్తుండటం ఇందుకు కారణం. చమురు సరఫరా సైతం పుంజుకుంది. ఈ క్రమంలోనే సామాన్యుడిపై పడిన భారాన్ని తగ్గించే విధంగా చమురు మార్కెటింగ్​ సంస్థలు ఎల్పీజీ సిలిండర్​ ధరను తగ్గించాయి.

2026లో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్​ ధర తగ్గడం ఇదే తొలిసారి!

మరి పెట్రోల్​, డీజిల్​ ధరల పరిస్థితేంటి?

అమెరికా- ఇరాన్ అనిశ్చితి వేళ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లతో పాటు దేశవ్యాప్తంగా పెట్రోల్​, డీజిల్​ ధరలు సైతం భారీగా పెరిగాయి. దీని ప్రభావం ఇతర నిత్యావసర వస్తువుల మీద కూడా పడింది. ఫలితంగా సామాన్యుడి సేవింగ్స్​కి గండిపడింది.

ఇక ఇప్పుడు సిలిండర్ ధరలు తగ్గడంతో ప్రజల చూపు పెట్రోల్​, డీజిల్​ ధరలవైపు మళ్లింది. ఇంధన ధరల తగ్గింపు వార్త కూడా వస్తుందేమో అని ఆశలు పెట్టుకుంటున్నారు. అయితే పెట్రోల్​, డీజిల్​ ధరలు ఇప్పట్లో తగ్గకపోవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. చమురు మార్కెటింగ్ సంస్థలు ఇంకా నష్టాలను పూడ్చుకోలేదని, అందుకే ధరల తగ్గింపు నిర్ణయం తీసుకోకపోవచ్చని అంటున్నారు. పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More