ప్రయాణికులకు ఊరట: పలు అరబ్ దేశాలకు ఇండిగో విమానాలు షురూ.. పూర్తి జాబితా ఇదే!

అంతర్జాతీయ విమాన సర్వీసులు నెమ్మదిగా పుంజుకుంటున్నాయి. యుద్ధం కారణంగా వేల సంఖ్యలో ప్రయాణికులు చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇండిగో ఎయిర్‌లైన్స్ గురువారం (మార్చి 12) నుంచి 9 పశ్చిమాసియా దేశాలతో పాటు ఐరోపాకు కొన్ని ప్రత్యేక విమానాలను నడుపుతున్నట్లు ప్రకటించింది.

Updated on: Mar 12, 2026, 10:32:27 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ పరిస్థితుల వల్ల గత కొన్ని రోజులుగా విమాన ప్రయాణాలు అస్తవ్యస్తమయ్యాయి. అయితే, భద్రతా పరిస్థితులను సమీక్షిస్తూ.. అధికారుల అనుమతితో విమాన సర్వీసులను పునరుద్ధరిస్తున్నట్లు ఇండిగో తెలిపింది. గల్ఫ్ దేశాల్లో చిక్కుకుపోయిన వారు తమ స్వస్థలాలకు చేరుకునేందుకు, అలాగే అత్యవసర ప్రయాణాలు చేసే వారికి ఇది పెద్ద ఊరటనిచ్చే అంశం.

ఇండిగో విమాన సర్వీసు (REUTERS)
ఇండిగో విమాన సర్వీసు (REUTERS)

హైదరాబాద్‌ నుంచి కూడా సర్వీసులు

తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు గుడ్ న్యూస్ ఏంటంటే.. హైదరాబాద్ నుంచి జెడ్డా, మదీనా, మస్కట్, షార్జా, అబుదాబి మరియు రస్ అల్ ఖైమా వంటి నగరాలకు ఇండిగో విమానాలు అందుబాటులోకి వచ్చాయి.

ఇండిగో విమాన సర్వీసుల జాబితా 12 మార్చి 2026:

6E 01: London - Mumbai (లండన్ - ముంబై)

6E 02: Mumbai - London (ముంబై - లండన్)

6E 21: Amsterdam - Mumbai (అమ్‌స్టర్‌డామ్ - ముంబై)

6E 22: Mumbai - Amsterdam (ముంబై - అమ్‌స్టర్‌డామ్)

6E 25: Mumbai - Amsterdam (ముంబై - అమ్‌స్టర్‌డామ్)

6E 58: Hyderabad - Madinah (హైదరాబాద్ - మదీనా)

6E 59: Madinah - Mumbai (మదీనా - ముంబై)

6E 61: Jeddah - Mumbai (జెడ్డా - ముంబై)

6E 62: Mumbai - Jeddah (ముంబై - జెడ్డా)

6E 63: Jeddah - Delhi (జెడ్డా - ఢిల్లీ)

6E 64: Delhi - Jeddah (ఢిల్లీ - జెడ్డా)

6E 65: Jeddah - Kozhikode (జెడ్డా - కోజికోడ్)

6E 66: Kozhikode - Jeddah (కోజికోడ్ - జెడ్డా)

6E 67: Jeddah - Hyderabad (జెడ్డా - హైదరాబాద్)

6E 68: Hyderabad - Jeddah (హైదరాబాద్ - జెడ్డా)

6E 73: Riyadh - Mumbai (రియాద్ - ముంబై)

6E 74: Mumbai - Riyadh (ముంబై - రియాద్)

6E 77: Jeddah - Bengaluru (జెడ్డా - బెంగళూరు)

6E 78,: Bengaluru - Jeddah (బెంగళూరు - జెడ్డా)

6E 91: Jeddah - Mumbai (జెడ్డా - ముంబై)

6E 92: Mumbai - Jeddah (ముంబై - జెడ్డా)

6E 1267: Muscat - Mumbai (మస్కట్ - ముంబై)

6E 1268: Mumbai - Muscat (మస్కట్ - ముంబై)

6E 1273: Muscat - Hyderabad (మస్కట్ - హైదరాబాద్)

6E 1274: Hyderabad - Muscat (హైదరాబాద్ - మస్కట్)

6E 1413: Abu Dhabi - Mumbai (అబుదాబి - ముంబై)

6E 1414: Mumbai - Abu Dhabi (ముంబై - అబుదాబి)

6E 1421: Sharjah - Hyderabad (షార్జా - హైదరాబాద్)

6E 1422: Hyderabad - Sharjah (హైదరాబాద్ - షార్జా)

6E 1448: Abu Dhabi - Hyderabad (అబుదాబి - హైదరాబాద్)

6E 1449: Hyderabad - Abu Dhabi (హైదరాబాద్ - అబుదాబి)

6E 1453: Dubai - Mumbai ((దుబై - ముంబై)

6E 1454: Mumbai - Dubai (ముంబై - దుబై)

6E 1461: Dubai - Delhi (దుబై - ఢిల్లీ)

6E 1462: Delhi - Dubai (ఢిల్లీ - దుబై)

6E 1463: Dubai - Delhi (దుబై - ఢిల్లీ)

6E 1464: Delhi - Dubai (ఢిల్లీ - దుబై)

6E 1495: Ras Al Khaimah - Hyderabad (రస్ అల్ ఖైమా - హైదరాబాద్)

6E 1496: Hyderabad - Ras Al Khaimah (హైదరాబాద్ - రస్ అల్ ఖైమా)

6E 1501: Fujairah - Mumbai (ఫుజైరా - ముంబై)

6E 1502: Mumbai - Fujairah (ముంబై - ఫుజిరా)

ప్రయాణికులు గమనించాల్సిన ముఖ్య విషయాలు

  • పరిస్థితులపై నిఘా: ప్రస్తుత పరిస్థితులు వేగంగా మారుతున్నందున విమానాల సమయాల్లో స్వల్ప నోటీసుతో మార్పులు ఉండవచ్చు.
  • స్టేటస్ చెక్ చేయండి: విమానాశ్రయానికి బయలుదేరే ముందు ఇండిగో అధికారిక వెబ్‌సైట్ లేదా ఈ లింక్ ద్వారా మీ విమానం స్థితిని (Flight Status) తప్పకుండా తనిఖీ చేసుకోండి.
  • సహాయం కోసం: ఏవైనా సందేహాలుంటే ఇండిగో హెల్ప్‌లైన్ నంబర్ +91 124 6173838 కు కాల్ చేయవచ్చు. యుద్ధం వల్ల విమానాలు రద్దయిన వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసేందుకు ఇండిగో బృందాలు ప్రయత్నిస్తున్నాయి.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

1. యుద్ధం వల్ల విమాన సర్వీసులు ఎందుకు ఆగిపోయాయి?

ఇరాన్ పరిసర ప్రాంతాల్లో యుద్ధం జరుగుతుండటంతో దుబాయ్, అబుదాబి వంటి దేశాల విమానాశ్రయాలను భద్రతా కారణాల దృష్ట్యా మూసివేశారు. దీనివల్ల విమానాలు దారి మళ్లించడం లేదా రద్దు చేయడం సంభవించింది.

2. నా విమానం రద్దయితే ఏం చేయాలి?

ఇండిగో సంస్థే స్వయంగా ప్రయాణికులను సంప్రదించి ప్రత్యామ్నాయ విమానం లేదా రీఫండ్ గురించి తెలియజేస్తుంది. మీరు కూడా పైన పేర్కొన్న హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేయవచ్చు.

3. ప్రస్తుతం ఏఏ దేశాలకు విమానాలు నడుస్తున్నాయి?

సౌదీ అరేబియా (జెడ్డా, మదీనా, రియాద్), యూఏఈ (దుబాయ్, అబుదాబి, షార్జా, ఫుజైరా, రస్ అల్ ఖైమా), ఒమన్ (మస్కట్) తో పాటు లండన్, ఆమ్‌స్టర్‌డామ్ వంటి ఐరోపా నగరాలకు పరిమిత సంఖ్యలో విమానాలు నడుస్తున్నాయి.

  • Praveen Kumar Lenkala
    ABOUT THE AUTHOR
    Praveen Kumar Lenkala

    ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More