ప్రియురాలిని చంపి, శవంపై లైంగిక దాడి.. నిందితుడి షాకింగ్ వాంగ్మూలం
ఇండోర్‌లో ఎంబీఏ విద్యార్థిని హత్య కేసులో నిందితుడు పీయూష్ ధామ్నోడియా పోలీసుల విచారణలో దిగ్భ్రాంతికర విషయాలు వెల్లడించాడు. పెళ్లి విషయంలో గొడవ, ఆమె ప్రవర్తనపై అనుమానంతోనే హత్య చేశానని, ఆ తర్వాత శవంపై కూడా అఘాయిత్యానికి పాల్పడ్డానని ఒప్పుకున్నాడు.
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో కలకలం రేపిన ఎంబీఏ విద్యార్థిని హత్య కేసులో నిందితుడు పీయూష్ ధామ్నోడియా నోరు విప్పాడు. పోలీసుల విచారణలో అతను చెప్పిన విషయాలు వింటుంటే సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయి. ప్రేమ, పెళ్లి, అనుమానం.. ఈ మూడింటి చుట్టూ తిరిగిన ఈ కథ చివరకు ఒక యువతి ప్రాణం తీయడమే కాకుండా, మరణం తర్వాత కూడా ఆమెకు అవమానాన్నే మిగిల్చింది.

గదిలోనే రహస్యంగా ఏడు అడుగులు
మందసౌర్‌కు చెందిన పీయూష్, బాధితురాలు ఒకే కాలేజీలో ఎంబీఏ చదువుతున్నారు. గత ఏడాది సెప్టెంబర్‌లో వీరి మధ్య పరిచయం ప్రేమగా మారింది. పీయూష్ ఆమెను పెళ్లి చేసుకోవాలని అనుకున్నా, ఇంట్లో వాళ్లు ఒప్పుకోలేదు. దీంతో జనవరిలో తన రూమ్‌లోనే ఆమె మెడలో మంగళసూత్రం కట్టి, రహస్యంగా ఏడు అడుగులు వేసినట్లు పీయూష్ పోలీసులకు తెలిపాడు. అయితే, "ఈ రహస్య పెళ్లి నాకు వద్దు, అందరి ముందూ నన్ను భార్యగా అంగీకరించు" అని బాధితురాలు పట్టుబట్టడంతో వీరి మధ్య ఘర్షణ మొదలైంది.
ఫోన్ హ్యాక్ చేసి.. అనుమానంతో రగిలిపోయి..
పెళ్లి గొడవ ఒకవైపు ఉండగానే, ఆమె ప్రవర్తనపై పీయూష్‌కు అనుమానం పెరిగింది. ఆమె ఇతర యువకులతో చాటింగ్ చేస్తోందని నమ్మిన పీయూష్, ఏకంగా ఆమె ఫోన్‌ను హ్యాక్ చేశాడు. డేటింగ్ యాప్స్‌లో ఆమె ఇతరులతో మాట్లాడుతోందని తెలుసుకుని కక్ష పెంచుకున్నాడు. ఎలాగైనా ఆమెను అంతం చేయాలని పథకం పన్నాడు.
ఆటలో ప్రాణం తీసి.. ఆపై పైశాచికం
ఫిబ్రవరి 10న నిందితుడు పీయూష్ బాధితురాలిని తన గదికి పిలిపించాడు. అక్కడ ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగినా, తరువాత శారీరకంగా కలిశాడు. కాసేపటికి "సరదాగా ఆట ఆడదాం" అంటూ నమ్మించి ఆమె చేతులు, కాళ్లు కట్టేశాడు. ఆమె తేరుకునే లోపే చాతిపై కూర్చుని గొంతు నులిమి చంపేశాడు. ఆమె ప్రాణం పోయిందని నిర్ధారించుకోవడానికి చాకుతో విచక్షణారహితంగా దాడి చేశాడు. అత్యంత దారుణమైన విషయం ఏంటంటే.. ఆమె మరణించిన తర్వాత కూడా ఆ శవంపై పదే పదే లైంగిక దాడికి పాల్పడినట్లు నిందితుడు స్వయంగా అంగీకరించాడు.
ఆత్మను పిలిచేందుకు క్షుద్ర పూజలు
హత్య తర్వాత పీయూష్ ముంబై పారిపోయాడు. అక్కడ నాలాసోపారా ప్రాంతంలో ఉంటూ బాధితురాలి ఆత్మను పిలిచేందుకు యూట్యూబ్ చూస్తూ క్షుద్ర పూజలు చేసినట్లు వెల్లడైంది. ఆమె ఫోటో ముందు పువ్వులు, మిఠాయిలు, పసుపు, కుంకుమ ఉంచి మంత్రతంత్రాలు జరిపాడు. పోలీసుల నుంచి తప్పించుకోవడానికి అక్కడే ఏదైనా ఉద్యోగం వెతుక్కోవాలని కూడా ప్రయత్నించాడు.
"హత్య చేసిన తర్వాత నేను కూడా ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను. ముంబైలో వంతెన పైనుంచి దూకాలని చూశాను కానీ ధైర్యం సరిపోలేదు" అని నిందితుడు పోలీసుల ఎదుట చెప్పాడు. ప్రస్తుతం పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని, హత్యకు ఉపయోగించిన మొబైల్ ఫోన్ రికవరీ కోసం ముంబై తరలించారు.
ABOUT THE AUTHORPraveen Kumar Lenkalaప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More

E-Paper


