మేడారంలో బాలికపై లైంగిక దాడి ఆరోపణలు.. విచారణకు మహిళా కమిషన్ ఆదేశం
మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరలో బాలికపై లైంగిక దాడి జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై జాతీయ మహిళా కమిషన్ స్పందించింది. విచారణకు ఆదేశించింది.
ములుగు జిల్లాలోని మేడారంలో ఇటీవల జరిగిన సమ్మక్క-సారలమ్మ జాతర సందర్భంగా 13 ఏళ్ల బాలికపై లైంగిక దాడి జరిగినట్టుగా ఆరోపణలు వస్తున్నాయి. దీంతో ఈ లైంగిక దాడికి సంబంధించిన నివేదికలను జాతీయ మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించింది.

ఈ సంఘటనలో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఐదుగురు యువకులు బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. అన్ని మీడియా, సోషల్ మీడియా కథనాలు వైరల్ అయ్యాయి. వీటిని తాము పరిగణనలోకి తీసుకున్నట్లు మహిళా కమిషన్ పేర్కొంది.
ఈ విషయాన్ని పరిశీలించడానికి ఎన్‌సీడబ్ల్యూ చైర్‌పర్సన్ విజయ రహత్కర్ ఒక విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి కమిషన్ సభ్యురాలు డెలినా ఖోంగ్‌డప్ అధ్యక్షత వహిస్తారు. ఎన్‌సీడబ్ల్యూ సీనియర్ కోఆర్డినేటర్ కంచన్ ఖత్తర్ సభ్యురాలిగా వ్యవహరిస్తారు. జిల్లా న్యాయ సేవా ప్రాధికార సంస్థ నామినేట్ చేసిన ఒక న్యాయవాది కూడా ఈ కమిటీకి సహాయం చేయవచ్చు.
విచారణ ప్రక్రియ ఫిబ్రవరి 5న ప్రారంభమైంది. ఈ ఆరోపణలు వచ్చిన సంఘటనకు దారితీసిన పరిస్థితులను పరిశీలించడం, సంబంధిత అధికారులు తీసుకున్న చర్యలను అంచనా వేయడం, వాస్తవాలను నిర్ధారించడానికి సంబంధిత అధికారులు, వ్యక్తులతో సంభాషించడం, భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా నిరోధించడానికి నివారణ చర్యలను సిఫార్సు చేయడం వంటి బాధ్యతలను కమిటీకి అప్పగించారు.
మరోవైపు ఇప్పటికే ఈ ఘటనపై పోలీసులు స్పందించారు. మేడారం మహాజాతరలో బాలికపై అత్యాచారం జరిగినట్టుగా సోషల్ మీడియా, మీడియా వస్తున్న కథనాల్లో వాస్తవం లేదని ములుగు ఎస్పీ సుధీర్ రామ్నాత్ చెప్పారు. నార్లాపూర్ పోలీసులు సమగ్ర విచారణ చేపట్టారని వెల్లడించారు.
పోలీసులు ఒక అధికారిక ప్రెస్ నోట్‌లో ఈ పుకార్లను అవాస్తవమైనవి, నిరాధారమైనవిగా పేర్కొన్నారు. ఈ దురుద్దేశపూరిత ప్రచారానికి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆదివాసీ పండుగ సందర్భంగా ఒక మైనర్‌ను లక్ష్యంగా చేసుకున్నారని ఆన్‌లైన్‌లో తీవ్ర ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో ఈ స్పష్టతనిచ్చారు పోలీసులు.
ఈ వాదనలను ధృవీకరించడానికి నార్లాపూర్ పోలీసులు క్షేత్రస్థాయి విచారణ నిర్వహించామని, క్షేత్రస్థాయి విచారణ, ఆసుపత్రి రికార్డులను సమీక్షించామని చెప్పారు. దర్యాప్తులో అలాంటి సంఘటన జరగలేదని తేల్చారు. నాలుగు రోజుల కార్యక్రమంలో అలాంటి ఫిర్యాదు కూడా లేదు అని పోలీసులు పేర్కొన్నారు. ఇటువంటి రెచ్చగొట్టే వార్తలను వ్యాప్తి చేయడం చట్టం ప్రకారం తీవ్రమైన నేరమన్నారు.
'ఈ నిరాధారమైన ఆరోపణలను వ్యాప్తి చేసే కొన్ని హ్యాండిల్స్‌ను మేం గమనించాం. ఈ పోస్ట్‌ల మూలాన్ని మేం గుర్తిస్తున్నాము. నిజంకాని సంఘటనకు సంబంధించి తప్పుదారి పట్టించే వార్తలను షేర్ చేస్తున్నట్లు లేదా సృష్టిస్తున్నట్లు తేలితే BNS, IT చట్టంలోని సంబంధిత విభాగాల కింద అరెస్టు, ప్రాసిక్యూషన్‌ను ఎదుర్కొంటారు.' అని పోలీసులు హెచ్చరించారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


