'పోలీసులు నన్ను ఏం చేయలేరు'.. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు వార్నింగ్ లెటర్

హైదరాబాద్ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు మరోసారి బెదిరింపు లేఖ వచ్చింది. ఇందులో ఓ వ్యక్తి రాజాసింగ్‌ మీద పలు వ్యాఖ్యలు చేశాడు.

Updated on: Jan 26, 2026, 13:08:13 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు బెదిరింపు లేఖ వచ్చింది. అందులో అసభ్యకరమైన భాష ఉంది. తనపై పోలీసులు చర్యలు తీసుకోలేరని ఆ వ్యక్తి చెప్పడం కలకలం రేపుతోంది. ఆసిఫ్ నగర్‌కు చెందిన అబ్దుల్ హఫీజ్ అనే వ్యక్తి పేరుతో ఈ లేఖ వచ్చింది. గతంలోనూ రాజాసింగ్‌కు బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఇప్పుడు లేఖ రావడం చర్చనీయాంశమైంది. ఆ లేఖలో 'నాకు పోలీసుల మద్దతు ఉంది. నన్ను ఏం చేయలేరు.' అని రాసి ఉంది.

ఎమ్మెల్యే రాజాసింగ్‌కు బెదిరింపు లేఖ
ఎమ్మెల్యే రాజాసింగ్‌కు బెదిరింపు లేఖ

ఈ ఘటనపై రాజాసింగ్ మాట్లాడుతూ.. 'ఆదివారం సాయంత్రం నా ఇంటి చిరునామాకు బెదిరింపు లేఖ వచ్చింది. బెదిరింపు కాల్స్ చేసి, బెదిరింపు లేఖలు పంపుతున్న వారు ఎవరు అని తెలుసుకోవాలని డీజీపీకి, కమిషనర్‌కు, ముఖ్యమంత్రికి కూడా లేఖలు రాశాం. వారిని పట్టుకోమని మేం కోరాం. కానీ పోలీసులు ఈ రోజు వరకు ఒక్క వ్యక్తిని కూడా పట్టుకోలేదు.' అని రాజాసింగ్ అన్నారు.

నిన్న సాయంత్రం వచ్చిన లేఖలో ఆ వ్యక్తిని పోలీసులు తనను పిలిచినట్లు పేర్కొన్నాడు. ఫిర్యాదును ధృవీకరించి, ఆధార్ కార్డును తీసుకొని వదిలేశారని లేఖలో తెలిపాడు. పోలీసులు తనను ఏమీ చేయలేరని ఆ వ్యక్తి రాశాడు. 'అతను ఈ మాటలు రాశాడు. ఇప్పుడు నా కొడుకును బెదిరిస్తున్నాడు. ఇది చాలా దురదృష్టకరం. అధికారంలో ఉన్న రాజకీయ నాయకుల పాటలకు డ్యా్న్స్ చేస్తూ.. తెలంగాణ పోలీసులు తోలుబొమ్మలుగా మారారు. పదేపదే బెదిరింపు కాల్స్, లేఖలు ఎవరు పంపుతున్నారో, ఏ పోస్టాఫీసు నుంచి పంపుతున్నారో తెలుసుకోవాలని డీజీపీ, కమిషనర్, ముఖ్యమంత్రిని కోరుతున్నాను. చుట్టుపక్కల సీసీటీవీ కెమెరాలు ఉండవచ్చు. వారిని పట్టుకోండి, విచారణ చేయండి.' అని రాజాసింగ్ అన్నారు.

ఇలాంటి బెదిరింపు లేఖలతో తాను లేదా తన కుటుంబం భయపడబోమని రాజాసింగ్ నొక్కి చెప్పారు. తన తరువాత తన కొడుకు ధర్మ కోసం పని చేస్తూనే ఉంటాడని స్పష్టం చేశారు. తాము ఇప్పటికే తమ కొడుకును రాజకీయాల కోసం కాకుండా మతపరమైన పనుల కోసం ప్రొజెక్ట్ చేశామన్నారు. తన తర్వాత కుమారుడు కూడా మతపరమైన మార్గాన్ని అనుసరిస్తాడన్నారు. తన కుటుంబం మొత్తం ధార్మిక మార్గంలో నడుస్తుందన్నారు రాజాసింగ్. ఈ రకమైన బెదిరింపు కాల్స్ లేదా లేఖలతో తాము భయపడం అని స్పష్టం చేశారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More