...
...
Next Story

ఐటీ రంగంలో ప్రకంపనలు: ఇన్ఫోసిస్, టీసీఎస్ షేర్ల భారీ పతనం.. ఇన్వెస్టర్లకు షాక్

IT stocks crash: అమెరికా మార్కెట్ల పతనం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ముప్పుతో భారత ఐటీ షేర్లు కుప్పకూలాయి. గత మూడు రోజుల్లోనే నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 12% మేర పడిపోయి, 2023 అక్టోబర్ నాటి కనిష్ట స్థాయికి చేరుకోవడం ఇన్వెస్టర్లను తీవ్ర ఆందోళనలో పడేసింది.

Updated on: Feb 13, 2026, 09:54:38 IST
Advertisement

భారత ఐటీ రంగంపై అమ్మకాల ఒత్తిడి సునామీలా విరుచుకుపడింది. వరుసగా రెండో రోజూ టెక్ షేర్లు భారీగా కుదేలయ్యాయి. అమెరికా టెక్ మార్కెట్లలో చోటుచేసుకున్న భారీ పతనం దెబ్బకు, మన దేశీ దిగ్గజాలైన ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్ వంటి షేర్లు శుక్రవారం ట్రేడింగ్‌లో ఏకంగా భారీగా పతనమయ్యాయి.

కనుమరుగవుతున్న లాభాలు

ఐటీ రంగంలో ప్రకంపనలు: ఇన్ఫోసిస్, టీసీఎస్ షేర్లు 7.5% పతనం.. ఇన్వెస్టర్లకు షాక్ (An AI-generated image)
ఐటీ రంగంలో ప్రకంపనలు: ఇన్ఫోసిస్, టీసీఎస్ షేర్లు 7.5% పతనం.. ఇన్వెస్టర్లకు షాక్ (An AI-generated image)

మార్కెట్ గణాంకాలను గమనిస్తే పరిస్థితి తీవ్రత అర్థమవుతుంది. నిఫ్టీ ఐటీ ఇండెక్స్ శుక్రవారం ఒక్కరోజే 5% పైగా కుప్పకూలి 31,422.60 పాయింట్ల వద్దకు చేరింది. ఇది 2023 అక్టోబర్ తర్వాత నమోదైన అత్యంత కనిష్ట స్థాయి. కేవలం గత మూడు ట్రేడింగ్ సెషన్లలోనే ఈ ఇండెక్స్ ఏకంగా 12% విలువను కోల్పోవడం గమనార్హం. అంటే లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్టర్ల సంపద కేవలం మూడు రోజుల్లోనే ఆవిరైపోయింది.

ఐటీని వణికిస్తున్న 'AI' భయాలు

ఈ పతనానికి ప్రధాన కారణం అమెరికా మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల సంకేతాలే. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రాకతో సాంప్రదాయ ఐటీ సేవల రంగం రూపురేఖలు మారిపోతాయన్న ఆందోళనలు ఇన్వెస్టర్లను వెంటాడుతున్నాయి. ఏఐ వల్ల ఐటీ ప్రాజెక్టుల కాలపరిమితి తగ్గడమే కాకుండా, చాలా పనులు ఆటోమేషన్ అయిపోతాయన్న భయాలు మార్కెట్ వర్గాల్లో నెలకొన్నాయి.

"ఏఐ టెక్నాలజీ వల్ల భారత ఐటీ కంపెనీల ఆదాయ మార్గాలకు గండి పడుతుందేమోనన్న అనుమానాలు పెరిగాయి. దీనికి తోడు అమెరికాలో టెక్ షేర్ల అమ్మకాలు కొనసాగడం మన మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపింది" అని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ప్రధాన షేర్ల పరిస్థితి:

  • ఇన్ఫోసిస్ (Infosys): మార్కెట్ లీడర్‌గా ఉన్న ఈ షేరు భారీగా పతనమైంది. ప్రస్తుతం 5.5 శాతం పడిపోయి రూ. 1,309 వద్ద ట్రేడవుతోంది.
  • టీసీఎస్ (TCS): దిగ్గజ సంస్థ సైతం ఇన్వెస్టర్ల అమ్మకాల ఒత్తిడికి తలొగ్గింది. 4.50 శాతం పతనమై రూ. 2626 వద్ద ట్రేడవుతోంది.
  • హెచ్‌సీఎల్ టెక్ (HCL Tech): ఈ స్టాక్ 4.5 శాతం పైగా క్షీణించి ఇన్వెస్టర్లను షాక్‌కు గురిచేసింది. రూ. 1411 వద్ద ట్రేడవుతోంది.
  • టెక్ మహీంద్రా 2.71 శాతం నష్టపోయింది. విప్రో 3.34 శాతం పతనమైంది. పర్సిస్టెంట్ టెక్నాలజీస్ 3.71 శాతం, ఎల్‌టీఐఎం 3.38 శాతం పడిపోయాయి.

 
ABOUT THE AUTHOR
Praveen Kumar Lenkala

ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe