IOCL Apprentice Recruitment : పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండానే ఐఓసీఎల్​లో అప్రెంటిస్ పోస్టులు- పూర్తి వివరాలు..

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసీఎల్) 335 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎలాంటి రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండా మార్కుల మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. అర్హత కలిగిన వారు నవంబర్ 4 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

Published on: Oct 6, 2026, 14:01:01 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

కేంద్ర ప్రభుత్వ రంగ దిగ్గజం, మహారత్న సంస్థ అయిన 'ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్' (ఐఓసీఎల్) నిరుద్యోగ యువతకు శుభవార్త అందించింది. సంస్థలోని వివిధ యూనిట్లలో ఖాళీగా ఉన్న 335 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఇండియన్ ఆయిల్ అధికారిక వెబ్‌సైట్ iocl.com ద్వారా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు.

ఐఓసీఎల్ అప్రెంటిస్ రిక్రూట్​మెంట్​ 2026 అప్డేట్స్.. (HT file)
ఐఓసీఎల్ అప్రెంటిస్ రిక్రూట్​మెంట్​ 2026 అప్డేట్స్.. (HT file)

ఐఓసీఎల్ అప్రెంటిస్ రిక్రూట్​మెంట్​ 2026- దరఖాస్తు తేదీలు..

ఈ దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 5న ప్రారంభం కాగా, దరఖాస్తులు సమర్పించడానికి నవంబర్ 4, 2026 వరకు అవకాశం ఉంది. సాంకేతిక, ఇతర రంగాల్లో ఆచరణాత్మక నైపుణ్యాలు సాధించి భవిష్యత్తులో మంచి అవకాశాలు పొందాలనుకునే వారికి ఇది చక్కటి అవకాశం.

ఐఓసీఎల్ అప్రెంటిస్ రిక్రూట్​మెంట్​ 2026- పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండానే నేరుగా ఎంపిక!

ఈ ఐఓసీఎల్ అప్రెంటిస్ రిక్రూట్​మెంట్​ 2026లో అత్యంత ఆకర్షణీయమైన అంశం ఎంపిక విధానమే! సాధారణంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు కఠినమైన పోటీ పరీక్షలు ఉంటాయి. కానీ ఈ పోస్టులకు అభ్యర్థులకు ఎలాంటి రాత పరీక్ష గానీ, ఇంటర్వ్యూ గానీ నిర్వహించరు.

  • అభ్యర్థులు ముందుగా నేషనల్ అప్రెంటిస్‌షిప్ ప్రమోషన్ స్కీమ్ లేదా నేషనల్ అప్రెంటిస్‌షిప్ ట్రెయినింగ్ స్కీమ్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
  • నోటిఫికేషన్‌లో పేర్కొన్న విద్యార్హతల్లో అభ్యర్థులు సాధించిన మార్కుల శాతం ప్రాతిపదికగా మెరిట్ జాబితాను రూపొందిస్తారు.
  • మెరిట్ జాబితాలో ఎంపికైన వారిని పత్రాల పరిశీలన కోసం పిలుస్తారు.

అనంతరం ప్రీ-ఎంగేజ్‌మెంట్ మెడికల్ ఫిట్‌నెస్ పరీక్ష నిర్వహిస్తారు. మెడికల్ ఫిట్‌నెస్ సర్టిఫికేట్, సర్టిఫికేట్లు సరిగ్గా ఉన్నవారికి ట్రైనింగ్ కోసం నియామక ఉత్తర్వులు జారీ చేస్తారు.

Government jobs : అలర్ట్! ఎస్బీఐ నుంచి ఆర్​ఆర్బీ ఎన్టీపీసీ వరకు.. త్వరలో ముగియనున్న అప్లికేషన్ ప్రాసెస్

ఐఓసీఎల్ అప్రెంటిస్ రిక్రూట్​మెంట్​ 2026- అప్రెంటిస్‌షిప్ ఎందుకు ముఖ్యం?

ఐఓసీఎల్ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థలో అప్రెంటిస్ శిక్షణ పొందడం వల్ల అభ్యర్థులకు పారిశ్రామిక స్థాయి ప్రత్యక్ష అనుభవం లభిస్తుంది. శిక్షణా కాలంలో ప్రతినెల స్టైపెండ్ అందజేస్తారు. విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు ఇచ్చే సర్టిఫికేట్‌కు ఆయిల్ అండ్ గ్యాస్ రంగాలు, ప్రైవేట్ దిగ్గజ సంస్థలు, ఇతర ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రాధాన్యత లభిస్తుంది.

ఐఓసీఎల్ అప్రెంటిస్ రిక్రూట్​మెంట్​ 2026- ఇలా అప్లై చేసుకోండి..

  • ముందుగా IOCL అధికారిక వెబ్‌సైట్ iocl.com సందర్శించాలి.
  • హోమ్‌పేజీలో కనిపించే 'Recruitment' లేదా 'Careers' విభాగంపై క్లిక్ చేయాలి.
  • అప్రెంటిస్ నోటిఫికేషన్ లింక్‌ను ఎంచుకుని, అవసరమైన రిజిస్ట్రేషన్ వివరాలు నమోదు చేయాలి.
  • ఆన్‌లైన్ అప్లికేషన్ ఫారమ్‌లో విద్యార్హతలు, వ్యక్తిగత వివరాలు తప్పులు లేకుండా భర్తీ చేయాలి.
  • దరఖాస్తు రుసుము (ఉంటే) చెల్లించి, ఫారమ్‌ను సబ్‌మిట్ చేయాలి.
  • భవిష్యత్తు అవసరాల కోసం దరఖాస్తు పేజీని ప్రింట్ లేదా పీడీఎఫ్ రూపంలో భద్రపరచుకోవాలి.
  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More