రూ. 41వేల కన్నా తక్కువ ధరకే ఐఫోన్ 16! ఐఫోన్ 15పైనా భారీ డిస్కౌంట్లు..
క్రోమా ‘క్రోమ్‌టాస్టిక్ డిసెంబర్ సేల్’లో ఐఫోన్ 16, ఐఫోన్ 15పై భారీ డిస్కౌంట్లు లభిస్తున్నాయి. ఎక్స్ఛేంజ్ బోనస్, బ్యాంక్ ఆఫర్లతో కలిపి ఈ ప్రీమియం ఫోన్స్‌ని అత్యంత తక్కువ ధరకే సొంతం చేసుకునే సువర్ణావకాశం ఇప్పుడు మీకు లభిస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
ఐఫోన్ లవర్స్‌కి అలర్ట్! ప్రీమియం స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి ఎలక్ట్రానిక్స్ రిటైల్ దిగ్గజం 'క్రోమా' గుడ్ న్యూస్ అందించింది. 'క్రోమ్‌టాస్టిక్ డిసెంబర్ సేల్' పేరుతో నిర్వహిస్తున్న ప్రత్యేక సేల్‌లో యాపిల్ ఐఫోన్ 16, ఐఫోన్15పై కళ్లు చెదిరే ఆఫర్లను ప్రకటించింది. డిసెంబర్ 15న ప్రారంభమైన ఈ సేల్ జనవరి 4, 2025 వరకు అందుబాటులో ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రీమియం స్మార్ట్‌ఫోన్స్‌పై లభిస్తున్న డీల్స్‌ని ఇక్కడ వివరంగా తెలుసుకోండి..

ఐఫోన్ 16 ధర భారీగా తగ్గింపు!
ఐఫోన్ 16 వాస్తవ ధర రూ. 65,990. కాగా ప్రస్తుత సేల్‌లో భాగంగా ఐఫోన్ 16 ఎఫెక్టివ్ ధరను రూ. 40,990 కి తగ్గించారు. ఆఫర్లు ఇలా ఉన్నాయి..
బ్యాంక్ ఆఫర్: ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులపై రూ. 3,000 ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.
ఎక్స్ఛేంజ్ వాల్యూ: పాత ఫోన్ కండిషన్ బాగుంటే రూ. 16,000 వరకు ఎక్స్ఛేంజ్ విలువ పొందవచ్చు.
ఎక్స్ఛేంజ్ బోనస్: అదనంగా రూ. 6,000 ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా లభిస్తుంది.
ఈ ఆఫర్లన్నీ కలిపితే ఐఫోన్ 16 ధర సగానికి పైగా తగ్గి, కేవలం రూ. 40,990 కే వస్తుంది. కొత్త ఫోన్‌కు అప్‌గ్రేడ్ అవ్వాలనుకునే వారికి ఇది నిజంగా బంపర్ ఆఫర్ అని చెప్పాలి.
అయితే ఈ డీల్స్ కేవలం క్రోమా ఫిజికల్ స్టోర్లలో మాత్రమే లభిస్తాయని, ఆన్‌లైన్ ధరల్లో మార్పులు ఉండవచ్చని సంస్థ స్పష్టం చేసింది.
2025లో ఐఫోన్ 16 ఎందుకు బెస్ట్ ఛాయిస్?
కొత్త మోడల్స్ మార్కెట్లోకి వచ్చినా, ఐఫోన్ 16 తనదైన ప్రత్యేకతతో నేటికీ వినియోగదారులను ఆకట్టుకుంటోంది! ముఖ్యంగా డిస్కౌంట్ ధరలో ఇది దొరుకుతున్నప్పుడు ఇంకా మంచి విషయం అని టెక్ నిపుణులు చెబుతున్నారు.
అద్భుతమైన పర్ఫార్మెన్స్: యాపిల్ రూపొందించిన శక్తివంతమైన ఏ18 చిప్‌సెట్, 8జీబీ ర్యామ్ దీని సొంతం. గేమింగ్ అయినా, ఏఐ ఫీచర్లు అయినా ఈ ఫోన్‌లో ఎంతో స్మూత్‌గా పనిచేస్తాయి. యాపిల్ అందించే దీర్ఘకాలిక ఐఓఎస్ అప్‌డేట్లు రాబోయే ఐదు- ఆరేళ్ల వరకు స్మార్ట్‌ఫోన్ కొత్తదిగా ఉండేలా చూస్తాయి.
ఫోటోగ్రఫీ కోసం కెమెరా కంట్రోల్: దీనిలో 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంది. తక్కువ వెలుతురులో కూడా అద్భుతమైన ఫోటోలు తీయడానికి వీలుగా అల్ట్రా-వైడ్ లెన్స్‌ను మెరుగుపరిచారు. ఇక ఫోన్ పక్కనే ఉండే డెడికేటెడ్ 'కెమెరా కంట్రోల్' బటన్ ద్వారా కెమెరా సెట్టింగ్స్‌ను వేగంగా యాక్సెస్ చేయవచ్చు.
బ్యాటరీ- కనెక్టివిటీ: ఒక్కసారి ఛార్జ్ చేస్తే రోజంతా బ్యాటరీ వచ్చేలా యాపిల్ దీనిని ఆప్టిమైజ్ చేసింది. ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్, మ్యాగ్‌సేఫ్ యాక్సెసరీస్, మెరుగైన 5జీ కనెక్టివిటీ దీని అదనపు ఆకర్షణలు.
ఐఫోన్ 15పైనా డిస్కౌంట్లు..
క్రోమాస్టిక్ డిసెంబర్ సేల్‌లో భాగంగా ఐఫోన్ 15పైనా డిస్కౌంట్లు ఇస్తోంది క్రోమా. స్టోర్‌లో ఈ గ్యాడ్జెట్ వాస్తవ ధర రూ. 5,490. కాగా, అదనపు క్యాష్‌బ్యాక్ రూ. 2వేలు, ఎక్స్ఛేంజ్ వాల్యూ కింద రూ. 14వేలు, ఎక్స్ఛేంజ్ బోనస్ కింద రూ. 4వేల తగ్గింపును సంస్థ ఇస్తోంది.
ఫలితంగా ఐఫోన్ 15 ధర రూ. 36,490కి దిగొస్తోంది!
తక్కువ ధరలో ప్రీమియం యాపిల్ ఎక్స్‌పీరియెన్స్ పొందాలనుకునే వారికి క్రోమా అందిస్తున్న ఈ అవకాశం అద్భుతమైనది. మీరు కూడా ఐఫోన్ ప్రియులైతే ఈ ఆఫర్ ముగిసేలోపు మీ సమీప క్రోమా స్టోర్‌ను సందర్శించండి.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


