ఐఫోన్ 16 ప్రోపై బంపర్ ఆఫర్- ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో రూ. 70 వేల కంటే తక్కువ ధరకే..!
ఐఫోన్ 16 ప్రోపై బంపర్ ఆఫర్! ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌ని రూ. 70 వేల కంటే తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. అయితే ఈ ఆఫర్ డిసెంబర్ 21 వరకు మాత్రమే అందుబాటులో ఉండనుంది. ఈ నేపథ్యంలో ఈ ఆఫర్ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
ఫ్లిప్‌కార్ట్ నిర్వహిస్తున్న 'ఎండ్ ఆఫ్ సీజన్ సేల్' డిసెంబర్ 12 నుంచి 21 వరకు కొనసాగుతోంది. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, వేరబుల్స్‌పై భారీ తగ్గింపులు లభిస్తున్నాయి. మరీ ముఖ్యంగా యాపిల్ ఐఫోన్ 16 ప్రోపై అందిస్తున్న తగ్గింపు కస్టమర్‌ల దృష్టిని ఆకర్షిస్తోంది! బ్యాంక్, ఎక్స్ఛేంజ్ బెనిఫిట్స్‌ని కలిపి చూస్తే, ఈ ఫోన్‌ను ఇప్పుడు రూ. 70,000 కంటే తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. వివరాల్లోకి వెళితే..

ఐఫోన్ 16 ప్రో- డీల్ వివరాలు..
లిస్టింగ్ ధర: ఈ సేల్ సమయంలో, 128జీబీ స్టోరేజ్‌తో కూడిన ఐఫోన్ 16 ప్రో ప్రారంభ ధర రూ. 1,09,900గా లిస్ట్ అయ్యింది.
బ్యాంక్ డిస్కౌంట్: ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో చెల్లించే కొనుగోలుదారులకు తక్షణమే రూ. 4,000 తగ్గింపు లభిస్తుంది.
ఎక్స్ఛేంజ్ బోనస్: దీనికి అదనంగా, యూజర్ పాత ఫోన్, దాని కండిషన్, పిన్‌కోడ్ అర్హత ఆధారంగా ఫ్లిప్‌కార్ట్ ఎక్స్ఛేంజ్ బోనస్‌ను అందిస్తోంది. దీని విలువ రూ. 68,050 వరకు ఉంటుంది.
బ్యాంక్ డిస్కౌంట్, గరిష్ట ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను కలిపినప్పుడు, ఈ స్మార్ట్‌ఫోన్ ఎఫెక్టివ్ ప్రైజ్ రూ. 70,000 కంటే బాగా తగ్గిపోతుంది. ఇది ప్రస్తుతం అందుబాటులో ఉన్న యాపిల్ డీల్స్‌లో అత్యంత ఆకర్షణీయమైనదిగా ఉందని చెప్పవచ్చు.
2025లోనూ ఐఫోన్ 16 ప్రో ఎందుకు బెస్ట్ ఆప్షన్?
ఐఫోన్ 16 ప్రో సరికొత్త మోడల్ కానప్పటికీ, దాని హై-ఎండ్ పర్ఫార్మెన్స్, మన్నికైన నిర్మాణం, దీర్ఘకాల సాఫ్ట్‌వేర్ సపోర్ట్ కారణంగా ఇది ఇప్పటికీ శక్తివంతమైన ఎంపికగా ఉంది. ధర తగ్గడంతో ఫ్లాగ్షిప్కి పెట్టే డబ్బు కాకుండానే ప్రీమియం ఐఫోన్‌ని కొనుగోలు చేసుకోవచ్చు.
ఐఫోన్ 16 ప్రో టైటానియం ఫ్రేమ్, టెక్స్‌చర్డ్ మ్యాట్ గ్లాస్ బ్యాక్, సిరామిక్ షీల్డ్ ఫ్రంట్‌తో వస్తుంది. బ్లాక్, వైట్, నాచురల్, డెసర్ట్ టైటానియం ఫినిషింగ్‌లలో లభిస్తుంది.
ఇందులో 6.3-ఇంచ్ సూపర్ రెటినా ఎక్స్‌డీఆర్ ఓలెడ్ డిస్‌ప్లే, 120హెచ్‌జెడ్ అడాప్టివ్ ప్రోమోషన్ రిఫ్రెష్ రేట్, హెచ్డీఆర్10, డాల్బీ విజన్ సపోర్ట్, 2,000 నిట్స్ వరకు పీక్ అవుట్‌డోర్ బ్రైట్‌నెస్ ఇందులో ఉన్నాయి.
యాపిల్ ఏ18 ప్రో చిప్‌తో ఈ స్మార్ట్‌ఫోన్ పనిచేస్తుంది. ఇందులో 6-కోర్ సీపీయూ, 6-కోర్ జీపీయూ 16-కోర్ న్యూరల్ ఇంజిన్ ఉన్నాయి.
ఐఓఎశ్లో అంతర్నిర్మిత ‘యాపిల్ ఇంటెలిజెన్స్’ ఫీచర్లు ఉత్పాదకత, సృజనాత్మకత, ఆన్-డివైస్ గోప్యతపై దృష్టి సారించే టూల్స్‌ను అందిస్తాయి.
ఈ ఐఫోన్ 16 ప్రోలో క్వాడ్-కెమెరా సెటప్ ఉంది. ఇందులో అధునాతన సెన్సార్-షిఫ్ట్ స్టెబిలైజేషన్‌తో కూడిన 48ఎంపీ ప్రధాన సెన్సార్, 48ఎంపీ అల్ట్రా-వైడ్ కెమెరా, టెట్రాప్రిజం టెక్నాలజీతో కూడిన 12ఎంపీ 5ఎక్స్ టెలిఫోటో లెన్స్, 12ఎంపీ 2ఎక్స్ టెలిఫోటో ఆప్షన్ ఉన్నాయి. 12ఎంపీ ఫ్రంట్ కెమెరాతో ఈ ఫోన్ వస్తుంది.
ఈ ఐఫోన్ 16 ప్రో స్మార్ట్‌ఫోన్ 5జీ, వైఫై 7, బ్లూటూత్ 5.3, సెకెండ్ జనరేషన్ అల్ట్రా వైడ్‌బ్యాండ్ చిప్‌కు సపోర్ట్ చేస్తుంది. డిస్‌ప్లేపోర్ట్ సపోర్ట్‌తో యూఎస్బీ-సీ కూడా ఇందులో ఉంది.
ఐపీ68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్, ఫేస్ ఐడి, శాటిలైట్ ద్వారా ఎమర్జెన్సీ ఎస్ఓఎస్, క్రాష్ డిటెక్షన్ వంటి ఫీచర్లతో ఐఫోన్ 16 ప్రో సమగ్ర ప్రీమియం స్మార్ట్‌ఫోన్ అనుభవాన్ని అందిస్తోంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


