7000ఎంఏహెచ్ బ్యాటరీతో రియల్మీ కొత్త స్మార్ట్‌ఫోన్స్- ధర రూ. 20వేల లోపే!
రియల్మీ నార్జో 90 సిరీస్ ఇండియాలో లాంచ్‌కు రెడీ అవుతోంది! ఇందులో రెండు కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్స్ ఉంటాయి. డిసెంబర్ 16న లాంచ్‌కి ముందు ఈ గ్యాడ్జెట్స్‌కి చెందిన ధరలు, పూర్తి స్పెసిఫికేషన్లు లీక్ అయ్యాయి. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
రియల్మీ సంస్థ తన రియల్మీ నార్జో స్మార్ట్‌ఫోన్ సిరీస్‌ను ఎక్స్‌ప్యాండ్ చేయడానికి సిద్ధమైంది. ఇందులో భాగంగా ఈ వారం రియల్మీ నార్జో 90 5జీ, రియల్మీ నార్జో 90ఎక్స్ 5జీ అనే రెండు కొత్త ఫోన్‌లను విడుదల చేయనుంది. కంపెనీ ఇప్పటికే కొన్ని ఫీచర్లను టీజ్ చేసినప్పటికీ, అధికారిక లాంచ్‌కు ముందే ఈ ఫోన్‌ల పూర్తి స్పెసిఫికేషన్లు, అంచనా ధరలు లీకయ్యాయి. వాటి వివరాలు..

రియల్మీ నార్జో 90 సిరీస్- లాంచ్ తేదీ, ధర (అంచనా)..
ఈ రియల్మీ నార్జో 90 స్మార్ట్‌ఫోన్ సిరీస్‌ను భారత్‌లో డిసెంబర్ 16వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు అధికారికంగా లాంచ్ చేయనున్నారు. ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు లాంచ్ అయిన వెంటనే అమెజాన్, రియల్‌మీకి చెందిన అధికారిక వెబ్‌సైట్ ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉంటాయి.
టిప్‌స్టర్ పారస్ గుగ్లానీ లీక్ చేసిన వివరాల ప్రకారం ఈ సిరీస్ ధరలు..
రియల్మీ నార్జో 90: ఆఫర్‌లతో కలిపి సుమారు రూ. 17,999 ప్రారంభ ధరతో లభించే అవకాశం ఉంది.
రియల్మీ నార్జో 90ఎక్స్: ఆఫర్‌లతో కలిపి సుమారు రూ. 14,999 ప్రారంభ ధరతో అందుబాటులోకి రావచ్చు.
ఈ రెండు మోడళ్లు కూడా రెండు వేరియంట్‌లలో లభిస్తాయి: 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్, 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్.
రియల్మీ నార్జో 90 5జీ: ముఖ్య ఫీచర్లు (అంచనా)..
స్క్రీన్: 6.8 ఇంచ్ అమోఎల్ఈడీ డిస్‌ప్లే, 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, 1400 నిట్స్ వరకు బ్రైట్‌నెస్.
ప్రాసెసర్: మీడియాటెక్ డైమెన్సిటీ 6400 మ్యాక్స్ ప్రాసెసర్ ద్వారా పనిచేసే అవకాశం ఉంది.
స్టోరేజ్: యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజ్‌తో వస్తుంది.
కెమెరా (వెనుక): డ్యూయల్ రేర్ కెమెరా సెటప్. ఇందులో 50ఎంపీ ప్రైమరీ సెన్సార్, 2ఎంపీ సెకండరీ లెన్స్ ఉండవచ్చు.
కెమెరా (ముందు): సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో కూడా 50ఎంపీ కెమెరా ఉండే అవకాశం ఉంది.
బ్యాటరీ అండ్ ఛార్జింగ్: 7000ఎంఏహెచ్ భారీ బ్యాటరీ, 60డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.
ఆపరేటింగ్ సిస్టమ్: రియల్మీ యూఐ 6.0 పై పనిచేస్తుంది.
ఇతరాలు: ఈ ఫోన్‌లో ఈ-సిమ్ సపోర్ట్ ఉండకపోవచ్చు. ఇది విక్టరీ గోల్డ్, కార్బన్ బ్లాక్ అనే రెండు రంగులలో లభిస్తుంది.
రియల్మీ నార్జో 90ఎక్స్ 5జీ: ముఖ్య ఫీచర్లు (అంచనా)..
రియల్మీ నార్జో 90ఎక్స్ 5జీలో ఉండే అవకాశం ఉన్న కీలక స్పెసిఫికేషన్లు:
స్క్రీన్: 6.8 ఇంచ్ హెచ్డీ+ ఎల్సీడీ డిస్‌ప్లే, 144హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, 1200 నిట్స్ బ్రైట్‌నెస్.
ప్రాసెసర్: మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌తో శక్తిని పొందుతుంది.
కెమెరా (వెనుక): డ్యూయల్ రియర్ కెమెరా సెటప్. ఇందులో 50ఎంపీ మెయిన్ కెమెరా, 2ఎంపీ సెకండరీ లెన్స్ ఉంటాయి.
కెమెరా (ముందు): సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
బ్యాటరీ అండ్ ఛార్జింగ్: 7000ఎంఏహెచ్ బ్యాటరీతో పాటు 60డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది.
ఆపరేటింగ్ సిస్టమ్: రియల్మీ యూఐ 6.0 పై రన్ అవుతుంది.
కలర్ ఆప్షన్స్: ఈ స్మార్ట్‌ఫోన్ ఫ్లాష్ బ్లూ, నైట్రో బ్లూ అనే రెండు రంగులలో విడుదల కానుంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


