సీనియర్​ సిటిజన్స్​కి క్రెడిట్​ కార్డులు- ఇవి కచ్చితంగా తెలుసుకోవాలి..

క్రెడిట్​ కార్డుల వినియోగం ఈ మధ్య పెరిగిపోయింది. సీనియర్ సిటిజన్స్‌కు కూడా క్రెడిట్ కార్డులు లభిస్తున్నాయి. అయితే సీనియర్​ సిటిజన్లు మంచి, సరైన కార్డును ఎంచుకోవడానికి 6 ముఖ్యమైన అంశాలను ఇక్కడ తెలియజేశాము. ఇది మీకు కచ్చితంగా ఉపయోగపడుతుంది.

Published on: Dec 7, 2025, 16:00:03 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

దేశంలోని సీనియర్ సిటిజన్స్ ట్రావెల్​ బుకింగ్‌లు, కిరాణా సామాగ్రి, ఆరోగ్య ఖర్చులు వంటి రోజువారీ అవసరాలను తీర్చుకోవడానికి క్రెడిట్ కార్డులను వినియోగించడం పెరిగింది. అయితే సరైన క్రెడిట్ కార్డును ఎంచుకోవడానికి జాగ్రత్తగా విశ్లేషణ, పరిశీలన చాలా అవసరం.

సీనియర్​ సిటిజన్స్​కి క్రెడిట్​ కార్డులు- ఇవి కచ్చితంగా తెలుసుకోవాలి..
సీనియర్​ సిటిజన్స్​కి క్రెడిట్​ కార్డులు- ఇవి కచ్చితంగా తెలుసుకోవాలి..

సీనియర్ సిటిజన్స్ తమ అవసరాలకు, గోల్స్​కి సరిపోయే ఉత్తమమైన క్రెడిట్ కార్డును కనుగొనడానికి ఇక్కడ ఒక సింపుల్​, ఆచరణాత్మకమైన గైడ్​లైన్​ని అందిస్తున్నాము. ఏదైనా కొత్త క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునే ముందు మీరు తప్పనిసరిగా అంచనా వేయవలసిన ఆరు ముఖ్య అంశాలు ఇక్కడ ఉన్నాయి:

1. తక్కువ వార్షిక రుసుములు, కనిష్ఠ హిడెన్​ ఛార్జీలు..

పెరుగుతున్న జీవన వ్యయాల దృష్ట్యా, సీనియర్ సిటిజన్స్ జీరో లేదా తక్కువ వార్షిక రుసుము ఉన్న క్రెడిట్ కార్డులకు ప్రాధాన్యత ఇవ్వాలి. చాలా బ్యాంకులు తక్కువ ఖర్చు చేసేవారికి ఫీజులను మాఫీ చేయడం లేదా సీనియర్ల కోసం ప్రత్యేక వేరియంట్‌లను అందించడం జరుగుతుంది. అంతేకాకుండా నగదు ఉపసంహరణ రుసుములు లేదా స్టేట్‌మెంట్ కాపీ రుసుములు వంటి హిడెన్​ ఛార్జీలను కూడా జాగ్రత్తగా సమీక్షించాలి.

2. వడ్డీ రేట్లు..

తక్కువ వార్షిక శాతం రేటు (ఏపీఆర్​) కలిగి ఉండటం చాలా ముఖ్యం. ప్రత్యేకించి అప్పుడప్పుడు బ్యాలెన్స్‌ను ముందుకు తీసుకువెళ్లే వినియోగదారులకు ఇది అవసరం. ఆర్బీఐ నిబంధనలు పారదర్శకతను నిర్ధారించినప్పటికీ, వివిధ బ్యాంకుల మధ్య వడ్డీ రేట్లు చాలా తేడాగా ఉంటాయి, కాబట్టి పోలిక ముఖ్యం. దీనిపై ఆయా క్రెడిట్ కార్డ్ జారీ చేసే సంస్థ కస్టమర్ సపోర్ట్ టీమ్‌తో మాట్లాడటం మంచిది.

3. బలమైన ఫ్రాడ్​ ప్రొటెక్షన్​, సురక్షిత డిజిటల్ టూల్స్..

సీనియర్ సిటిజన్స్‌ను లక్ష్యంగా చేసుకుని జరిగే సైబర్ మోసాలు ఇటీవలి కాలంలో పెరిగాయి. సరైన క్రెడిట్ కార్డ్ కింది ఫీచర్లను అందించాలి:

జీరో-లయబిలిటీ ప్రొటెక్షన్ (మోసం జరిగితే వినియోగదారుడు బాధ్యత వహించకపోవడం).

మోసపూరిత కార్యకలాపాల వివాద పరిష్కారానికి స్పష్టమైన మార్గదర్శకాలు.

రియల్-టైమ్ ఎస్​ఎంఎస్​, అప్లికేషన్ హెచ్చరికలు.

ఇన్​స్టెంట్​ కార్డ్ లాక్, అన్‌లాక్ సౌకర్యాలు.

సురక్షితమైన ఓటీపీ ఆధారిత లావాదేవీలు.

ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, కోటక్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ వంటి ప్రముఖ బ్యాంకులు తమ క్రెడిట్ కార్డులలో ఈ ఫీచర్లను మెరుగుపరిచాయి.

4. సులభమైన మొబైల్ బ్యాంకింగ్, సపోర్ట్..

సీనియర్ సిటిజన్స్ సరళమైన, సులువుగా అర్థమయ్యే మొబైల్ అప్లికేషన్‌లు, స్పష్టంగా నిర్వచించిన చెల్లింపు రిమైండర్‌లు అందించే క్రెడిట్ కార్డులను ఎంచుకోవాలి. ముఖ్యంగా క్లిష్ట సమయాల్లో ఏజెంట్‌లతో నేరుగా మాట్లాడగలిగే సామర్థ్యంతో సహా 24/7 కస్టమర్ సపోర్ట్ ఉన్న కార్డులకు ప్రాధాన్యత ఇవ్వాలి.

5. జీవనశైలి అవసరాలకు అనుగుణంగా రివార్డులు..

క్రెడిట్ కార్డు దరఖాస్తుదారులు సంక్లిష్టమైన పాయింట్ సిస్టమ్స్‌కు బదులుగా ఆచరణాత్మక రివార్డులను ఎంచుకోవాలి. కొన్ని ప్రయోజనకరమైన ఆప్షన్స్​:

  • కిరాణా, మందులు, యుటిలిటీ బిల్లులపై క్యాష్ బ్యాక్.
  • తరచుగా ప్రయాణించే వారికి ఇంధన సర్ఛార్జ్ మాఫీలు.
  • విమాన ప్రయాణాలు చేసే వారికి ఎయిర్‌పోర్ట్ లాంజ్ యాక్సెస్.

6. సరళమైన చెల్లింపు, ఈఎంఐ ఆప్షన్లు

చివరిగా, తక్కువ వడ్డీ రేట్ల వద్ద సులభంగా ఈఎంఐలుగా మార్చుకునే సౌకర్యాన్ని అందించే క్రెడిట్ కార్డులను సీనియర్ సిటిజన్స్ ఎంచుకోవడం తెలివైన పని. ఇది పెన్షన్ నిధులు లేదా నెలవారీ బడ్జెట్‌పై భారం పడకుండా, ఊహించని వైద్య లేదా గృహ ఖర్చులను నిర్వహించడానికి సహాయపడుతుంది.

క్రెడిట్ కార్డులతో అనుబంధిత రిస్క్‌లు..

క్రెడిట్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకునే ముందు సీనియర్ సిటిజన్స్ వాటితో ముడిపడి ఉన్న వివిధ రిస్క్‌ల గురించి కూడా తెలుసుకోవాలి. అవి..

అధికంగా ఖర్చు చేయడం: క్రెడిట్ కార్డులపై అధికంగా ఖర్చు చేయడం వల్ల అప్పులు వేగంగా పేరుకుపోతాయి. అందువల్ల, ఈ అప్పుల సాధనాలపై బ్యాలెన్స్‌లు, ఖర్చులను జాగ్రత్తగా ట్రాక్ చేయడం చాలా అవసరం.

అధిక వడ్డీ రేట్లు: ప్రతి నెలా పూర్తి బ్యాలెన్స్‌ను క్లియర్ చేయకపోతే, అధిక క్రెడిట్ కార్డు వడ్డీ రేట్లు వర్తిస్తాయి. ఇది కొనుగోలు చేసిన వస్తువులు, సేవల అసలు వ్యయాన్ని పెంచుతుంది.

క్రెడిట్ స్కోరుపై ప్రభావం: ఆలస్యంగా చెల్లింపులు చేయడం, బిల్లు చెల్లింపులు తప్పడం లేదా పూర్తిగా డిఫాల్ట్ కావడం వల్ల క్రెడిట్ స్కోర్‌కు భారీ నష్టం వాటిల్లుతుంది. ఇది భవిష్యత్తులో రుణాలు పొందడం కష్టతరం చేస్తుంది.

అదనపు రుసుములు: క్రెడిట్ కార్డుల్లో అధిక ఫీజులు, వార్షిక ఛార్జీలు, విదేశీ లావాదేవీల రుసుములు, ఆలస్య రుసుములు ఉంటాయి. దరఖాస్తు చేసుకునే వారు వీటిని దృష్టిలో ఉంచుకోవాలి, తద్వారా తర్వాత ఆశ్చర్యాలు నివారించవచ్చు.

సరైన క్రెడిట్ కార్డును ఎంచుకోవడం భారతదేశంలోని సీనియర్ సిటిజన్స్‌కు సౌలభ్యాన్ని, ఆర్థిక భద్రతను గణనీయంగా పెంచుతుంది. ఈ ఆరు అంశాలను అంచనా వేయడం సమతుల్యమైన, సురక్షితమైన, విలువ ఆధారిత ఎంపికకు దారితీస్తుంది.

(గమనిక- ఇది సమచారం కోసం రూపొందించిన కథనం మాత్రమే. క్రెడిట్​ కార్డు వినియోగం రిస్కీ అని గుర్తుపెట్టుకోవాలి.)

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More