...
...
Next Story

iPhone 17 Pro : ఐఫోన్ 18 ప్రో లాంచ్​కి ముందు.. ఐఫోన్ 17 ప్రోపై అదిరిపోయే ఆఫర్లు!

iPhone 17 Pro offers : ఐఫోన్ 17 ప్రో ధర భారీగా తగ్గింది. స్వాతంత్ర్య దినోత్సవ సేల్‌లో భాగంగా ఐవెంట్, ఫ్లిప్‌కార్ట్ రూ. 13,000 నుండి రూ. 16,000 వరకు డిస్కౌంట్లు అందిస్తున్నాయి. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.

Published on: Aug 14, 2026, 06:45:37 IST
Advertisement

యాపిల్ తన ప్రీమియం మోడల్ ఐఫోన్ 17 ప్రో ధరను భారీగా తగ్గించింది. ప్రముఖ యాపిల్ అధీకృత ఆన్‌లైన్ విక్రేత ఇన్​వెంట్ (iNvent) తన స్వాతంత్ర్య దినోత్సవ సేల్‌లో భాగంగా ఐఫోన్ 17 ప్రోపై ఆకర్షణీయమైన తగ్గింపును అందిస్తోంది. అర్హత కలిగిన బ్యాంక్ ఆఫర్లతో కలిపి మొత్తం రూ. 13,000 వరకు ఆదా చేసుకోవచ్చు. అయితే ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ మరింత ఎక్కువగా, రూ. 16,000 వరకు డిస్కౌంట్ అందిస్తుండటం విశేషం.

ఐఫోన్ 17 ప్రోపై ఆఫర్లు ఇలా..

ఐఫోన్ 17 ప్రో..
ఐఫోన్ 17 ప్రో..

భారత మార్కెట్లో ఐఫోన్ 17 ప్రో అసలు ధర రూ. 1,34,900గా ఉంది. ప్రస్తుతం ఇన్​వెంట్ ఆఫర్ ద్వారా దీని ధరను రూ. 1,27,900కి తగ్గించారు. అంటే ఎలాంటి షరతులు లేకుండా నేరుగా రూ. 7,000 ఫ్లాట్ డిస్కౌంట్ లభిస్తుంది. యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ లేదా ఎస్బీఐ క్రెడిట్ కార్డులను ఉపయోగించి ఈఎంఐ పద్ధతిలో కొనుగోలు చేసే వారికి మరో రూ. 6,000 ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. దీనితో ఫోన్ అసలు ధర రూ. 1,21,900కి పడిపోతుంది. ఒరిజినల్ లాంచ్ ధరతో పోలిస్తే కొనుగోలుదారులు రూ. 13,000 వరకు ఆదా చేసుకోవచ్చు.

క్యాష్‌బ్యాక్ వర్తించకపోయినా, కేవలం రూ. 7,000 ధర తగ్గింపు వల్ల కూడా ఇది లాభదాయకమే. అర్హత ఉన్న కార్డులు లేని వారికి లేదా ఈఎంఐ ద్వారా కాకుండా నేరుగా కొనుగోలు చేయాలనుకునే వారికి ఈ ఫ్లాట్ డిస్కౌంట్ ఉపయోగపడుతుంది.

ఐఫోన్ 17 ప్రోపై ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ డిస్కౌంట్- కానీ..

ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ డే సేల్‌లో ఐఫోన్ 17 ప్రోపై మరో అద్భుతమైన ఆఫర్ అందుబాటులో ఉంది. ఈ ఈ-కామర్స్ వేదికపై ఫోన్ ధరను రూ. 1,26,900కి విక్రయిస్తున్నారు. అంటే అసలు ధర కంటే రూ. 8,000 తక్కువకే లభిస్తుంది. దీనికి తోడు అర్హత గల ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ద్వారా అదనంగా రూ. 4,000 డిస్కౌంట్ పొందవచ్చు. ఇక ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ లేదా ఫ్లిప్‌కార్ట్ ఎస్బీఐ క్రెడిట్ కార్డులు ఉన్నవారైతే అదనంగా మరో రూ. 8,000 తగ్గింపును సొంతం చేసుకోవచ్చు. మొత్తంగా రూ. 16,000 వరకు ఆదా చేసుకునే అవకాశం ఉంది.

ఈ డిస్కౌంట్లు వస్తున్న సమయం చాలా కీలకం అని చెప్పాలి! యాపిల్ తన తదుపరి తరం ఐఫోన్‌లను వచ్చే నెలలో ప్రకటించనుంది. అంటే ఐఫోన్ 18 ప్రో కొన్ని వారాల్లోనే అధికారికంగా మార్కెట్లోకి రానుంది. లీకైన సమాచారం ప్రకారం ఐఫోన్ 18 ప్రో ఎక్స్​టీరియర్​లో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. కానీ లోపలి ఫీచర్లు మాత్రం చాలా పవర్​ఫుల్​గా ఉండే అవకాశం ఉంది. కొత్త ఏ20 ప్రో చిప్, మెరుగైన బ్యాటరీ సామర్థ్యం, మరింత అడ్వాన్స్‌డ్ డిస్‌ప్లే, చిన్న డైనమిక్ ఐలాండ్, వేరియబుల్-అపర్చర్ కెమెరా వంటి ఆధునిక ఫీచర్లు రానున్నట్లు తెలుస్తోంది. బాహ్య డిజైన్ పాత మోడల్లాగే ఉన్నప్పటికీ, ఈ అప్‌గ్రేడ్‌ల వల్ల కొత్త ప్రో మోడల్ మరింత శక్తివంతంగా మారుతుంది.

అయితే అసలు సమస్య ధర గురించే! యాపిల్ గనుక మన దేశంలో ధరను రూ. 10,000 లేదా రూ. 20,000 వరకు పెంచితే, ఐఫోన్ 17 ప్రో మరింత ఆకర్షణీయమైన ఎంపికగా నిలుస్తుంది. ముఖ్యంగా కొత్త జనరేషన్ రాకతో పాత మోడల్ ధర మరింత తగ్గే అవకాశమూ ఉంటుంది.

ఐఫోన్ 14 లేదా ఐఫోన్ 15 నుంచి అప్‌గ్రేడ్ అవ్వాలనుకునే వారికి ఐఫోన్ 17 ప్రో ఇప్పటికే ఒక అద్భుతమైన ఎంపిక. కానీ మీకు అంత త్వరగా అవసరం లేకపోతే, యాపిల్ సెప్టెంబర్ ప్రకటన వరకు వేచి చూడటం తెలివైన పనే అవుతుంది. ఐఫోన్ 18 ప్రో అధికారిక ధర, స్పెసిఫికేషన్లు తెలిసిన తర్వాత కొత్త ఫీచర్ల కోసం ఎక్కువ డబ్బులు చెల్లించడం అవసరమా లేదా తగ్గింపు ధరలో లభించే ఐఫోన్ 17 ప్రోనే బెటరా అని నిర్ణయించుకోవడం సులభం అవుతుంది.

టెక్ వర్గాల్లో ఎప్పటినుంచో చర్చనీయాంశంగా ఉన్న యాపిల్ ఫోల్డబుల్ ఐఫోన్ కూడా 2026లో మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ అదే జరిగితే దాని ధర రూ. 2 లక్షలకు పైగా ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. సాంప్రదాయ ప్రో ఐఫోన్ కోరుకునే సాధారణ వినియోగదారులందరికీ మాత్రం ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఐఫోన్ 17 ప్రో డిస్కౌంట్లు కచ్చితంగా పరిశీలించదగినవే.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe