బడ్జెట్ ఫ్లాగ్‌షిప్ OnePlus 15R వచ్చేస్తోంది.. లాంచ్ డేట్, స్పెసిఫికేషన్లు ఇవే!
8000ఎంఏహెచ్ బ్యాటరీతో వన్‌ప్లస్ 15ఆర్ లాంచ్‌కు రెడీ అవుతోంది! ఈ స్మార్ట్‌ఫోన్ డిసెంబర్ 17న భారత్‌లో బడ్జెట్ ఫ్లాగ్‌షిప్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ మొబైల్‌పై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
వన్‌ప్లస్ తన తదుపరి బడ్జెట్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ను భారతదేశంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ క్రమంలో వన్‌ప్లస్ 15ఆర్ మొబైల్‌ను డిసెంబర్ 17న అధికారికంగా విడుదల చేయనున్నట్లు కంపెనీ ధృవీకరించింది. కంపెనీ ఇంకా పూర్తి స్పెసిఫికేషన్ షీట్‌ని వెల్లడించనప్పటికీ, ప్రచార చిత్రాలు, ఇటీవల వచ్చిన లీక్‌ల ద్వారా వినియోగదారులు ఈ స్మార్ట్‌ఫోన్ నుంచి ఏం ఆశించవచ్చో ఇప్పటికే ఒక స్పష్టమైన అంచనా లభించింది.

వన్‌ప్లస్ 15ఆర్- డిజైన్: అధికారిక చిత్రాల్లో వెల్లడి
వన్‌ప్లస్ బ్రాండ్ తమ వెబ్‌సైట్‌లో 15ఆర్ మొదటి చిత్రాలను ప్రచురించింది. ఈ ఫొటోల ప్రకారం ఈ స్మార్ట్‌ఫోన్ క్లీన్, ఫ్లాట్-ఎడ్జ్‌డ్ డిజైన్‌తో రానుంది. ఇది ప్రీమియం వన్‌ప్లస్ 15 సిరీస్‌కు చాలా దగ్గరగా ఉంటుంది. వెనుక వైపున ఉన్న కెమెరా హౌసింగ్ కూడా సరళమైన చతురస్రాకార ఆకృతిని కలిగి ఉంది.
ఈ ఫోన్ లాంచింగ్ సమయంలో రెండు రంగుల ఆప్షన్లలో అందుబాటులోకి వస్తుంది. అవి.. క్లాసిక్ బ్లాక్, సరికొత్త గ్రీన్ ఫినిష్.
వన్‌ప్లస్ 15ఆర్- స్పెసిఫికేషన్లు (అంచనా)
వచ్చిన పలు లీక్‌ల ప్రకారం, ఈ హ్యాండ్‌సెట్ చైనాలో విక్రయిస్తున్న వన్‌ప్లస్ ఏస్ 6టీకి రీబ్యాడ్జ్ వెర్షన్‌గా ఉండే అవకాశం ఉంది. ఒకవేళ ఇది నిజమైతే, భారతదేశ వేరియంట్‌లో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 చిప్‌సెట్ ఉండే అవకాశం ఉంది. ఇది ఈ ఫోన్‌ను ఎగువ మధ్య-శ్రేణి కేటగిరీలో నిలబెడుతుంది.
బ్యాటరీ-
బ్యాటరీ సామర్థ్యం దీనికి హైలైట్ ఫీచర్‌గా నిలిచే అవకాశం ఉంది! వన్‌ప్లస్ ఎగ్జిక్యూటివ్ లి జీ లూయిస్ ఇప్పటికే ఏస్ 6టీలో భారీగా 8,000ఎఏహెచ్ బ్యాటరీ సెల్ ఉందని వెల్లడించారు. 15ఆర్ కూడా ఇదే బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని భావిస్తున్నారు. అంతేకాకుండా, 100డబ్ల్యూ వైర్డు ఛార్జింగ్, 50డబ్ల్యూ వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉండవచ్చని పుకార్లు వినిపిస్తున్నాయి. దీని ద్వారా ఇది తన విభాగంలో అత్యంత వేగవంతమైన ఛార్జింగ్ సామర్థ్యాన్ని అందించే అవకాశం ఉంది.
డిస్‌ప్లే, కెమెరా-
డిస్‌ప్లే విషయానికి వస్తే, లీక్‌ల ప్రకారం 165హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్ ప్యానెల్ ఉండే అవకాశం ఉంది. అయితే, పీక్ బ్రైట్‌నెస్- ప్యానెల్ టెక్నాలజీ వంటి ఇతర వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఫొటోగ్రఫీ కోసం వెనుకవైపు డ్యూయల్ 50ఎంపీ కెమెరా సిస్టమ్ ఉంటుందని సమాచారం.
ఇతర ఫీచర్లు-
ఇటీవలి వన్‌ప్లస్ మోడళ్లలో ప్రవేశపెట్టిన కస్టమైజ్ చేయదగిన ప్లస్ కీ ఫీచర్‌ను కూడా 15ఆర్ కొనసాగించే అవకాశం ఉంది. ఈ మొబైల్‌కు ఐపీ68, బహుశా ఐపీ69 ప్రొటెక్షన్ రేటింగ్‌లు కూడా ఉండవచ్చని అంచనా.
వన్‌ప్లస్ 15ఆర్- లాంచ్ తేదీ, ధర (అంచనా)..
వన్‌ప్లస్ 15ఆర్ అధికారికంగా డిసెంబర్ 17న భారతదేశంలో లాంచ్ అవుతుంది. దీని ధర, పాత మోడల్ అయిన వన్‌ప్లస్ 13ఆర్తో పోలిస్తే కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. 13ఆర్ ప్రారంభ ధర రూ. 42,999గా ఉంది.
తాజా అంచనాల ప్రకారం, కొత్త మోడల్ ధర సుమారుగా రూ. 44,999 నుంచి ప్రారంభం కావచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి!
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


