ట్రిపుల్ కెమెరా సెటప్‌తో Nothing Phone 3a.. ధర రూ. 25వేల కన్నా తక్కువే!
నథింగ్ ఫోన్ 3ఏ లైట్ 5జీ ఇండియాలో లాంచ్ అయ్యింది. రూ. 25 వేల బడ్జెట్‌లో అదిరిపోయే ఫీచర్లు అందిస్తోంది! ఈ నేపథ్యంలో స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్, ధర వంటి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
నథింగ్ కంపెనీ భారతదేశంలో మరొక మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేసింది. అదే నథింగ్ ఫోన్ 3ఏ లైట్ 5జీ. సరసమైన ధరలోనే అద్భుతమైన ఫీచర్లను అందిస్తున్న ఈ ఫోన్ గురించి కొన్ని రోజులుగా మంచి బజ్ నెలకొంది. నథింగ్ సిగ్నేచర్ అయిన గ్లిఫ్ ఇంటర్‌ఫేస్ స్థానంలో సరికొత్త “గ్లిఫీ లైట్”ను కలిగి ఉంది ఈ స్మార్ట్‌ఫోన్. దీని వల్ల ఈ స్మార్ట్‌ఫోన్ కొత్త డిజైన్, లుక్‌తో కనిపిస్తుంది. మీరు మంచి స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నట్లయితే, ఈ నథింగ్ 3ఏ లైట్ ఏం ఆఫర్ చేస్తుందో తెలుసుకోండి.

నథింగ్ ఫోన్ 3ఏ లైట్ 5జీ- ధర, లభ్యత..
నథింగ్ ఫోన్ 3ఏ లైట్ 5జీ ప్రారంభ ధర 8జీబీ+128జీబీ వేరియంట్‌కు రూ. 20,999గా ఉంది.
8జీబీ+256జీబీ మోడల్ ధర భారతదేశంలో రూ. 22,999గా ఉంది.
లాంచ్ ఆఫర్‌లలో భాగంగా, నథింగ్ కంపెనీ ఐసీఐసీఐ, వన్‌కార్డ్ బ్యాంక్ డిస్కౌంట్లను కూడా ప్రకటించింది.
ఈ స్మార్ట్‌ఫోన్ సేల్ డిసెంబర్ 5, 2025 నుంచి ఫ్లిప్‌కార్ట్‌తో పాటు విజయ్ సేల్స్, క్రోమా వంటి రిటైల్ స్టోర్‌లలో ప్రారంభమవుతుంది.
- అమెజాన్ బ్లాక్ ఫ్రైడే సేల్‌లో ఐఫోన్ 16పై భారీ తగ్గింపు లభిస్తోంది. పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
నథింగ్ ఫోన్ 3ఏ లైట్ 5జీ: స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
నథింగ్ ఫోన్ 3ఏ లైట్ 5జీలో ఉన్న కీలకమైన స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు ఇక్కడ ఉన్నాయి:
డిస్‌ప్లే: ఇది 6.77 ఇంచ్ ఫ్లెక్సిబుల్ అమోఎల్ఈడీ డిస్‌ప్లేతో వస్తుంది. ఇది 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, గరిష్టంగా 3,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ను అందిస్తుంది.
ప్రాసెసర్ అండ్ ర్యామ్: ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రో చిప్‌సెట్ ద్వారా పవర్‌ని పొందుతుంది. దీనికి 8జీబీ ర్యామ్, గరిష్టంగా 256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కనెక్ట్ చేసి ఉంటుంది.
కెమెరా సెటప్: నథింగ్ ఫోన్ 3ఏ లైట్ 5జీలో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపీ మెయిన్ కెమెరా, 8ఎంపీ అల్ట్రావైడ్ కెమెరా, వివరాలు వెల్లడించని మూడొవ సెన్సార్ ఉన్నాయి.
సెల్ఫీ కెమెరా: సెల్ఫీల కోసం, ముందు భాగంలో 16ఎంపీ ఫ్రంట్ కెమెరాను అందించారు.
బ్యాటరీ అండ్ ఛార్జింగ్: ఈ స్మార్ట్‌ఫోన్‌లో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 33డబ్ల్యూ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.
సాఫ్ట్‌వేర్ & అప్‌గ్రేడ్‌లు: ఇది ఆండ్రాయిడ్ 15 ఆధారిత నథింగ్ ఓఎస్ 3.5పై పనిచేస్తుంది. కంపెనీ 3 సంవత్సరాల ఓఎస్ అప్‌గ్రేడ్‌లు, 6 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌గ్రేడ్‌లు అందిస్తామని హామీ ఇచ్చింది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


