200ఎంపీ కెమెరా ఉన్న Vivo X300 తీసుకోవాలా? లేక 7000ఎంఏహెచ్​ బ్యాటరీ ఫోన్​ iQOO 15 బెటర్​ ఆ?

ఇంకొన్ని రోజుల్లో ఇండియా మార్కెట్​లో రెండు కొత్త స్మార్ట్​ఫోన్స్​ లాంచ్​ అవుతున్నాయి. అవి.. వివో ఎక్స్​300, ఐక్యూ 15. ఈ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్​ఫోన్స్​ మధ్య తేడాలేంటి? ధర, ఫీచర్స్ వంటి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

Published on: Nov 23, 2025, 09:10:02 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

వివో, ఐక్యూ కంపెనీలు భారతదేశంలో రెండు కొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్లను విడుదల చేయడానికి సిద్ధమవుతున్నాయి. వివో ఎక్స్​300 డిసెంబర్ 2న, ఐక్యూ 15 నవంబర్ 26న లాంచ్ కానున్నాయి.

వివో ఎక్స్​300 వర్సెస్​ ఐక్యూ 15: డిస్‌ప్లే..
వివో ఎక్స్​300 వర్సెస్​ ఐక్యూ 15: డిస్‌ప్లే..

ఈ రెండు బ్రాండ్లు కూడా మెరుగైన బ్యాటరీ లైఫ్, అప్‌డేటెడ్ కెమెరా సిస్టమ్స్, తాజా సాఫ్ట్‌వేర్ కోరుకునే వినియోగదారులను లక్ష్యంగా చేసుకుంటున్నాయి. అయితే వివో ఎక్స్​300 కాంపాక్ట్ డిజైన్, కెమెరా నాణ్యతపై దృష్టి పెడుతుందని అంచనా. మరోవైపు, ఐక్యూ 15 మాత్రం గేమింగ్, వీడియో అవసరాల కోసం బలమైన పనితీరు, పెద్ద డిస్‌ప్లేను కోరుకునే యూజర్లను లక్ష్యంగా చేసుకుంది.

ఈ రెండు స్మార్ట్‌ఫోన్స్​ కోసం వేచి చూస్తూ, దేనిని ఎంచుకోవాలో తెలియక మీరు గందరగోళానికి గురవుతుంటే, లీక్‌ల ఆధారంగా వాటి మధ్య ఉన్న తేడాలను ఇక్కడ తెలుసుకోండి..

వివో ఎక్స్​300 వర్సెస్​ ఐక్యూ 15: డిస్‌ప్లే

ఫీచర్వివో ఎక్స్​300ఐక్యూ 15
స్క్రీన్ సైజు6.31-అంగుళాల6.85-అంగుళాల
ప్యానెల్ఎల్​టీపీఓ అమోఎల్​ఈడీఎల్​టీపీఓ అమోఎల్​ఈడీ
రిజల్యూషన్1216 x 26401440 x 3168
రిఫ్రెష్ రేట్అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ఫిక్స్‌డ్ 120 Hz రిఫ్రెష్ రేట్

వివో ఎక్స్​300 స్క్రీన్ కంటెంట్ ఆధారంగా చలనాన్ని అడ్జెస్ట్​ చేసి, బ్యాటరీ వినియోగాన్ని మరింత సమర్థవంతంగా నిర్వహించే అడాప్టివ్ రిఫ్రెష్ రేట్‌కు మద్దతిస్తుందని పరిశ్రమ నివేదికలు సూచిస్తున్నాయి. మరోవైపు ఐక్యూ 15 స్మార్ట్​ఫోన్​ పెద్ద డిస్‌ప్లే, అధిక రిజల్యూషన్, ఫిక్స్‌డ్ 120 హెచ్​జెడ్​ రిఫ్రెష్ రేట్‌తో గేమింగ్, వీడియో ఎక్స్​పీరియెన్స్​ని మెరుగుపరిచే లక్ష్యంతో రానుంది.

వివో ఎక్స్​300 వర్సెస్​ ఐక్యూ 15: పర్ఫార్మెన్స్​, సాఫ్ట్​వేర్​..

ఫీచర్వివో ఎక్స్​300ఐక్యూ 15
ప్రాసెసర్మీడియాటెక్​ డైమెన్సిటీ 9500క్వాల్కమ్​ స్నాప్​డ్రాగన్​ 8 ఇలైట్​ జెన్​ 5
పనితీరురోజువారీ పనులు, సాధారణ గేమింగ్‌కు అనుకూలం.అత్యుత్తమ పనితీరు, భారీ యాప్‌లు, సుదీర్ఘ గేమింగ్‌కు అనుకూలం.
సాఫ్ట్‌వేర్ఆండ్రాయిడ్​ 16 ఆధారిత ఆరిజిన్​ఓఎస్​ 6ఆండ్రాయిడ్​ 16 ఆధారిత ఆరిజిన్​ఓఎస్​ 6
ర్యామ్/స్టోరేజ్12 GB + 256 GB నుంచి 16 GB + 1 TB వరకు12 GB + 256 GB నుంచి 16 GB + 1 TB వరకు

ఐక్యూ 15లో ఉండే క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్ అత్యంత వేగవంతమైన పనితీరును అందిస్తుంది. వివో ఎక్స్​300 లోని మీడియాటెక్ డైమెన్సిటీ 9500 చిప్ రోజువారీ పనులు, మోడరేట్ గేమింగ్ లోడ్లను సమర్థవంతంగా నిర్వహించగలదని అంచనా.

వివో ఎక్స్​300 వర్సెస్​ ఐక్యూ 15: బ్యాటరీ, ఛార్జింగ్

ఫీచర్వివో ఎక్స్​300ఐక్యూ 15
బ్యాటరీ సామర్థ్యం6040 mAh7000 mAh
వైర్డ్ ఛార్జింగ్90 W100 W
వైర్‌లెస్ ఛార్జింగ్40 W40 W
వాటర్ ప్రొటెక్షన్IP68IP68, IP69

ఐక్యూ 15లో 7000 ఎంఏహెచ్​ బ్యాటరీతో పాటు వేగవంతమైన 100డబ్ల్యూ వైర్డ్ ఛార్జింగ్ మద్దతు ఉండటం వల్ల ఇది పవర్ యూజర్లకు మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది. అలాగే, ఐక్యూ 15కి ఐపీ68తో పాటు ఐపీ69 ప్రొటెక్షన్ రేటింగ్ కూడా లభించే అవకాశం ఉంది.

వివో ఎక్స్​300 వర్సెస్​ ఐక్యూ 15: కెమెరా

ఫీచర్వివో ఎక్స్​300ఐక్యూ 15
ప్రధాన కెమెరా200 MP50 MP
సెకండరీ కెమెరాలు50 MP పెరిస్కోప్ లెన్స్, అల్ట్రావైడ్ లెన్స్పెరిస్కోప్ లెన్స్, అల్ట్రావైడ్ కెమెరా
ఫ్రంట్ కెమెరా50 MP32 MP

వివో ఎక్స్​300 వర్సెస్​ ఐక్యూ 15: ఇండియాలో ధరలు..

వివో ఎక్స్​300 ధర: డిసెంబర్ 2న లాంచ్ కానున్న ఈ ఫోన్ ప్రారంభ ధర సుమారు రూ. 75,999గా ఉండే అవకాశం ఉంది.

ఐక్యూ 15 ధర: నవంబర్ 26న లాంచ్ కానున్న ఈ స్మార్ట్​ఫోన్ ధర సుమారు రూ. 65,000 నుంచి రూ. 70,000 మధ్య ఉంటుందని అంచనా.

తక్కువ ప్రారంభ ధర వద్ద మెరుగైన పనితీరు, పెద్ద బ్యాటరీని కోరుకునే వారికి ఐక్యూ 15 ఒక మంచి ఎంపిక. అత్యుత్తమ కెమెరా, కాంపాక్ట్ డిజైన్‌ను కోరుకునే వారికి వివో ఎక్స్​300 అనుకూలంగా ఉంటుంది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More