7000ఎంఏహెచ్​ బ్యాటరీ, 50ఎంపీ కెమెరా- ఐక్యూ 13 కన్నా ఐక్యూ 15.. ఎందులో బెటర్​?

ఐక్యూ 15 స్మార్ట్‌ఫోన్ అతి త్వరలో భారత్‌లో త్వరలో విడుదల కానుంది. అమెజాన్‌లో ఇప్పటికే మైక్రోసైట్ ప్రత్యక్షమైంది. ఐక్యూ 13తో పోల్చితే డిస్‌ప్లే, ప్రాసెసర్, బ్యాటరీ, కెమెరా, సాఫ్ట్‌వేర్‌లో గణనీయమైన అప్​గ్రేడ్స్​ ఆశించవచ్చు. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

Published on: Oct 26, 2025 2:00 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

చైనాలో విడుదలైన కొద్ది రోజులకే తమ తదుపరి తరం ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ ఐక్యూ 15ను భారత్‌లో లాంచ్​ చేసేందుకు సంస్థ సిద్ధమవుతోంది. ఈ స్మార్ట్‌ఫోన్ మైక్రోసైట్ ఇప్పటికే అమెజాన్​లో ప్రత్యక్షమైంది. దీని బట్టి ఈ ఫోన్​ని వచ్చే నెలలోనే దేశీయ మార్కెట్లో విడుదల చేసేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తోందని తెలుస్తోంది. భారతీయ వేరియంట్ అధికారిక విడుదల తేదీ, పూర్తి స్పెసిఫికేషన్లు ఇంకా వెల్లడి కానప్పటికీ, ఐక్యూ 13తో పోలిస్తే ఇందులో అనేక అప్‌గ్రేడ్‌లు ఉంటాయని తెలుస్తోంది. ఐక్యూ 15లో కనిపించబోయే ప్రధానమైన టాప్ 5 మార్పులను ఇక్కడ తెలుసుకోండి..

ఐక్యూ 15 వర్సెస్​ ఐక్యూ 13
ఐక్యూ 15 వర్సెస్​ ఐక్యూ 13

1. డిస్‌ప్లే అప్​గ్రేడ్స్​

ఐక్యూ 15 స్మార్ట్​ఫోన్​లో కొద్దిగా పెద్దదైన 6.85-ఇంచ్​ కర్వ్డ్ శాంసంగ్ ఎం14 ఎల్​టీపీఓ అమోఎల్​ఈడీ డిస్‌ప్లే ఉండనుంది. ఇది ఐక్యూ 13లో ఉన్న కర్వ్డ్ క్యూ10 ఎల్​టీపీఓ అమోఎల్​ఈడీ ప్యానెల్ కంటే మెరుగైన అప్‌గ్రేడ్. కొత్త డిస్‌ప్లే 144హెచ్​జెడ్​ రిఫ్రెష్ రేట్‌ను కొనసాగిస్తుంది, కానీ అత్యధిక పీక్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. ఐక్యూ 13 4,500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ కంటే ఇది గణనీయంగా పెరిగి, దాదాపు 6,000 నిట్స్‌కు చేరుకోవచ్చని అంచనా. ఇది ఎక్స్​టర్నల్​ లైట్​లో డిస్‌ప్లే మరింత స్పష్టంగా కనిపించేలా చేస్తుంది.

2. పనితీరులో భారీ అప్​గ్రేడ్​

ఈసారి ఐక్యూ 15లో క్వాల్కమ్ అత్యాధునిక 3ఎన్​ఎం స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్‌సెట్ పవర్ ఇవ్వనుంది. ఐక్యూ 13లో ఉపయోగించిన స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ (4.6Gహెచ్​జెడ్​ వరకు స్పీడ్) కంటే ఇది చాలా పెద్ద ముందడుగు. ఈ కొత్త చిప్‌తో పాటు అడ్రినో 840 జీపీయూ, గేమింగ్ కోసం ప్రత్యేకంగా క్యూ3 గేమింగ్ చిప్‌సెట్ జత కావొచ్చు. ఈ ఫోన్ 16జీబీ LPDDR5x అల్ట్రా ర్యామ్​, 1టీబీ యూఎఫ్​సీ 4.1 స్టోరేజ్ వరకు సపోర్ట్ చేసే అవకాశం ఉంది. ఈ అప్​గ్రేడ్స్​ గేమింగ్, మల్టీటాస్కింగ్ పనితీరును పెంచడం లక్ష్యంగా పెట్టుకున్నాయి.

3. బ్యాటరీ, ఛార్జింగ్‌లో అప్‌గ్రేడ్

భారతీయ వినియోగదారుల కోసం బ్యాటరీ సామర్థ్యం మెరుగుపడే అవకాశం ఉంది. ఐక్యూ 15లో 7000ఎంఏహెచ్​ బ్యాటరీ ఉండవచ్చని అంచనా. ఇది ఐక్యూ 13లోని 6150ఎంఏహెచ్​ యూనిట్ కంటే పెద్దది. అలాగే, 100డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్, 40డబ్ల్యూ వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో ఈ ఫోన్ భారీ వినియోగదారులకు మరింత అనుకూలంగా మారుతుంది.

4. సాఫ్ట్‌వేర్​లో మార్పులు

ఐక్యూ 15 స్మార్ట్​ఫోన్​ ఆరిజిన్​ఓఎస్​ 6తో విడుదల కావడం దాదాపు ఖాయమైంది. ఇది ఐక్యూ 13లో ఉన్న ఫన్​టచ్​ఓఎస్​ స్థానంలో వస్తుంది. అప్‌డేట్ చేసిన ఈ ఇంటర్‌ఫేస్ కొత్త ఏఐ-ఆధారిత టూల్స్, మెరుగైన యానిమేషన్లు, సిస్టమ్ నిర్వహణలో మెరుగుదలలను కలిగి ఉండి, మరింత సరళమైన అనుభవాన్ని అందిస్తుంది.

5. కెమెరా అప్​గ్రేడ్స్​

కెమెరా విషయానికొస్తే, ఐక్యూ 15లో ట్రిపుల్ 50ఎంపీ సెటప్‌నే కొనసాగించినా, ఇందులో చెప్పుకోదగిన అప్​గ్రేడ్స్​ ఉంటాయి. ఇది ఓఐఎస్​ (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్)తో కూడిన అదే 50ఎంపీ సోనీ IMX921 ప్రైమరీ సెన్సార్, 50ఎంపీ అల్ట్రావైడ్ లెన్స్‌ను కలిగి ఉండవచ్చు. అయితే, ప్రధాన మెరుగుదల 3x ఆప్టికల్ జూమ్‌తో కూడిన 50ఎంపీ సోనీ IMX882 పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ ద్వారా వచ్చే అవకాశం ఉంది.

ఐక్యూ 15 పూర్తి ఫీచర్లు, భారత మార్కెట్‌లో దాని ధర వివరాలు త్వరలోనే వెల్లడవుతాయని టెక్​ నిపుణులు భావిస్తున్నారు.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More