7300ఎంఏహెచ్ బ్యాటరీ, 50ఎంపీ ట్రిపుల్ కెమెరా- ఇండియాలో OnePlus 15 ధర ఎంత?
వన్‌ప్లస్ 15 స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించి, లాంచ్‌కి ముందు ఇంకొన్ని వివరాలు అందుబాటులోకి వచ్చాయి. వీటితో పాటు ఇండియాలో ఈ స్మార్ట్‌ఫోన్ ధర అంచనాల గురించి కూడా ఇక్కడ వివరంగా తెలుసుకోండి..
వన్‌ప్లస్ 15 5జీ స్మార్ట్‌ఫోన్ త్వరలో భారత్‌లో విడుదల కానుంది. డిజైన్, స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లలో అనేక అప్‌గ్రేడ్‌లతో ఈ మొబైల్ వచ్చే నెలలో మార్కెట్లోకి రావచ్చని అంచనా! వన్‌ప్లస్ కంపెనీ ఈ గ్యాడ్జెట్ ఇండియన్ లాంచ్‌పై ఇప్పటికే టీజర్లను కూడా ప్రారంభించింది. దీని ద్వారా ఫోన్ డిజైన్, కొన్ని అప్‌గ్రేడ్స్ గురించి తెలుస్తోంది.

ఇక ఇప్పుడు, ప్రపంచవ్యాప్త లాంచ్‌కు ముందే, వన్‌ప్లస్ 15 5G మొబైల్ ప్రముఖ బెంచ్‌మార్కింగ్ ప్లాట్‌ఫామ్ గీక్‌బెంచ్‌లో కనిపించింది. అంతేకాకుండా, చైనా టీఈఎన్ఏఏ సర్టిఫికేషన్ వెబ్‌సైట్‌లో కూడా ఈ వివరాలు లీక్ అయ్యాయి. దీని ద్వారా ఈ స్మార్ట్‌ఫోన్‌లోని ముఖ్యమైన ఫీచర్లు, పర్ఫార్మెన్స్ స్కోర్‌లు, ఇతర కీలక అంశాలు బయటపడ్డాయి. కాబట్టి, మీరు వన్‌ప్లస్ 15 5జీ కోసం ఎదురుచూస్తుంటే, ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
వన్‌ప్లస్ 15 5జీ- గీక్‌బెంచ్ వివరాలు..
గీక్‌బెంచ్ డేటాబేస్ ప్రకారం.. వన్‌ప్లస్ 15 మూడు వేర్వేరు మోడల్ నంబర్లతో (CPH2745, CPH2747, CPH2748) లిస్ట్ అయ్యింది. ఇవి వేర్వేరు ప్రాంతాల కోసం రూపొందించిన వెర్షన్‌లు కావచ్చని భావిస్తున్నారు.
ప్రాసెసర్, ర్యామ్: CPH2747, CPH2748 మోడల్స్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్‌తో పాటు 16జీబీ ర్యామ్‌తో కనిపించాయి. అయితే, CPH2745 మోడల్ మాత్రం 12జీబీ ర్యామ్‌తో లిస్ట్ అయ్యింది.
పర్ఫార్మెన్స్ స్కోర్: ఈ కొత్త ఫ్లాగ్‌షిప్ ప్రాసెసర్‌తో సింగిల్-కోర్ టెస్టింగ్‌లో సుమారు 3000 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్టింగ్‌లో దాదాపు 10,000 పాయింట్లు సాధించింది. దీనిని బట్టి, ప్రాంతాన్ని బట్టి ఫోన్ పనితీరు, ర్యామ్ వేరుగా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.
టీఈఎన్ఏఏ సర్టిఫికేషన్ ద్వారా కీలక ఫీచర్లు..
మరోవైపు, టీఈఎన్ఏఏ సర్టిఫికేషన్ ద్వారా వన్‌ప్లస్ 15 మొబైల్ పరిమాణం, డిస్‌ప్లే వివరాలు వెల్లడయ్యాయి..
కొలతలు, బరువు: ఈ ఫోన్ 161.43 x 76.67 x 8.18ఎంఎం కొలతలను కలిగి ఉంటుంది. దీని బరువు సుమారు 210 గ్రాముల వరకు ఉండవచ్చు.
డిస్‌ప్లే: ఇందులో 6.78-ఇంచ్ ఓఎల్ఈడీ డిస్‌ప్లే ఉండొచ్చు. ఈ డిస్‌ప్లే 1.5కే రిజల్యూషన్, 165హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్ వరకు అందించే అవకాశం ఉంది. అలాగే, స్క్రీన్ కింద కొత్త అల్ట్రాసోనిక్ ఇన్-స్క్రీన్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ కూడా ఇందులో ఉండే అవకాశం ఉంది.
వన్‌ప్లస్ 15- బ్యాటరీ, కెమెరా స్పెసిఫికేషన్‌లు..
బ్యాటరీ: వన్‌ప్లస్ 15 మొబైల్‌కు శక్తినిచ్చేందుకు భారీ 7,300ఎంఏహెచ్ బ్యాటరీని ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇది డ్యుయెల్-సెల్ యూనిట్‌తో కూడి ఉంటుందని (ప్రతి సెల్ 3,575ఎంఏహెచ్) లీకైంది. భారీ బ్యాటరీ ఉండటం వల్ల ఛార్జింగ్ ఎక్కువసేపు నిలిచే అవకాశం ఉంది.
కెమెరా: ఫోటోగ్రఫీ కోసం, వన్‌ప్లస్ 15 వెనుక వైపు 50ఎంపీ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉండవచ్చు. ఇందులో 3ఎక్స్ పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ ఉండే అవకాశం ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 32ఎంపీ కెమెరాను అందించవచ్చు.
వన్‌ప్లస్ 15 5జీ- భారత్‌లో ధర (అంచనా)..
భారతదేశంలో వన్‌ప్లస్ 15 5జీ ధర సుమారు రూ. 65,000 నుంచి రూ. 75,000 మధ్య ఉండవచ్చని అంచనా. అయితే, ఇందులో లభించే స్టోరేజ్ ఆప్షన్లు, ఖచ్చితమైన ధరల కోసం మాత్రం అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడక తప్పదు.
వన్‌ప్లస్ 15తో పాటు మరొ స్మార్ట్‌ఫోన్‌ని కూడా సంస్థ లాంచ్ చేయనుంది. అదే వన్‌ప్లస్ ఏస్ 6. ఇది వన్‌ప్లస్ 15ఆర్గా ఇండియాలోకి అడుగుపెట్టే అవకాశం ఉంది. ఈ గ్యాడ్జెట్ వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


