7800ఎంఏహెచ్ బ్యాటరీతో వన్‌ప్లస్ కొత్త స్మార్ట్‌ఫోన్- ఇండియాలో ధర తక్కువే!
భారీ 7,800ఎంఏహెచ్ బ్యాటరీతో వన్‌ప్లస్ ఏస్ 6 చైనాలో లాంచ్‌కు రెడీ అవుతోంది. ఇండియాలో ఇదే గ్యాడ్జెట్ వన్‌ప్లస్ 15ఆర్గా వస్తోంది. ఈ మోడల్ ఫీచర్స్, ధర వంటి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
వన్‌ప్లస్ అభిమానులకు గుడ్‌న్యూస్! చైనాలో వచ్చే వారం వన్‌ప్లస్ 15 ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌తో పాటు వన్‌ప్లస్ ఏస్ 6 లాంచ్ కానుంది. ఈ ఫోన్ భారతదేశంతో పాటు ప్రపంచ మార్కెట్‌లో వన్‌ప్లస్ 15ఆర్ పేరుతో విడుదల కానుంది. అధికారిక లాంచ్‌కు ముందే ఈ హ్యాండ్‌సెట్‌కు సంబంధించిన అనేక ముఖ్యమైన వివరాలను కంపెనీ టీజ్ చేసింది. ఇది "అల్ట్రా పర్ఫార్మెన్స్" ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌గా వస్తోందని, 165హెచ్‌జెడ్ ఫ్లాట్ అమోలెడ్ స్క్రీన్, మెటల్ ఫ్రేమ్, అలాగే 7800ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్లతో వస్తుందని ధృవీకరించింది.

వన్‌ప్లస్ 15ఆర్ లాంచ్ వివరాలు..
వన్‌ప్లస్ ఏస్ 6 (వన్‌ప్లస్ 15ఆర్) అక్టోబర్ 27న చైనా స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 7 గంటలకు (భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4:30 గంటలకు) లాంచ్ కానుంది. ఇది ఫ్లాగ్‌షిప్ వన్‌ప్లస్ 15తో పాటు అరంగేట్రం చేయనుంది. ఈ లాంచ్ ఈవెంట్‌ను చైనీస్ మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ వీబోలోని కంపెనీ అధికారిక హ్యాండిల్‌లో వీక్షకులు ప్రత్యక్షంగా చూడవచ్చు.
వన్‌ప్లస్ 15ఆర్- ధర (అంచనా)..
చైనాలో వన్‌ప్లస్ ఏస్ 6 (వన్‌ప్లస్ 15ఆర్) ధర వివరాలు ఇంకా గోప్యంగా ఉన్నాయి. అయితే, ధర దీనికి ముందు మోడల్ అయిన వన్‌ప్లస్ ఏస్ 5 మాదిరిగానే ఉండవచ్చని అంచనాలు ఉన్నాయి.
వన్‌ప్లస్ ఏస్ 5 (12జీబీ + 256జీబీ వేరియంట్) చైనాలో లాంచ్ అయినప్పుడు 2,299 యువాన్లు (సుమారు రూ. 26,000) ధర పలికింది.
ఈ ఫోన్ భారత మార్కెట్‌లోకి వన్‌ప్లస్ 13ఆర్ పేరుతో వచ్చింది. అప్పుడు 12జీబీ + 256జీబీ వెర్షన్ ధర రూ. 42,999గా ఉంది.
వన్‌ప్లస్ ఏస్ 6, వన్‌ప్లస్ 15 ప్రస్తుతం ఒప్పో ఈ-షాప్, జేడీమాల్, కంపెనీ ఇతర ఆన్‌లైన్ స్టోర్‌లలో ప్రీ-రిజర్వేషన్ కోసం అందుబాటులో ఉన్నాయి. వినియోగదారులు కేవలం 1 యువాన్ (సుమారు రూ. 12) చెల్లించి ఈ హ్యాండ్‌సెట్‌ను బుక్ చేసుకోవచ్చు. దీని ద్వారా 3,255 యువాన్ (సుమారు రూ. 40,000) విలువైన ప్రయోజనాలు లభిస్తాయి. అక్టోబర్ 27న లాంచ్ అయిన తర్వాత ఈ ఫోన్ కొనుగోలుకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
వన్‌ప్లస్ 15ఆర్ ముఖ్య ఫీచర్లు, స్పెసిఫికేషన్లు..
వన్‌ప్లస్ 15ఆర్ ప్రస్తుత వన్‌ప్లస్ 13ఆర్ కంటే మెరుగైన అప్‌గ్రేడ్‌లను అందిస్తుందని కంపెనీ టీజ్ చేసింది. ఇది వన్‌ప్లస్ ఏస్ 6 స్పెసిఫికేషన్‌లను పోలి ఉంటుందని భావిస్తున్నారు. అధికారిక టీజర్‌లు, లీక్‌లు, పుకార్ల ఆధారంగా ఈ స్మార్ట్‌ఫోన్ గురించి తెలిసిన వివరాలు ఇక్కడ ఉన్నాయి:
డిజైన్
కలర్ ఆప్షన్లు: వన్‌ప్లస్ ఏస్ 6 (వన్‌ప్లస్ 15ఆర్) బ్లాక్, ఫ్లాష్ వైట్, క్విక్‌సిల్వర్ అనే మూడు రంగులలో అందుబాటులో ఉంటుంది.
ఫోన్ వెనుక భాగంలో నిలువుగా "ACE" బ్రాండింగ్ కనిపిస్తుంది.
దీని కెమెరా డిజైన్ వన్‌ప్లస్ 15లోని యూనిట్‌ను పోలి ఉంటుంది, అయితే కొంత మార్పు చేశారు.
టీజర్ చిత్రాల ప్రకారం, ఫోన్ ఫ్రేమ్ పైభాగంలో మూడు ఓపెనింగ్‌లు ఉన్నాయి. ఇవి మైక్రోఫోన్‌లు, ఐఆర్ బ్లాస్టర్ కోసం కావచ్చు.
ఇది మెటల్ ఫ్రేమ్‌ను కలిగి ఉంటుందని ధృవీకరించారు.
వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ కోసం ఈ వన్‌ప్లస్ 15ఆర్ ఐపీ66 + ఐపీ68 + ఐపీ69 + ఐపీ69కే రేటింగ్‌లను కలిగి ఉంటుంది.
ఈ ఫోన్ బరువు 213 గ్రాములు ఉంటుందని కూడా ధృవీకరించారు.
డిస్‌ప్లే
వన్‌ప్లస్ ఏస్ 6 (వన్‌ప్లస్ 15ఆర్) ఫ్లాట్ అమోలెడ్ స్క్రీన్‌తో వస్తుందని కంపెనీ ధృవీకరించింది సంస్థ.
ఇది 165హెచ్‌జెడ్ వరకు వేరియబుల్ రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తుంది. ఇది 60, 90, 120, 144, 165హెచ్‌జెడ్ వద్ద రిఫ్రెష్ అయ్యే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.
ఈ హ్యాండ్‌సెట్‌లో బీఓఈ డిస్‌ప్లే నుంచి వచ్చిన 1.5K ఓఎల్ఈడ్ ప్యానెల్ ఉండవచ్చని నివేదికలు సూచిస్తున్నాయి.
బయోమెట్రిక్ భద్రత కోసం ఇన్-డిస్‌ప్లే అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ స్కానర్, ఐ ప్రొటెక్షన్ ఫీచర్లు ఇందులో ఉంటాయి.
పర్ఫార్మెన్స్, సాఫ్ట్‌వేర్
వన్‌ప్లస్ 15ఆర్, ఫ్లాగ్‌షిప్ వన్‌ప్లస్ 13లో ఉన్న స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్ ద్వారా పనిచేసే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి.
గీక్‌బెంచ్ లిస్టింగ్ ప్రకారం, ఈ హ్యాండ్‌సెట్ గరిష్టంగా 14.76జీబీ ర్యామ్‌తో వస్తుంది, దీనిని మార్కెటింగ్‌లో 16జీబీ ర్యామ్‌గా చెప్పవచ్చు. చైనాలో ఇది ఆండ్రాయిడ్ 16 ఆధారిత కలర్‌ఓఎస్ 16తో వస్తుందని అంచనా.
బ్యాటరీ
వన్‌ప్లస్ ఏస్ 6 (వన్‌ప్లస్ 15ఆర్) తన సెగ్మెంట్‌లోనే అత్యంత పెద్దదిగా చెప్పుకునే 7800ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. ఇది 120డబ్ల్యూ ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. అయితే, వన్‌ప్లస్ 15 మాదిరిగా ఇందులో వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ గురించి ఎలాంటి ప్రస్తావన లేదు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


