ఐపీఎల్ రిటెన్షన్-10 టీమ్స్ అట్టిపెట్టుకున్న, వదిలేసుకున్న ప్లేయర్స్ ఫుల్ లిస్ట్-కొన్ని షాకింగ్ మార్పులు
ఐపీఎల్ 2026 కోసం టీమ్స్ రిటెన్షన్ ప్రక్రియ ముగిసింది. మినీ వేలానికి ముందు 10 జట్లు అట్టిపెట్టుకున్న, వదిలేసుకున్న ఆటగాళ్ల జాబితాలను ప్రకటించాయి. ఇందులో కొన్ని షాకింగ్ నిర్ణయాలున్నాయి. వీటిపై ఓ లుక్కేయండి.
ఐపీఎల్ మినీ వేలం ముందు టీమ్స్ కొంతమంది ప్లేయర్లను వదులుకోవడం, కొంతమందిని రిటైన్ చేసుకోవడం కామనే. కానీ ఐపీఎల్ 2026 సీజన్ కు ముందు మాత్రం కొన్ని షాకింగ్ నిర్ణయాలు తీసుకున్నాయి టీమ్స్. భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. మరి ఏ టీమ్ ఎవరిని వదులుకుంది? ఎవరిని కొనసాగించింది? అన్నది ఈ లిస్ట్ లో చూసేయండి.

చెన్నై సూపర్ కింగ్స్ (పర్సు 43.4 కోట్లు)
విడుదలైన వారు: రచిన్ రవీంద్ర, దీపక్ హుడా, విజయ్ శంకర్, షేక్ రషీద్, కమలేష్ నాగర్కోటి, మతీశ పతిరన, రాహుల్ త్రిపాఠి, వన్ష్ బేడి, సి ఆండ్రీ సిద్ధార్థ్, డెవాన్ కాన్వే, సామ్ కరన్ (ట్రేడ్ అవుట్), రవీంద్ర జడేజా (ట్రేడ్ అవుట్).
ఉన్న ఆటగాళ్లు: రుతురాజ్ గైక్వాడ్, ఆయుష్ మథ్రే, డ్యూవాల్డ్ బ్రెవిస్, ఎంఎస్ ధోని, ఉర్విల్ పటేల్, శివం దూబే, జెమీ ఓవర్టన్, రామకృష్ణ ఘోష్, నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, అన్షుల్ కంబోజ్, గుర్జన్‌ప్రీత్ సింగ్, నాథన్ ఎల్లిస్, శ్రేయాస్ గోపాల్, ముఖేష్ చౌదరి.
ట్రేడ్ ఇన్: సంజు శాంసన్ (RR నుండి).
కోల్‌కతా నైట్ రైడర్స్ (పర్సు: 64.3 కోట్లు; స్లాట్లు: 13)
విడుదలైన వారు: ఆండ్రీ రస్సెల్, వెంకటేష్ అయ్యర్, క్వింటన్ డి కాక్, మొయిన్ అలీ, ఆన్రిచ్ నోర్జే, మయాంక్ మార్కండే (ట్రేడ్ అవుట్), స్పెన్సర్ జాన్సన్, చేతన్ సకారియా, రెహ్మానుల్లా గుర్బాజ్, లువ్నిత్ సిసోడియా.
ఉన్న ఆటగాళ్లు: అజింక్యా రహానే, రింకు సింగ్, రఘువంశీ, రోవ్‌మన్ పావెల్, మనీష్ పాండే, సునీల్ నరైన్, రమణ్ దీప్ సింగ్, అనుకుల్ రాయ్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా, వైభవ్ అరోరా, ఉమ్రాన్ మాలిక్.
ముంబై ఇండియన్స్ (పర్సు: 2.75 కోట్లు; స్లాట్లు: 5)
విడుదలైన వారు: సత్యనారాయణ రాజు, రీస్ టాప్లీ, కెఎల్ శ్రీజిత్, కర్ణ్ శర్మ, అర్జున్ టెండూల్కర్ (ట్రేడ్ అవుట్), బెవాన్ జాకబ్స్, ముజీబ్ ఉర్ రెహమాన్, లిజార్డ్ విలియమ్స్, విగ్నేష్ పుథిర్, చరిత్ అసలంక, జానీ బేర్‌స్టో.
ఉన్న ఆటగాళ్లు: రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, రాబిన్ మింజ్, ర్యాన్ రికెల్టన్, హార్దిక్ పాండ్యా, నమన్ ధీర్, మిచెల్ శాంట్నర్, విల్ జాక్స్, కార్బిన్ బోష్, రాజ్ బవా, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా, దీపక్ చాహర్, అశ్వని కుమార్, రఘు శర్మ, అల్లా ఘజన్‌ఫర్.
ట్రేడ్ ఇన్: రూథర్‌ఫోర్డ్, శార్దుల్ ఠాకూర్, మయాంక్ మార్కండే.
రాజస్థాన్ రాయల్స్ (పర్సు: 16.05 కోట్లు; స్లాట్లు: 9)
విడుదలైన వారు: సంజు శాంసన్ (ట్రేడ్ అవుట్), నితీష్ రాణా (ట్రేడ్ అవుట్), వనిందు హసరంగ, మహేష్ తీక్షణ, కునాల్ సింగ్ రాథోర్, ఫజల్‌హక్ ఫరూఖీ, ఆకాష్ మధ్వాల్, అశోక్ శర్మ, కుమార్ కార్తికేయ.
ఉన్న ఆటగాళ్లు: యశస్వి జైస్వాల్, షిమ్రాన్ హెట్మేయర్, వైభవ్ సూర్యవంశీ, శుభమన్ పాండే, ప్రీటోరియస్, ధ్రువ్ జురేల్, రియాన్ పరాగ్, జోఫ్రా ఆర్చర్, తుషార్ దేశ్‌పాండే, సందీప్ శర్మ, యుధ్వీర్ సింగ్, క్వెనా మఫాకా, నంద్రే బర్గర్.
ట్రేడ్ ఇన్: రవీంద్ర జడేజా, సామ్ కరన్, డోనోవన్ ఫెరీరా.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (పర్సు: 16.4 కోట్లు; స్లాట్లు: 8)
విడుదలైన వారు: లియామ్ లివింగ్‌స్టోన్, స్వాస్తిక్ చికార, మయాంక్ అగర్వాల్, టిమ్ సీఫెర్ట్, మనోజ్ భండాగే, లుంగి ఎన్గిడి, మోహిత్ రాథీ, బ్లెసింగ్ మురజాబాని.
ఉన్న ఆటగాళ్లు: విరాట్ కోహ్లీ, రజత్ పటిదార్, టిమ్ డేవిడ్, దేవదత్ పడిక్కల్, ఫిల్ సాల్ట్, జితేష్ శర్మ, కృనాల్ పాండ్యా, జాకబ్ బెథెల్, రొమారియో షెపర్డ్, స్వప్నిల్ సింగ్, జోష్ హాజిల్‌వుడ్, భువనేశ్వర్ కుమార్, రసిఖ్ సలామ్, యష్ దయాల్, సుయాష్ శర్మ, నువాన్ థుషారా, అభినందన్ సింగ్.
సన్‌రైజర్స్ హైదరాబాద్ (పర్సు: 25. కోట్లు; స్లాట్లు: 10)
విడుదలైన వారు: మహమ్మద్ షమీ (ట్రేడ్ అవుట్), అతర్వ తైడే, అభినవ్ మనోహర్, సచిన్ బేబీ, వియాన్ మల్డర్, సిమర్జీత్ సింగ్, రాహుల్ చాహర్, ఆడమ్ జంపా.
ఉన్న ఆటగాళ్లు: ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, అంకిత్ వర్మ, ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి, హర్ష్ దూబే, కమందు మెండిస్, హర్షల్ పటేల్, బ్రైడన్ కార్స్, పాట్ కమ్మిన్స్, జయదేవ్ ఉనద్కత్, ఈషాన్ మలింగ, జీషన్ అన్సారీ, రవిచంద్రన్ స్మరణ్, జీషన్ అన్సారీ.
ఢిల్లీ క్యాపిటల్స్ (పర్సు 21.8 కోట్లు; స్లాట్లు: 8)
విడుదలైన వారు: ఫాఫ్ డు ప్లెసిస్, జాక్ ఫ్రాషర్ మెక్‌గర్క్, సదీకుల్లా అటల్, మన్వంత్ కుమార్, మోహిత్ శర్మ, దర్శన్ నల్కండే, డోనోవన్ ఫెరీరా (ట్రేడ్ అవుట్).
ఉన్న ఆటగాళ్లు: ట్రిస్టన్ స్టబ్స్, సమీర్ రిజ్వీ, కరుణ్ నాయర్, కెఎల్ రాహుల్, అభిషేక్ పోరెల్, అక్షర్ పటేల్, అశుతోష్ శర్మ, విప్రజ్ నిగమ్, మాధవ్ తివారీ, త్రిపురాణ విజయ్, అజయ్ మండల్, కుల్దీప్ యాదవ్, మిచెల్ స్టార్క్, టి నటరాజన్, ముఖేష్ కుమార్, దుష్మంత చమీర.
గుజరాత్ టైటాన్స్ (పర్సు: 12.9 కోట్లు; స్లాట్లు: 5)
విడుదలైన వారు: దాసున్ షనకా, కరీం జనత్, రూథర్‌ఫోర్డ్ (ట్రేడ్ అవుట్), మహిపాల్ లోమ్రోర్, గెరాల్డ్ కోయెట్జీ, కుల్వంత్ ఖేజ్రోలియా.
ఉన్న ఆటగాళ్లు: శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్, ఎం షారూఖ్ ఖాన్, కుమార్ కుశాగ్ర, జోస్ బట్లర్, అంజు రావత్, రాహుల్ తెవాటియా, వాషింగ్టన్ సుందర్, గ్లెన్ ఫిలిప్స్, జయంత్ యాదవ్, నిశాంత్ సింధు, రషీద్ ఖాన్, మహమ్మద్ సిరాజ్, కగిసో రబాడా, ప్రసిద్ధ్ కృష్ణ, సాయి కిషోర్, గుర్నూర్ బ్రార్, అర్షద్ ఖాన్, ఇషాంత్ శర్మ, మానవ్ సుతార్.
లక్నో సూపర్ జెయింట్స్ (పర్స్: 22.9 కోట్లు; స్లాట్లు: 6)
విడుదలైన వారు: ఆర్యన్ జుయాల్, డేవిడ్ మిల్లర్, యువరాజ్ చౌదరి, రాజ్వర్ధన్ హంగార్గేకర్, శార్దూల్ ఠాకూర్ (ట్రేడ్ అవుట్), ఆకాశ్ దీప్, రవి బిష్ణోయ్, షమర్ జోసెఫ్.
ఉన్న ఆటగాళ్లు: అబ్దుల్ సమద్, ఆయుష్ బడోని, ఐడెన్ మార్క్రమ్, మాథ్యూ బ్రీట్జ్కే, హిమ్మత్ సింగ్, రిషబ్ పంత్, నికోలస్ పూరన్, మిచెల్ మార్ష్, షాబాజ్ అహ్మద్, అర్షిన్ కులకర్ణి, మయాంక్ యాదవ్, అవేష్ ఖాన్, మొహ్సిన్ ఖాన్, ఎం సిద్ధార్థ్, దిగ్వేష్ రాఠీ, ప్రిన్స్ యాదవ్, ఆకాశ్ సింగ్ ట్రేడ్: మహ్మద్ షమీ
పంజాబ్ కింగ్స్ (పర్స్: 11.5 కోట్లు; స్లాట్లు: 4)
విడుదలైన వారు: మ్యాక్స్ వెల్, ఇంగ్లిస్, హార్డీ, జేమీసన్, కుల్ దీప్ సేన్, ప్రవీణ్ దూబె
ఉన్న ఆటగాళ్లు: అర్ష్ దీప్ సింగ్, అజ్మతుల్లా ఒమర్ జాయ్, హర్నూర్, హర్ ప్రీత్ బ్రార్, ఫెర్గూసన్, యాన్సెన్, స్టాయినిస్, మిచ్ ఓవెన్, ముషీర్ ఖాన్, నేహాల్ వధెరా, ప్రభ్ సిమ్రన్, ప్రియాన్ష్ ఆర్య, పైలా అవినాష్, శశాంక్ సింగ్, శ్రేయస్ అయ్యర్, సూర్యాన్ష్, విష్ణు వినోద్, వైశాఖ్ విజయ్ కుమార్, జేవియర్, యశ్ ఠాకూర్, చాహల్
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


