IPL Qualifier 1 RCB vs GT : డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఐపీఎల్ 2026 సీజన్‌లో మరోసారి ఫైనల్‌కు దూసుకెళ్లింది. ధర్మశాల వేదికగా జరిగిన క్వాలిఫయర్-1 పోరులో గుజరాత్ టైటాన్స్‌పై 92 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించి, వరుసగా రెండో ఏడాది టైటిల్ పోరుకు అర్హత సాధించింది.
విజృంభించిన పాటీదార్

ఆర్‌సీబీ కెప్టెన్ రజత్ పాటీదార్ కేవలం 33 బంతుల్లోనే 9 సిక్సర్లు, 5 ఫోర్లతో అజేయంగా 93 పరుగులు చేసి జట్టును ముందుండి నడిపించాడు. మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 254 పరుగుల భారీ స్కోరు సాధించింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్.. ఆర్‌సీబీ బౌలర్ల ధాటికి 19.3 ఓవర్లలో 162 పరుగులకే కుప్పకూలింది.
ఆర్‌సీబీ బ్యాటర్లు స్టేడియం నలుమూలలా సిక్సర్ల వర్షం కురిపించారు. ముఖ్యంగా కెప్టెన్ రజత్ పాటీదార్ కేవలం 33 బంతుల్లోనే 9 సిక్సర్లు, 5 ఫోర్లతో అజేయంగా 93 పరుగులు చేసి జట్టుకు కొండంత స్కోరు అందించాడు. అతనికి తోడుగా ఓపెనర్ విరాట్ కోహ్లీ (43), కృనాల్ పాండ్యా (43) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. గుజరాత్ బౌలర్లలో కాగిసో రబడా, ప్రసిద్ధ్ కృష్ణ భారీగా పరుగులు సమర్పించుకున్నారు. గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో కగిసో రబాడా, జాసన్ హోల్డర్ చెరో 2, ప్రసిద్ధ్ కృష్ణ 1 వికెట్ తీసుకున్నారు.
భారీ లక్ష్య ఛేదనలో గుజరాత్ టైటాన్స్ బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. ఆర్‌సీబీ పేసర్ల స్వింగ్, వేగానికి పవర్‌ప్లేలోనే కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డారు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 2 పరుగులకే అవుట్ కాగా, సాయి సుదర్శన్ (14), నిశాంత్ సింధు (5), వాషింగ్టన్ సుందర్ (8) చేతులెత్తేశారు. ఓపెనర్ జోస్ బట్లర్ 11 బంతుల్లో 29 పరుగులు చేసి కొద్దిసేపు మెరిపించినా ఎక్కువ సేపు నిలబడలేకపోయాడు.
గుజరాత్ ఇన్నింగ్స్‌లో రాహుల్ తెవాటియా ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. తెవాతియా 43 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లతో 68 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆర్‌సీబీ బౌలర్లలో జాకబ్ డఫీ 3 వికెట్లతో గుజరాత్ పతనాన్ని శాసించగా, భువనేశ్వర్ కుమార్, రసిఖ్ సలామ్ దార్, కృనాల్ పాండ్య తలో రెండు వికెట్లు, జోష్ హేజిల్ వుడ్ ఒక వికెట్ పడగొట్టారు. క్వాలిఫయర్-1లో ఓడిన గుజరాత్ టైటాన్స్.. ఎలిమినేటర్ మ్యాచ్ విజేతతో క్వాలిఫయర్-2లో తలపడనుంది.
{{/usCountry}}గుజరాత్ ఇన్నింగ్స్‌లో రాహుల్ తెవాటియా ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. తెవాతియా 43 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లతో 68 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆర్‌సీబీ బౌలర్లలో జాకబ్ డఫీ 3 వికెట్లతో గుజరాత్ పతనాన్ని శాసించగా, భువనేశ్వర్ కుమార్, రసిఖ్ సలామ్ దార్, కృనాల్ పాండ్య తలో రెండు వికెట్లు, జోష్ హేజిల్ వుడ్ ఒక వికెట్ పడగొట్టారు. క్వాలిఫయర్-1లో ఓడిన గుజరాత్ టైటాన్స్.. ఎలిమినేటర్ మ్యాచ్ విజేతతో క్వాలిఫయర్-2లో తలపడనుంది.
{{/usCountry}}