IPL Qualifier 1 RCB vs GT : గుజరాత్‌పై భారీ విజయం - వరుసగా రెండో ఏడాది ఫైనల్‌కు దూసుకెళ్లిన బెంగళూరు

IPL Qualifier 1 RCB vs GT 2026 : ధర్మశాల వేదికగా జరిగిన ఐపీఎల్ క్వాలిఫయర్ 1లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజృంభించింది. కెప్టెన్ రజత్ పటిదార్ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో గుజరాత్ టైటాన్స్‌ను 92 పరుగుల తేడాతో ఓడించి వరుసగా రెండోసారి ఫైనల్ చేరింది.

Published on: May 27, 2026, 24:07:34 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

IPL Qualifier 1 RCB vs GT : డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఐపీఎల్ 2026 సీజన్‌లో మరోసారి ఫైనల్‌కు దూసుకెళ్లింది. ధర్మశాల వేదికగా జరిగిన క్వాలిఫయర్-1 పోరులో గుజరాత్ టైటాన్స్‌పై 92 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించి, వరుసగా రెండో ఏడాది టైటిల్ పోరుకు అర్హత సాధించింది.

గుజరాత్‌పై భారీ విజయం
గుజరాత్‌పై భారీ విజయం

విజృంభించిన పాటీదార్‌

ఆర్‌సీబీ కెప్టెన్ రజత్ పాటీదార్‌ కేవలం 33 బంతుల్లోనే 9 సిక్సర్లు, 5 ఫోర్లతో అజేయంగా 93 పరుగులు చేసి జట్టును ముందుండి నడిపించాడు. మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 254 పరుగుల భారీ స్కోరు సాధించింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్.. ఆర్‌సీబీ బౌలర్ల ధాటికి 19.3 ఓవర్లలో 162 పరుగులకే కుప్పకూలింది.

ఆర్‌సీబీ బ్యాటర్లు స్టేడియం నలుమూలలా సిక్సర్ల వర్షం కురిపించారు. ముఖ్యంగా కెప్టెన్ రజత్ పాటీదార్‌ కేవలం 33 బంతుల్లోనే 9 సిక్సర్లు, 5 ఫోర్లతో అజేయంగా 93 పరుగులు చేసి జట్టుకు కొండంత స్కోరు అందించాడు. అతనికి తోడుగా ఓపెనర్ విరాట్ కోహ్లీ (43), కృనాల్ పాండ్యా (43) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. గుజరాత్ బౌలర్లలో కాగిసో రబడా, ప్రసిద్ధ్ కృష్ణ భారీగా పరుగులు సమర్పించుకున్నారు. గుజరాత్‌ టైటాన్స్‌ బౌలర్లలో కగిసో రబాడా, జాసన్‌ హోల్డర్‌ చెరో 2, ప్రసిద్ధ్‌ కృష్ణ 1 వికెట్‌ తీసుకున్నారు.

భారీ లక్ష్య ఛేదనలో గుజరాత్ టైటాన్స్ బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. ఆర్‌సీబీ పేసర్ల స్వింగ్, వేగానికి పవర్‌ప్లేలోనే కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డారు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 2 పరుగులకే అవుట్ కాగా, సాయి సుదర్శన్ (14), నిశాంత్ సింధు (5), వాషింగ్టన్ సుందర్ (8) చేతులెత్తేశారు. ఓపెనర్ జోస్ బట్లర్ 11 బంతుల్లో 29 పరుగులు చేసి కొద్దిసేపు మెరిపించినా ఎక్కువ సేపు నిలబడలేకపోయాడు.

గుజరాత్ ఇన్నింగ్స్‌లో రాహుల్ తెవాటియా ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. తెవాతియా 43 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లతో 68 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆర్‌సీబీ బౌలర్లలో జాకబ్ డఫీ 3 వికెట్లతో గుజరాత్ పతనాన్ని శాసించగా, భువనేశ్వర్ కుమార్, రసిఖ్ సలామ్ దార్, కృనాల్ పాండ్య తలో రెండు వికెట్లు, జోష్ హేజిల్ వుడ్ ఒక వికెట్ పడగొట్టారు. క్వాలిఫయర్-1లో ఓడిన గుజరాత్ టైటాన్స్.. ఎలిమినేటర్ మ్యాచ్ విజేతతో క్వాలిఫయర్-2లో తలపడనుంది.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More