iQOO Neo 12 : 9000ఎంఏహెచ్​ బ్యాటరీతో కొత్త గేమింగ్ స్మార్ట్​ఫోన్ లాంచ్- ఐక్యూ నియో 12 ధర, ఫీచర్లు..

ఐక్యూ సంస్థ సరికొత్త పవర్‌హౌస్ గేమింగ్ స్మార్ట్‌ఫోన్ ‘ఐక్యూ నియో 12’ను అధికారికంగా విడుదల చేసింది. 9,000ఎంఏహెచ్ భారీ బ్యాటరీ, 185హెచ్​జెడ్ రిఫ్రెష్ రేట్‌తో 2కే అమోలెడ్ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో వచ్చిన ఈ మొబైల్ స్పెసిఫికేషన్లు, ధర వివరాలు ఇవే..

Published on: Oct 29, 2026, 10:48:32 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

స్మార్ట్‌ఫోన్ ప్రియులు, ముఖ్యంగా గేమింగ్ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'ఐక్యూ నియో 12' చైనా మార్కెట్​లోకి అధికారికంగా అడుగుపెట్టింది. గతంలో వచ్చి మంచి విజయాన్ని సాధించిన ‘ఐక్యూ నియో 11’కి సీక్వెల్‌గా దీనిని మార్కెట్లోకి తీసుకొచ్చింది ఈ స్మార్ట్​ఫోన్ తయారీ సంస్థ. వివో అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఈ ఫోన్ త్వరలోనే విక్రయానికి రానుంది.

ఐక్యూ నియో 12 స్మార్ట్​ఫోన్..
ఐక్యూ నియో 12 స్మార్ట్​ఫోన్..

ఫ్లాగ్‌షిప్ ప్రాసెసింగ్ పవర్, కళ్లు చెదిరే డిస్‌ప్లే క్లారిటీ, ఏకంగా రోజుల తరబడి ఛార్జింగ్ అవసరం లేని భారీ బ్యాటరీ కెపాసిటీని ఇందులో అందించి గేమింగ్ విభాగాన్ని ఐక్యూ మరో స్థాయికి తీసుకెళ్లింది.

ఈ నేపథ్యంలో ఈ ఐక్యూ నియో 12 స్మార్ట్​ఫోన్ విశేషాలను ఇక్కడ తెలుసుకోండి..

ఐక్యూ నియో 12- ధర, వేరియంట్ల వివరాలు..

ఐక్యూ నియో 12 మోడల్ చైనాలో కాంటెస్ట్, షాడో బ్లాక్, ఫ్రాస్ట్ బ్లేడ్ బ్లూ అనే మూడు ఆకర్షణీయమైన రంగుల్లో లభ్యమవుతుంది. దీని వేరియంట్ల వారీగా అంచనా ధరలు ఇలా ఉన్నాయి:

12GB RAM + 256GB Storage (బేస్ మోడల్): 4,399 యువాన్ (భారత కరెన్సీలో సుమారు రూ. 63,000)

16GB RAM + 256GB Storage: 4,799 యువాన్ (సుమారు రూ. 69,000)

12GB RAM + 512GB Storage: 5,099 యువాన్ (సుమారు రూ. 73,000)

16GB RAM + 512GB Storage: 5,499 యువాన్ (సుమారు రూ. 79,000)

16GB RAM + 1TB Storage (టాప్ మోడల్): 6,499 యువాన్ (సుమారు రూ. 93,000)

ఐక్యూ నియో 12- డిస్​ప్లే..

ఈ స్మార్ట్​ఫోన్‌లో ప్రధనాకర్షణ దాని స్క్రీన్! ఐక్యూ నియో 12లో 6.83-అంగుళాల 2కే (1,440 x 3,200 పిక్సెల్స్) సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేను అమర్చారు. స్మార్ట్‌ఫోన్ ప్రపంచంలోనే అరుదైన 185హెచ్​జెడ్ రిఫ్రెష్ రేట్, 5,000హెచ్​జెడ్ ఇన్​స్టాంటేనియస్ టచ్ శాంప్లింగ్ రేట్‌ను ఇది సపోర్ట్ చేస్తుంది. దీనివల్ల పబ్‌జీ, ఫ్రీ ఫైర్ వంటి హై-ఎండ్ గ్రాఫిక్స్ గేమ్స్ ఆడేటప్పుడు ఎక్కడా ల్యాగ్ లేకుండా అత్యంత స్మూత్ అనుభూతి దక్కుతుంది. 2,200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ కారణంగా మండుటెండలోనూ డిస్‌ప్లే అత్యంత స్పష్టంగా కనిపిస్తుంది.

ఐక్యూ నియో 12- గేమింగ్ ప్రాసెసర్..

ఈ ఐక్యూ నియో 12 స్మార్ట్‌ఫోన్ 3ఎన్​ఎం ప్రాసెస్‌పై తయారైన పవర్‌ఫుల్ అక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇది గరిష్టంగా 4.6GHz క్లాక్ స్పీడ్‌ను అందిస్తుంది. దీనికి తోడు అడ్రినో 840 జీపీయూ, గేమింగ్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన 'క్యూ3 గేమింగ్ చిప్' ను అందించారు.

ఫోన్ వేడెక్కకుండా కాపాడటానికి 3డీ వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌ను పొందుపరిచారు. ఇది ఆండ్రాయిడ్ 17 ఆధారిత ‘ఆరిజిన్ ఓఎస్ 7’పై నడుస్తుంది.

ఐక్యూ నియో 12- బ్యాటరీ..

సాధారణంగా ఫ్లాగ్‌షిప్ ఫోన్లలో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఇస్తుంటారు. కానీ ఐక్యూ నియో 12లో ఏకంగా 9,000ఎంఏహెచ్ భారీ బ్యాటరీని అందించడం విశేషం. దీనికి తోడు 100డబ్ల్యూ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండటం వల్ల అంత పెద్ద బ్యాటరీ కూడా నిమిషాల వ్యవధిలోనే నిండుగా ఛార్జ్ అవుతుంది.

ఐక్యూ నియో 12 కెమెరా సెటప్, సెక్యూరిటీ..

ఫోన్ వెనుక వైపు స్క్వేర్ ఆకారంలో డ్యూయల్ కెమెరా మాడ్యూల్‌ను అమర్చారు:

ప్రధాన కెమెరా: ఓఐఎస్ (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) సపోర్ట్, సోనీ IMX921 సెన్సార్‌తో కూడిన 50-మెగాపిక్సెల్ ల్యాన్స్ (20x డిజిటల్ జూమ్).

రెండో కెమెరా: 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్.

సెల్ఫీ కెమెరా: ముందు భాగంలో వీడియా కాల్స్, సెల్ఫీల కోసం 16-మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ఈ ఫోన్ ద్వారా ఏకంగా 8కే క్వాలిటీతో వీడియో రికార్డింగ్ చేయవచ్చు.

భద్రత కోసం స్క్రీన్ కింద 3డీ ఆల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఐఆర్ బ్లాస్టర్, వై-ఫై 7, బ్లూటూత్ 5.4, 5జీ కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి.

ఇక భారత్‌లో ఈ ఐక్యూ నియో 12 స్మార్ట్​ఫోన్ లాంచ్ తేదీ, ధరలపై కంపెనీ త్వరలోనే స్పష్టత ఇచ్చే అవకాశముంది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More