మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరోసారి ముదిరాయి. అమెరికా, ఇరాన్ మధ్య శాంతి చర్చలు జరుగుతున్న తరుణంలోనే మంగళవారం అర్ధరాత్రి ఇరు దేశాల మధ్య ఘర్షణలు తీవ్రరూపం దాల్చాయి. కువైట్, బహ్రెయిన్‌లలోని అమెరికా సైనిక స్థావరాలు, శతృ నౌకలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది. తమ ఆయిల్ ట్యాంకర్‌పై అమెరికా జరిపిన దాడికి ప్రతీకారంగానే ఈ చర్యలు తీసుకున్నామని, ఇది అమెరికాకు ఒక గుణపాఠమని ఇరాన్ ప్రకటించింది.
ఇరాన్ ట్యాంకర్‌పై దాడి.. ప్రతీకారంగా క్షిపణులు
హార్ముజ్ జలసంధి సమీపంలో ఉన్న ఇరాన్ ఆయిల్ ట్యాంకర్ ఇంజిన్ రూమ్‌పై అమెరికా సైన్యం క్షిపణి దాడి చేసి నష్టం కలిగించిందని ఇరాన్ ప్రభుత్వ వార్తా సంస్థ 'ప్రెస్ టీవీ' వెల్లడించింది. ఈ దాడికి నిరసనగా ఇరాన్ నౌకాదళం రంగంలోకి దిగింది. నిబంధనలను ఉల్లంఘించినందుకు గానూ 'పనాయా' అనే అమెరికా-జియోనిస్ట్ శతృ నౌకను తాము క్షిపణులతో టార్గెట్ చేశామని ఐఆర్‌జీసీ స్పష్టం చేసింది.
"ఏదైనా దురాక్రమణకు పాల్పడితే తీవ్రమైన పరిణామాలు ఉంటాయని గతంలోనే హెచ్చరించాం. దానికి అనుగుణంగానే ఈ చర్య తీసుకున్నాం. ఈ దాడులు అమెరికాకు ఒక పాఠం కావాలి. హార్ముజ్ జలసంధి భద్రతకు ముప్పు కలిగిస్తే అమెరికా సైన్యం భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు" అని ఇరాన్ సైన్యం హెచ్చరించింది.
దాడులను తిప్పికొట్టామన్న అమెరికా
బహ్రెయిన్‌లోని అమెరికా ఐదో నౌకాదళ (5th Fleet) ప్రధాన కార్యాలయంపై, కువైట్‌లోని అమెరికా వైమానిక స్థావరంపై ఇరాన్ డ్రోన్లు, క్షిపణులను ప్రయోగించినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) ధృవీకరించింది. అయితే, కువైట్ వైపు దూసుకొచ్చిన ఇరాన్ డ్రోన్లు మార్గమధ్యంలోనే కూలిపోయాయని, బహ్రెయిన్ లక్ష్యంగా వచ్చిన క్షిపణులను అమెరికా, బహ్రెయిన్ దళాలు విజయవంతంగా అడ్డుకున్నాయని స్పష్టం చేసింది. ఈ దాడులకు ప్రతిచర్యగా హార్ముజ్ జలసంధిలోని ఖేష్మ్ ద్వీపంలో ఉన్న ఇరాన్ సైనిక కంట్రోల్ స్టేషన్‌పై అమెరికా దళాలు ఎదురుదాడులు జరిపాయి.
శాంతి చర్చల పరిస్థితి ఏంటి?
అమెరికా, ఇజ్రాయెల్‌తో కాల్పుల విరమణ ఒప్పందాన్ని పొడిగించేందుకు జరుగుతున్న చర్చల నుండి ఇరాన్ తప్పుకుందని స్థానిక వార్తా సంస్థలు ఫార్స్, తస్నిమ్ నివేదించాయి. లెబనాన్‌లో కాల్పుల విరమణను పూర్తిగా అమలు చేస్తేనే తాము చర్చల్లో పాల్గొంటామని ఇరాన్ షరతు పెట్టినట్లు మధ్యవర్తులు తెలిపారు. మంగళవారం నుండి ఇరాన్ వైపు నుండి ఎటువంటి స్పందన రాలేదని సమాచారం.
{{/usCountry}}అమెరికా, ఇజ్రాయెల్‌తో కాల్పుల విరమణ ఒప్పందాన్ని పొడిగించేందుకు జరుగుతున్న చర్చల నుండి ఇరాన్ తప్పుకుందని స్థానిక వార్తా సంస్థలు ఫార్స్, తస్నిమ్ నివేదించాయి. లెబనాన్‌లో కాల్పుల విరమణను పూర్తిగా అమలు చేస్తేనే తాము చర్చల్లో పాల్గొంటామని ఇరాన్ షరతు పెట్టినట్లు మధ్యవర్తులు తెలిపారు. మంగళవారం నుండి ఇరాన్ వైపు నుండి ఎటువంటి స్పందన రాలేదని సమాచారం.
{{/usCountry}}అయితే, చర్చలు నిలిచిపోయాయన్న వార్తలను అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తోసిపుచ్చారు. అవన్నీ అవాస్తవాలని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు.
"మా మధ్య చర్చలు నిరంతరాయంగా సాగుతున్నాయి. నిన్న, మొన్న, అంతకుముందు కూడా మాట్లాడాం. ఈ చర్చలు ఎక్కడికి దారితీస్తాయో ఎవరికీ తెలియదు. కానీ, ఇరాన్‌తో నేను ఒకటే చెప్తున్నా.. ఏదో ఒక మార్గంలో ఒప్పందం చేసుకోవడానికి ఇదే సరైన సమయం" అని ట్రంప్ స్పష్టం చేశారు.
రెండు రోజుల క్రితం ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ మాట్లాడుతూ.. అమెరికా, ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం లెబనాన్ సహా అన్ని రంగాలకు వర్తిస్తుందని తెలిపారు. ఏ ఒక్క చోట నిబంధనలు ఉల్లంఘించినా, అది మొత్తం ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లేనని, దానికి అమెరికా, ఇజ్రాయెల్ బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు.