ఇరాన్‌లో 1979 ఇస్లామిక్ విప్లవం తర్వాత ఏర్పడిన మతపరమైన పాలక వ్యవస్థకు ఇప్పుడు అతిపెద్ద సవాలు ఎదురవుతోంది. దేశవ్యాప్తంగా ఉవ్వెత్తున ఎగసిపడుతున్న నిరసనలు అంతర్జాతీయంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా మహిళలు తమ నిరసనను వ్యక్తం చేస్తున్న తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ చిత్రాలను నిప్పుపెట్టి, ఆ సెగతో మహిళలు సిగరెట్లు వెలిగిస్తున్న దృశ్యాలు ఇక్కడి పాలకులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.
నియమాలను బద్దలు కొడుతున్న మహిళలు

ఈ నిరసనల వెనుక ఒక బలమైన సామాజిక, రాజకీయ సందేశం దాగి ఉంది. ఇరాన్ చట్టాల ప్రకారం సుప్రీం లీడర్ ఫోటోలను తగులబెట్టడం అత్యంత తీవ్రమైన నేరం. మరోవైపు, ఇరాన్ సమాజంలో మహిళలు ధూమపానం చేయడాన్ని చాలా చోట్ల నిషేధంగా లేదా తప్పుగా భావిస్తారు. ఇప్పుడు మహిళలు ఈ రెండింటిని కలిపి ప్రదర్శించడం ద్వారా.. అటు ప్రభుత్వ అధికారానికి, ఇటు కఠినమైన సామాజిక ఆంక్షలకు వ్యతిరేకంగా తాము తిరుగుబాటు చేస్తున్నామని చాటి చెబుతున్నారు. 2022లో మహ్సా అమిని మరణం తర్వాత మొదలైన నిరసన జ్వాలలు ఇప్పుడు మరింత తీవ్రమయ్యాయి.
రక్తసిక్తమవుతున్న వీధులు.. ఇంటర్నెట్ బంద్
టెహ్రాన్‌లోని ఒక వైద్యుడు 'టైమ్' మ్యాగజైన్‌కు వెల్లడించిన సమాచారం ప్రకారం.. కేవలం ఆరు ఆసుపత్రుల్లోనే దాదాపు 217 మంది నిరసనకారులు మరణించారు. వీరిలో ఎక్కువ మంది భద్రతా దళాల తూటాలకు బలైపోయారు. అమ్నెస్టీ ఇంటర్నేషనల్ వంటి సంస్థలు అక్కడ జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వం అక్కడ దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ను నిలిపివేసి, ఫోన్ లైన్లను కట్ చేసింది. బయటి ప్రపంచానికి సమాచారం అందకుండా చేసి, నిరసనకారులను అణచివేసే ప్రయత్నం చేస్తోందని మానవ హక్కుల సంఘాలు మండిపడుతున్నాయి.
{{/usCountry}}టెహ్రాన్‌లోని ఒక వైద్యుడు 'టైమ్' మ్యాగజైన్‌కు వెల్లడించిన సమాచారం ప్రకారం.. కేవలం ఆరు ఆసుపత్రుల్లోనే దాదాపు 217 మంది నిరసనకారులు మరణించారు. వీరిలో ఎక్కువ మంది భద్రతా దళాల తూటాలకు బలైపోయారు. అమ్నెస్టీ ఇంటర్నేషనల్ వంటి సంస్థలు అక్కడ జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వం అక్కడ దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ను నిలిపివేసి, ఫోన్ లైన్లను కట్ చేసింది. బయటి ప్రపంచానికి సమాచారం అందకుండా చేసి, నిరసనకారులను అణచివేసే ప్రయత్నం చేస్తోందని మానవ హక్కుల సంఘాలు మండిపడుతున్నాయి.
{{/usCountry}}మద్దతుగా మోగుతున్న హారన్లు.. పాత్రల చప్పుళ్లు
ఉత్తర టెహ్రాన్‌లోని సాదత్ అబాద్ ప్రాంతంలో నిరసనకారులకు మద్దతుగా స్థానికులు తమ ఇళ్లలోని పాత్రలను గరిటెలతో కొడుతూ చప్పుళ్లు చేస్తున్నారు. వాహనదారులు వరుసగా హారన్లు మోగిస్తూ తమ సంఘీభావాన్ని తెలుపుతున్నారు. నిరసనకారులను 'విధ్వంసకారులు'గా ఖమేనీ అభివర్ణించగా, వారు మాత్రం తమ పోరాటం దేశం కోసమేనని స్పష్టం చేస్తున్నారు.
ట్రంప్ హెచ్చరిక.. అంతర్జాతీయ స్పందన
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ పరిణామాలపై స్పందిస్తూ.. ఇరాన్ నాయకత్వం పెద్ద ఇబ్బందుల్లో ఉందని వ్యాఖ్యానించారు. అవసరమైతే సైనిక చర్యకు కూడా వెనుకాడబోమని ఆయన పరోక్ష హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు ఫ్రాన్స్, బ్రిటన్, జర్మనీ దేశాలు కూడా ఇరాన్‌లో జరుగుతున్న హింసను తీవ్రంగా ఖండించాయి. నిరసనకారులను చంపడం ఆపాలని, ప్రభుత్వం సంయమనం పాటించాలని డిమాండ్ చేశాయి.
ఆహార ధరల పెరుగుదల, విపరీతమైన ద్రవ్యోల్బణంతో మొదలైన ఈ నిరసనలు ఇప్పుడు ప్రభుత్వం గద్దె దిగాలనే డిమాండ్ వరకు వెళ్లాయి. మత ఛాందసవాదం వర్సెస్ వ్యక్తిగత స్వేచ్ఛ మధ్య జరుగుతున్న ఈ యుద్ధంలో ఇరాన్ ఎటువైపు పయనిస్తుందో వేచి చూడాలి.