...
...
Next Story

Stock market holiday : రేపు స్టాక్​ మార్కెట్​లకు సెలవు ఉందా?

సోమవారం, అక్టోబర్​ 20న స్టాక్​ మార్కెట్​లకు సెలవు ఉందా? దీపావళి సందర్భంగా బీఎస్​ఈ, ఎన్​ఎస్​ఈలు మూతపడి ఉంటాయా? ముహురత్ ట్రేడింగ్​ ఎప్పుడు? పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

Published on: Oct 19, 2025, 06:02:15 IST
Advertisement

దీపావళి 2025 సందర్భంగా సోమవారం, అంటే అక్టోబర్​ 20న స్టాక్​ మార్కెట్​లకు సెలవు ఉందా? అన్న విషయం తెలుసుకునేందుకు మదుపర్లు ప్రయత్నిస్తున్నారు. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్​ఈ), నేషనల్ స్టాక్ ఎక్స్​ఛేంజ్ (ఎన్​ఎస్​ఈ)లకు 2025లో వారాంతాలు కాకుండా మొత్తం 14 అధికారిక సెలవులు ఉన్నాయి. అయితే, వీటిలో దీపావళి పండుగ సమయంలో వచ్చే సెలవులకు అత్యంత ప్రాధాన్యత ఉంది. అక్టోబర్ 21న ముహూర్త ట్రేడింగ్ జరగనుంది. ఆ తర్వాత అక్టోబర్ 22న మార్కెట్‌లకు పూర్తి సెలవు ఉంటుంది. అంటే సోమవారం స్టాక్​ మార్కెట్​లకు సెలవు లేదు! బీఎస్​ఈ, ఎన్​ఎస్​ఈలు యథాతథంగా కొనసాగుతాయి.

ముహురత్​ ట్రేడింగ్​..

రేపు స్టాక్​ మార్కెట్​లకు సెలవు ఉందా? (Anshuman Poyrekar/HT)
రేపు స్టాక్​ మార్కెట్​లకు సెలవు ఉందా? (Anshuman Poyrekar/HT)

హిందూ నూతన సంవత్సరానికి శుభారంభంగా పరిగణించే ముహురత్​ ట్రేడింగ్ సెషన్.. సంవత్సరంలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూసే స్టాక్ మార్కెట్ ఈవెంట్లలో ఒకటి. మంగళవారం, అక్టోబర్ 21, 2025 మధ్యాహ్నం 1:45 నుంచి 2:45 వరకు (ప్రీ-ఓపెన్ సెషన్ 1:30 నుంచి) ఈ సెషన్​ జరుగుతుంది.

ఒక గంట పాటు జరిగే లాంఛనప్రాయమైన ట్రేడింగ్ విండోలో, మదుపర్లు రాబోయే సంవత్సరంలో శ్రేయస్సు, అదృష్టం కలగాలని కోరుకుంటూ, ప్రతీకాత్మకమైన కొనుగోలు, అమ్మకపు ఆర్డర్‌లను చేస్తుంటారు. సాధారణంగా, ముహురత్​ ట్రేడింగ్ సెషన్‌లో పాజిటివ్ సెంటిమెంట్, తక్కువ ట్రేడింగ్ వాల్యూమ్స్ కనిపిస్తాయి. చాలా సందర్భాల్లో.. సెన్సెక్స్, నిఫ్టీ లాభాలతో ముగుస్తాయి.

దీపావళి తర్వాత మార్కెట్ సెలవు ముహురత్​ ట్రేడింగ్ ముగిసిన వెంటనే, బుధవారం, అక్టోబర్ 22న స్టాక్ మార్కెట్ సెలవు ఉంటుందని గ్రహించాలి. దీపావళి బలిప్రతిపద కారణంగా మార్కెట్​ హాలీడేలో ఉంటుంది. దీని అర్థం.. దీపావళి వారంలో మదుపరులు దాదాపు రెండు రోజుల ట్రేడింగ్ విరామం ఉంటుంది! మార్కెట్లు అక్టోబర్ 21న ఒక గంట పాటు లాంఛనంగా తెరుచుకుని, మళ్లీ అక్టోబర్ 23 గురువారం రోజున సాధారణ కార్యకలాపాలను పునఃప్రారంభిస్తాయి.

2025 స్టాక్ మార్కెట్ సెలవుల పూర్తి జాబితా..

  • మహా శివరాత్రి - ఫిబ్రవరి 26
  • హోలీ - మార్చి 14
  • ఈద్-ఉల్-ఫితర్​- మార్చి 31
  • మహావీర్ జయంతి- ఏప్రిల్ 10
  • అంబేద్కర్ జయంతి - ఏప్రిల్ 14
  • గుడ్ ఫ్రైడే - ఏప్రిల్ 18
  • మహారాష్ట్ర దినోత్సవం - మే 1
  • స్వాతంత్ర్య దినోత్సవం - ఆగస్టు 15
  • వినాయక చవితి - ఆగస్టు 27
  • గాంధీ జయంతి/దసరా - అక్టోబర్ 2
  • బలిప్రతిపద - అక్టోబర్ 22
  • గురునానక్ జయంతి - నవంబర్ 5
  • క్రిస్మస్ - డిసెంబర్ 25

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks