4,4,4,6,4,6.. ఇషాన్ విధ్వంసం.. రెచ్చిపోయిన ఇండియన్ బ్యాటర్.. 42 బాల్స్ లోనే సెంచరీ.. ఇండియా భారీ స్కోరు

ఇషాన్ కిషన్ హా.. మజాకా! న్యూజిలాండ్ తో అయిదో టీ20లో ఈ టీమిండియా బ్యాటర్ రెచ్చిపోయాడు. 42 బాల్స్ లోనే సెంచరీ బాదేశాడు. ఒకే ఓవర్లో వరుసగా 4,4,4,6,4,6 కొట్టేశాడు. 

Published on: Jan 31, 2026, 20:40:58 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తిరువనంతపురంలోని క్రికెట్ స్టేడియంలో ఈ రోజు తుపాను వచ్చింది. అది అలాంటి ఇలాంటి తుపాను కాదు. పరుగుల తుపాను.. ప్రత్యర్థిని ముంచేసే బౌండరీల తుపాను.. రికార్డులు బ్రేక్ చేసే తుపాను. ఆ తుపాను పేరే ఇషాన్ కిషన్. ఆకాశమే హద్దుగా చెలరేగిన ఇషాన్ శనివారం (జనవరి 31) న్యూజిలాండ్ తో అయిదో టీ20లో సెంచరీ బాదేశాడు.

ఇషాన్ కిషన్ (PTI)
ఇషాన్ కిషన్ (PTI)

ఇషాన్ కిషన్ సెంచరీ

టీమిండియా డైనమైట్ ఇషాన్ కిషన్ మరోసారి పేలాడు. బౌండరీలతో స్టేడియాన్ని హోరెత్తించాడు. శనివారం తిరువనంతపురంలో జరుగుతున్న అయిదో టీ20లో న్యూజిలాండ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు ఇషాన్ కిషన్. కేవలం 42 బంతుల్లోనే సెంచరీ బాదేశాడు. మొత్తం మీద 43 బాల్స్ లో 103 రన్స్ చేసి ఔటయ్యాడు ఇషాన్. ఇందులో 6 ఫోర్లు, 10 సిక్సర్లున్నాయి.

4,4,4,6,4,6

సుడిగాలి ఇన్నింగ్స్ లో చెలరేగిన ఇషాన్ కిషన్ ఇష్ సోధి వేసిన 12 ఓవర్లో మరింతగా రెచ్చిపోయాడు. ఫస్ట్ బాల్ సోధి వైడ్ వేశాడు. ఆ తర్వాత నుంచి ఇషాన్ ఊచకోత మొదలైంది. వరుసగా మూడు ఫోర్లు కొట్టాడు. తర్వాతి బంతిని స్టాండ్స్ లో పడేశాడు. వెంటనే మరో ఫోర్ కొట్టాడు. లాస్ట్ బాల్ కు సిక్సర్ బాదాడు. దీంతో ఆ ఓవర్లో మొత్తం 29 రన్స్ వచ్చాయి.

ఫస్ట్ సెంచరీ

ఇంటర్నేషనల్ టీ20ల్లో ఇషాన్ కిషన్ కు ఇదే ఫస్ట్ సెంచరీ. న్యూజిలాండ్ తో అయిదో టీ20లో భారీ షాట్లతో విరుచుకుపడ్డ అతను శతకం అందుకున్నాడు. ఇషాన్ ఇప్పుడు సంచలన ఫామ్ లో ఉన్నాడు. వరుసగా భారీ ఇన్నింగ్స్ లు ఆడుతున్నాడు. టీ20 ప్రపంచకప్ కు ముందు ఇండియాకు ఇది ఉత్సాహాన్ని ఇచ్చే విషయమే.

ఇండియా భారీ స్కోరు

న్యూజిలాండ్ తో అయిదో టీ20లో ఇండియా భారీ స్కోరు సాధించింది. 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఏకంగా 271 పరుగులు సాధించింది. ఇషాన్ కిషన్ (103)తో పాటు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (30 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్సర్లతో 63), హార్దిక్ పాండ్య (17 బంతుల్లో ఓ ఫోర్, 4 సిక్సర్లతో 42) కూడా అదరగొట్టారు. దీంతో టీమిండియా భారీ స్కోరు ఖాతాలో వేసుకుంది.

న్యూజిలాండ్ తో అయిదు టీ20ల సిరీస్ లో ఇండియా వరుసగా తొలి మూడు మ్యాచ్ లు గెలిచిన సంగతి తెలిసిందే. నాలుగో టీ20లో మాత్రం ఇండియా ఓడింది. ఇప్పుడు అయిదో టీ20లో చెలరేగి ఫస్ట్ భారీ స్కోరు సాధించింది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More