ముంబై/న్యూఢిల్లీ: కొత్త ఏడాది తొలిరోజే సిగరెట్ ప్రియులకు, ఇన్వెస్టర్లకు కేంద్ర ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది. సిగరెట్లపై అదనపు ఎక్సైజ్ సుంకాన్ని విధిస్తున్నట్లు ఆర్థిక శాఖ ప్రకటించడంతో స్టాక్ మార్కెట్లో పొగాకు కంపెనీల షేర్లు కుప్పకూలాయి. గురువారం నాటి ట్రేడింగ్‌లో ప్రముఖ దిగ్గజం ఐటీసీ (ITC) షేర్లు ఏడాది కనిష్ట స్థాయికి పడిపోగా, గాడ్‌ఫ్రే ఫిలిప్స్ (Godfrey Phillips) ఇన్వెస్టర్ల సంపద భారీగా ఆవిరైంది.
ఏడాది కనిష్టానికి ఐటీసీ.. 10 శాతం నష్టంలో గాడ్‌ఫ్రే

కేంద్రం తీసుకున్న నిర్ణయం ఐటీసీ షేర్లపై తీవ్ర ప్రభావం చూపింది. బిఎస్ఈ (BSE)లో ఐటీసీ షేరు సుమారు 6 శాతం మేర నష్టపోయి రూ. 379 వద్ద 52 వారాల కనిష్ట స్థాయిని తాకింది. దీనికి తోడు కంపెనీలో జరిగిన భారీ బ్లాక్ డీల్ (దాదాపు 4.03 కోట్ల షేర్లు) కూడా అమ్మకాల ఒత్తిడిని పెంచింది. మరోవైపు, గాడ్‌ఫ్రే ఫిలిప్స్ షేర్లు మరింత దారుణంగా 10 శాతం మేర పతనమై రూ. 2483.15 వద్ద ట్రేడయ్యాయి.
ఎక్సైజ్ సుంకం లెక్కలివే..
కేంద్ర ఆర్థిక శాఖ ఉత్తర్వుల ప్రకారం.. సిగరెట్ల పొడవును బట్టి ఈ ఎక్సైజ్ సుంకాన్ని నిర్ణయించారు. ప్రతి వేయి సిగరెట్ స్టిక్స్‌పై రూ. 2,050 నుంచి రూ. 8,500 వరకు సుంకం విధించనున్నారు.
ఈ కొత్త నిబంధన ఫిబ్రవరి 1, 2026 నుండి అమల్లోకి వస్తుంది. ప్రస్తుతం ఉన్న 40 శాతం జీఎస్‌టీ (GST)కి ఇది అదనంగా ఉండనుంది.
"ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల సిగరెట్ల ధరలు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. ఇది నేరుగా అమ్మకాలపై ప్రభావం చూపిస్తుంది" అని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
40 శాతం జీఎస్‌టీతో పాటు అదనపు భారం
నిజానికి గత డిసెంబర్లో పార్లమెంటు ఆమోదించిన సెంట్రల్ ఎక్సైజ్ (సవరణ) బిల్లు 2025లో భాగంగా ఈ మార్పులు చోటుచేసుకున్నాయి. ప్రస్తుతం సిగరెట్లపై ఉన్న కాంపెన్సేషన్ సెస్‌కు బదులుగా ఈ కొత్త ఎక్సైజ్ సుంకం వస్తుంది. ప్రస్తుతం భారత్‌లో సిగరెట్లపై మొత్తం పన్నులు రిటైల్ ధరలో సుమారు 53 శాతంగా ఉన్నాయి. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నిర్దేశించిన 75 శాతం పన్ను లక్ష్యానికి ఇది ఇంకా తక్కువగానే ఉండటం గమనార్హం.
{{/usCountry}}నిజానికి గత డిసెంబర్లో పార్లమెంటు ఆమోదించిన సెంట్రల్ ఎక్సైజ్ (సవరణ) బిల్లు 2025లో భాగంగా ఈ మార్పులు చోటుచేసుకున్నాయి. ప్రస్తుతం సిగరెట్లపై ఉన్న కాంపెన్సేషన్ సెస్‌కు బదులుగా ఈ కొత్త ఎక్సైజ్ సుంకం వస్తుంది. ప్రస్తుతం భారత్‌లో సిగరెట్లపై మొత్తం పన్నులు రిటైల్ ధరలో సుమారు 53 శాతంగా ఉన్నాయి. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నిర్దేశించిన 75 శాతం పన్ను లక్ష్యానికి ఇది ఇంకా తక్కువగానే ఉండటం గమనార్హం.
{{/usCountry}}ఈ పరిణామాల నేపథ్యంలో సిగరెట్ తయారీ కంపెనీల మార్జిన్లు తగ్గవచ్చని, అందుకే ఇన్వెస్టర్లు షేర్లను విక్రయించడానికి మొగ్గు చూపుతున్నారని ట్రేడింగ్ వర్గాలు చెబుతున్నాయి.