మీరు ఐటీఆర్ దాఖలు చేశారా? ఈసారి పన్ను రిఫండ్‌లో ఆలస్యం కావొచ్చు!

ఐటీఆర్ గురించి ఆదాయపు పన్ను శాఖ ఇప్పటికే చాలా వివరాలను పంచుకుంది. సెప్టెంబర్ 15వ తేదీ వరకు గడువు తేదీ ఉంది. అయితే ఈ ఏడాది ఆదాయపు పన్ను వాపసులో ఆలస్యం జరిగే అవకాశం ఉంది.

Published on: Jul 10, 2025 2:51 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఈ సంవత్సరం ఆదాయపు పన్ను రిటర్న్ అంటే ఐటీఆర్ దాఖలు చేయడానికి చివరి తేదీ సెప్టెంబర్ 15, 2025గా ఉంది. ఆదాయపు పన్ను స్లాబ్ కిందకు వచ్చే వారు ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయడం తప్పనిసరి. అటువంటి పరిస్థితిలో మీరు కూడా ఈ స్లాబ్ కిందకు వస్తే, ఈ సంవత్సరానికి మీ రిటర్న్‌ను దాఖలు చేయాలి. అయితే ఈ సంవత్సరం ఆదాయపు పన్ను రిటర్న్‌ల వాపసులో ఆలస్యం జరగవచ్చు. దీనికి కారణం కూడా ఉంది.

ఐటీఆర్ దాఖలు
ఐటీఆర్ దాఖలు

నిశితంగా పరిశీలన

ఈసారి ఆదాయపు పన్ను శాఖ రిటర్న్ దాఖలు చేసేటప్పుడు ఇచ్చిన మొత్తం సమాచారాన్ని చాలా నిశితంగా తనిఖీ చేస్తోంది. కచ్చితమైన సమాచారాన్ని మాత్రమే ఇవ్వాలి. తప్పుడు సమాచారం ఇస్తే చట్ట పరమైన చర్యలు తీసుకుంటుంది. పన్ను శాఖ ఐటీఆర్ దాఖలు సమాచారాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. అందుకే ఈసారి ఐటీఆర్ వాపసులో ఆలస్యం జరగవచ్చని చెప్పవచ్చు.

ఎక్కువ వాపసులపై ఫోకస్

చెల్లింపుదారులు ఏ ఫారమ్‌ను నింపారో ఆదాయపు పన్ను శాఖ చెక్ చేస్తోంది. ఐటీఆర్-1 లేదా ఐటీఆర్-4 వంటి ఫారమ్‌లు సాధారణంగా ఐటీఆర్-2 లేదా ఐటీఆర్-3 ఫారమ్‌లతో పోలిస్తే తక్కువ సమయంలో ప్రాసెస్ అవుతాయి. దీనితో పాటు ఎక్కువ వాపసు క్లెయిమ్‌ల విషయంలో కూడా ఆదాయపు పన్ను శాఖ తనిఖీలు కఠినంగా చేస్తుంది.

వడ్డీ

ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 244A ప్రకారం, పన్ను వాపసులో జాప్యం జరిగితే ప్రభుత్వం ప్రతి నెలా 0.5 శాతం వడ్డీని అందిస్తుంది. ఈ వడ్డీని రిటర్న్ దాఖలు చేసిన రోజు నుండి లేదా అసెస్‌మెంట్ సంవత్సరం ముగిసిన రోజు నుండి లెక్కిస్తారు. మీ మొత్తం పన్నులో 10 శాతం కంటే ఎక్కువ వాపసు మొత్తం ఉన్నప్పుడు మాత్రమే వడ్డీ అందుబాటులో ఉంటుంది.

ఇలా చేయకండి

పన్ను చెల్లింపుదారులు తప్పుడు ఫారమ్ ఎంచుకోవద్దు. మీ ఆదాయాన్ని బట్టి సరైన ఫారమ్ ఎంచుకోవాలి. మూలధన లాభాలు లేదా అద్దె ఆదాయం ఉన్నా.. ఐటీఆర్ 1 ఫారమ్ ఎంచుకుంటే సెక్షన్ 139(9) కింద రిటర్ను నోటీసు అందుకోవచ్చు. టీడీఎస్ రిపోర్టులో తేడాలు ఉంటే కూడా నోటీసులు వచ్చే ఛాన్స్ ఉంది. మీకు ఆదాయపు పన్ను పోర్టల్ నోటీసులు వస్తే.. వాటిని లైట్ తీసుకోవద్దు. గడువులను మరిచిపోకూడదు. చిన్న పొరపాటు కూడా పెద్ద సమస్యగా మారవచ్చు.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More