మచ్ అవైటెడ్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ వన్‌ప్లస్ 15 లాంచ్ డేట్‌ని సంస్థ తాజాగా ప్రకటించింది. ఈ వన్‌ప్లస్ హ్యాండ్‌సెట్ అక్టోబర్ నెలాఖరులో చైనాలో అడుగుపెట్టనుంది. కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ స్మార్ట్‌ఫోన్‌తో పాటు మరో హై-పెర్ఫార్మెన్స్ స్మార్ట్‌ఫోన్ వన్‌ప్లస్ ఏస్ 6 కూడా మార్కెట్‌లోకి వస్తుంది. ఈ ఫోన్‌ల పూర్తి స్పెసిఫికేషన్లు ఇంకా రహస్యంగానే ఉన్నప్పటికీ.. చైనాలోని ఆన్‌లైన్ స్టోర్‌లలో వీటిని లిస్ట్ చేశారు. ప్రస్తుతం ప్రీ-రిజర్వేషన్ల కోసం ఈ ఫోన్‌లు అందుబాటులో ఉన్నాయి.
వన్‌ప్లస్ 15 విడుదల తేదీ, సమయం..

చైనా సోషల్ మీడియా వీబోలో చేసిన ఒక పోస్ట్‌లో, వన్‌ప్లస్ సంస్థ వన్‌ప్లస్ 15ను అక్టోబర్ 27వ తేదీన.. చైనా స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 7 గంటలకు (భారతదేశంలో సాయంత్రం 4:30 గంటలకు) విడుదల చేయనున్నట్లు తెలిపింది.
ఈ ఫోన్‌తో పాటు వన్‌ప్లస్ సంస్థ ఇప్పటివరకు వివరాలు వెల్లడించకుండా దాచి ఉంచిన వన్‌ప్లస్ ఏస్ 6 కూడా లాంచ్ అవుతుంది.
త్వరలో రాబోయే ఏస్ సిరీస్ స్మార్ట్‌ఫోన్ ఫస్ట్ లుక్‌ని కూడా వెల్లడించింది సంస్థ.
వన్‌ప్లస్ ఏస్ 6 హ్యాండ్‌సెట్‌లో వన్‌ప్లస్ 15 మాదిరిగానే కెమెరా డిజైన్ ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే 15లో మూడు సెన్సార్లకు బదులుగా ఇందులో రెండు సెన్సార్లు మాత్రమే ఉన్నాయి.
ఈ హ్యాండ్‌సెట్ రెండు రంగుల్లో లభిస్తుంది. సిల్వర్ వేరియంట్ వెనుక భాగంలో 'ఏస్' బ్రాండింగ్‌ను కలిగి ఉంది. మరొకటి గోల్డెన్ షేడ్‌లో ఉంది. ఇది మరింత సున్నితంగా కనిపిస్తుంది.
వన్‌ప్లస్ 15, వన్‌ప్లస్ ఏస్ 6 రెండూ ఒప్పో ఈ స్టోర్, JD.com, ఇతర ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో ప్రీ-రిజర్వేషన్ కోసం లిస్ట్ అయ్యాయి. అక్టోబర్ 27న లాంచ్ అయిన తర్వాత ఇవి అమ్మకానికి వచ్చే అవకాశం ఉంది.
వన్‌ప్లస్ 15, వన్‌ప్లస్ ఏస్ 6 స్పెసిఫికేషన్స్ (అంచనా)..
వన్‌ప్లస్ 15 స్మార్ట్‌ఫోన్ క్వాల్కమ్ కొత్త స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్సెట్తో వస్తుంది. డిస్ప్లే పరంగా కూడా అప్‌గ్రేడ్ ఉంటుందని, రిఫ్రెష్ రేట్ 165హెచ్జెడ్కు పెంచినట్లు తెలుస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ 165హెచ్‌జెడ్ 1.5కే ఓఎల్ఈడీ స్క్రీన్‌ను కలిగి ఉంటుంది. ఇందులో 7000ఎంఏహెచ్ సామర్థ్యం గల భారీ బ్యాటరీతో రావడం ఖాయమైంది.
{{/usCountry}}వన్‌ప్లస్ 15 స్మార్ట్‌ఫోన్ క్వాల్కమ్ కొత్త స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్సెట్తో వస్తుంది. డిస్ప్లే పరంగా కూడా అప్‌గ్రేడ్ ఉంటుందని, రిఫ్రెష్ రేట్ 165హెచ్జెడ్కు పెంచినట్లు తెలుస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ 165హెచ్‌జెడ్ 1.5కే ఓఎల్ఈడీ స్క్రీన్‌ను కలిగి ఉంటుంది. ఇందులో 7000ఎంఏహెచ్ సామర్థ్యం గల భారీ బ్యాటరీతో రావడం ఖాయమైంది.
{{/usCountry}}ఫాస్ట్ ఛార్జింగ్: ఈ బ్యాటరీకి 100డబ్ల్యూ వైర్డ్, 50డబ్ల్యూ వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది.
వన్‌ప్లస్ ఏస్ 6 విషయానికొస్తే.. ఇందులో 1.5కే బీఓఈ ఓఎల్ఈడీ డిస్ప్లే ఉంటుంది. ఇందులో అల్ట్రాసానిక్ ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉండే అవకాశం ఉంది. పవర్ఫుల్ స్నాప్‌డ్రాగన్ 8 ఇలైట్ ప్రాసెసర్ మీద ఇది పనిచేస్తుంది. 7800ఎంఏహెచ్ బ్యాటరీపై ఇది పనిచేస్తుందని సమాచారం. 120డబ్ల్యూ వయర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కి ఇది సపోర్ట్ చేస్తుంది.