వాషింగ్టన్: అమెరికాలోని హెచ్-1బీ వీసా వ్యవస్థ పూర్తిగా దెబ్బతిందని, దానిని రద్దు చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని యూఎస్ ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తక్కువ వేతనాలకే విదేశీ ఉద్యోగులను నియమించుకుంటూ కంపెనీలు అమెరికన్ల ఉద్యోగాలను కొల్లగొడుతున్నాయని ఆయన ఆరోపించారు. సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పోస్ట్ చేసిన వీడియోలో ఆయన మాట్లాడుతూ.. కేవలం ఐటీ కంపెనీలే కాకుండా అకౌంటింగ్ సంస్థలు కూడా ఈ వీసా విధానాన్ని దుర్వినియోగం చేస్తున్నాయని మండిపడ్డారు.
మేధావుల పేరుతో తక్కువ జీతాల కొలువులు

అత్యంత నైపుణ్యం కలిగిన విదేశీ నిపుణులను తీసుకురావడానికి, తక్కువ వేతనాలతో స్థానిక ఉద్యోగులను తొలగించడానికి మధ్య చాలా వ్యత్యాసముందని వ్యాన్స్ స్పష్టం చేశారు. "సంవత్సరానికి 60,000 డాలర్లు సంపాదించే అమెరికన్ అకౌంటెంట్‌ను తొలగించి, ఆయన స్థానంలో 45,000 డాలర్ల జీతానికి విదేశీ అకౌంటెంట్‌ను నియమించడం అంటే మేధావులను దేశంలోకి తీసుకురావడం కాదు. అది అమెరికన్ ఉద్యోగాలను సర్వనాశనం చేయడమే. దేశ ప్రజలను మోసగించడమే" అని ఆయన నిలదీశారు.
$100,000 రుసుముపై గట్టి సమర్థన
కొత్త హెచ్-1బీ వీసా దరఖాస్తులపై ట్రంప్ ప్రభుత్వం విధించిన 1,00,000 డాలర్ల (సుమారు రూ. 84 లక్షలు) ప్రత్యేక చెల్లింపు నిబంధనను వ్యాన్స్ గట్టిగా సమర్థించారు. 2025 సెప్టెంబర్‌లో అమెరికా వెలుపల ఉన్న విదేశీ ఉద్యోగుల కోసం ప్రవేశపెట్టిన ఈ రుసుమును 2026 సెప్టెంబర్‌లో మరింత పొడిగించారు. జాతీయ ప్రయోజనాలు ఉన్న కొన్ని ప్రత్యేక మినహాయింపులతో 2027 సెప్టెంబర్ 21 వరకు ఈ నిబంధన అమలులో ఉంటుంది.
తక్కువ జీతాలకు విదేశీయులను నియమించుకోవాలని చూసే కంపెనీలకు అడ్డుకట్ట వేయడమే ఈ రుసుము ముఖ్య ఉద్దేశమని వ్యాన్స్ స్పష్టం చేశారు. "స్థానిక అమెరికన్ అకౌంటెంట్‌ను తీసివేసి తక్కువ జీతానికి విదేశీ ఉద్యోగిని పెట్టుకోవాలనుకునే ఏ కంపెనీ కూడా లక్ష డాలర్లు చెల్లించడానికి ముందుకు రాదు" అని ఆయన వ్యాఖ్యానించారు. అత్యధిక నైపుణ్యాలు, ఎక్కువ వేతనాలు ఇచ్చే అభ్యర్థులకే హెచ్-1బీ ప్రాధాన్యం దక్కాలనేది ప్రభుత్వ ఆలోచన అని వైట్‌హౌస్ వర్గాలు తెలిపాయి. 2025 ప్రొక్లమేషన్ అమలులోకి వచ్చిన తర్వాత ప్రముఖ ఐటీ అవుట్‌సోర్సింగ్ సంస్థల నుంచి వచ్చే హెచ్-1బీ నమోదులు ఏకంగా 92 శాతం మేర పడిపోయాయని అమెరికా ప్రభుత్వం పేర్కొంది.
కఠిన నిబంధనలు, న్యాయపోరాటాలు
మరోవైపు హెచ్-1బీ వ్యవస్థలో సమూల మార్పులు తెచ్చేందుకు ట్రంప్ యంత్రాంగం నిబంధనలను కఠినతరం చేస్తోంది. సెప్టెంబర్ 18న జారీ చేసిన కార్యనిర్వాహక ఉత్తర్వు ప్రకారం.. హెచ్-1బీ దరఖాస్తులను పరిశీలించేటప్పుడు, సదరు సంస్థలు ఇప్పటికే అమెరికన్ ఉద్యోగులను తొలగించాయా లేదా భవిష్యత్తులో తొలగించే ఆలోచనలో ఉన్నాయా అనే అంశాన్ని నిశితంగా పరిశీలించాలని విదేశాంగ, కార్మిక, హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ శాఖలను ఆదేశించారు. అలాగే మునుపటి లేబర్ కండిషన్ అప్లికేషన్లను చట్టబద్ధంగా సమీక్షించాలని కార్మిక శాఖను ఆదేశించారు. ఎక్కువ వేతనాలు ఇచ్చే ఉద్యోగాలకే హెచ్-1బీ ఎంపికలో ప్రాధాన్యం ఇచ్చే 'వెయిటెడ్ సెలక్షన్ విధానాన్ని' కూడా సర్కార్ తీసుకొచ్చింది.
{{/usCountry}}మరోవైపు హెచ్-1బీ వ్యవస్థలో సమూల మార్పులు తెచ్చేందుకు ట్రంప్ యంత్రాంగం నిబంధనలను కఠినతరం చేస్తోంది. సెప్టెంబర్ 18న జారీ చేసిన కార్యనిర్వాహక ఉత్తర్వు ప్రకారం.. హెచ్-1బీ దరఖాస్తులను పరిశీలించేటప్పుడు, సదరు సంస్థలు ఇప్పటికే అమెరికన్ ఉద్యోగులను తొలగించాయా లేదా భవిష్యత్తులో తొలగించే ఆలోచనలో ఉన్నాయా అనే అంశాన్ని నిశితంగా పరిశీలించాలని విదేశాంగ, కార్మిక, హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ శాఖలను ఆదేశించారు. అలాగే మునుపటి లేబర్ కండిషన్ అప్లికేషన్లను చట్టబద్ధంగా సమీక్షించాలని కార్మిక శాఖను ఆదేశించారు. ఎక్కువ వేతనాలు ఇచ్చే ఉద్యోగాలకే హెచ్-1బీ ఎంపికలో ప్రాధాన్యం ఇచ్చే 'వెయిటెడ్ సెలక్షన్ విధానాన్ని' కూడా సర్కార్ తీసుకొచ్చింది.
{{/usCountry}}ఈ నిబంధనలు అమల్లో ఉన్నప్పటికీ, హెచ్-1బీ ప్రోగ్రామ్‌ను పూర్తిగా రద్దు చేయడమే సరైన పరిష్కారమని వ్యాన్స్ అభిప్రాయపడ్డారు. "ఈ వ్యవస్థ పూర్తిగా నాశనమైంది. దీనిని రద్దు చేయడానికే నేను పూర్తి మద్దతు ఇస్తాను. అయితే ఇది అమల్లో ఉన్నంత వరకు అమెరికన్ కార్మికుల హక్కులను కాపాడటమే మా ప్రాధాన్యం" అని తేల్చిచెప్పారు.
అయితే, ట్రంప్ సర్కార్ ప్రవేశపెట్టిన 1,00,000 డాలర్ల రుసుముపై అమెరికా న్యాయస్థానాల్లో చట్టపరమైన సవాళ్లు ఎదురవుతున్నాయి. సరైన నిబంధనలు, ప్రజా సంప్రదింపుల విధానాలు పాటించకుండా ఈ రుసుమును మోపారంటూ అక్టోబర్ 1న ఒక ఫెడరల్ జడ్జి ఈ రుసుము అమలును నిలిపివేశారు. ఈ ఏడాది ప్రారంభంలో కూడా మరొక ఫెడరల్ కోర్టు ఈ రుసుముపై స్టే విధించిన సంగతి తెలిసిందే.