...
...
Next Story

Road accident : ఘోర రోడ్డు ప్రమాదం.. అతివేగంతో వాహనాన్ని ఢీకొన్న ఎస్‌యూవీ! 13 మంది దుర్మరణం

ఝార్ఖండ్‌లోని రామ్‌గఢ్ జిల్లాలో వేగంగా వెళుతున్న స్కార్పియో వాహనం మరో వాహనాన్ని ఢీకొన్న ప్రమాదంలో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. బిహార్‌లోని నలంద జిల్లాకు చెందిన వీరంతా ఆదివారం తెల్లవారుజామున ప్రమాదానికి గురయ్యారు.

Published on: Nov 29, 2026, 09:00:34 IST
Advertisement

ఝార్ఖండ్​లో తీవ్ర విషాదం నెలకొంది! రామ్‌గఢ్ జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున ఒక ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. అతివేగంతో ప్రయాణిస్తున్న ఓ ఎస్​యూవీ.. ముందు వెళుతున్న మరో వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటంలో 13మంది మరణించారుని ఓ సీనియర్ పోలీసు అధికారి వెల్లడించారు.

స్కార్పియోలో 14 మంది.. పోస్టుమార్టం ఏర్పాట్లు

రోడ్డు ప్రమాదంలో నుజ్జునుజ్జు అయిన కారు..
రోడ్డు ప్రమాదంలో నుజ్జునుజ్జు అయిన కారు..

రాంచీ-పట్నా హైవేపై కుజు ప్రాంతంలోని పైంకి గ్రామం సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.

"ముగ్గురు మహిళలతో సహా మొత్తం 13 మంది స్కార్పియోలో ప్రయాణిస్తుండగా, ముందున్న వాహనాన్ని ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. వాహనంలో ఉన్న వారంతా బిహార్‌లోని నలంద జిల్లాకు చెందినవారు," అని రామ్‌గఢ్ సబ్ డివిజనల్ పోలీసు అధికారి అలోక్ రంజన్ పీటీఐకి చెప్పారు.

మృతదేహాలను పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తారని ఆయన తెలిపారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని, అసలు కారణాలపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారని అధికారులు వివరించారు.

తెల్లవారుజామున రెండు గంటలకు ఘటన!

"ఈ ఝార్ఖండ్ రోడ్డు ప్రమాదం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో జరిగింది. వాహనంలో 14 మంది ఉన్నారు. తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో అందరినీ రామ్‌గఢ్ సదర్ ఆసుపత్రికి తీసుకొచ్చారు. అక్కడ 13 మంది అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. తీవ్రంగా గాయపడిన ఒకరికి ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ)లో చికిత్స అందిస్తున్నారు," అని రామ్‌గఢ్ సదర్ ఆసుపత్రి సివిల్ సర్జన్ డాక్టర్ అనిల్ కుమార్ పీటీఐకి వెల్లడించారు.

మరోవైపు దర్యాప్తు పూర్తయితే ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు భావిస్తున్నారు.

నెల తిరగకుండానే మరో ఘోర దుర్ఘటన!

ఝార్ఖండ్‌లో నెల రోజుల వ్యవధిలోనే ఇది రెండో పెద్ద రోడ్డు ప్రమాదం! ఖుంటీ జిల్లాలో ట్రైలర్ ట్రక్కు వేగంగా దూసుకెళ్లిన ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఆ ప్రమాదంలో నలుగురు మహిళలు, ముగ్గురు పిల్లలు మరణించారు.

నవంబర్ 5న ఖుంటీ జిల్లాలోని కర్రా-టోర్పా ప్రధాన రహదారిపై జోన్-లుద్రూ మోర్ సమీపంలో ఈ ఘటన జరిగింది. కల్వర్టు దగ్గర పొదల్లో స్కూటర్ రైడర్ పడిపోవడంతో సహాయం చేసేందుకు కొందరు మహిళలు, పిల్లలు అక్కడ ఆగారు.

అక్కడి ప్రజలు గుమిగూడిన సమయంలో టోర్పా వైపు నుంచి వేగంగా వచ్చిన 18 చక్రాల ట్రైలర్ వారిపైకి దూసుకెళ్లింది. ప్రమాదం జరిగిన వెంటనే ట్రైలర్ డ్రైవర్, క్లీనర్ ఘటనా స్థలం నుంచి పరారయ్యారు.

డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడని స్థానికులు ఆరోపించారు. ఈ మరణాలు గ్రామస్తుల్లో తీవ్ర ఆగ్రహానికి దారితీశాయి. రైల్వే క్రాసింగ్ సమీపంలో రోడ్డు దిగ్బంధనం చేసి బాధిత కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పరారీలో ఉన్న డ్రైవర్‌ను అరెస్ట్ చేయాలని, ప్రమాదాల నివారణకు స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేసి పోలీసులు తరచూ తనిఖీలు చేపట్టాలని నిరసన వ్యక్తం చేశారు.

 

ABOUT THE AUTHOR

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks