ఫ్రెండ్స్ అని నమ్మి రూమ్‌కి వెళ్తే.. మద్యం తాగించి ఇద్దరు విద్యార్థినులపై లైంగికదాడి!
ఫ్రెండ్స్ అని నమ్మి రూమ్‌కి వెళ్తే ఇద్దరు బాలికలపై లైంగిక దాడి జరిగింది. వద్దంటున్నా బలవంతంగా మద్యం తాగించి.. ఇద్దరు యువకులు వారి జీవితాలను నాశనం చేశారు.
వేయి ఆశలతో, విమానయాన రంగంలో ఎదగాలనే ఉన్నతమైన లక్ష్యంతో కన్నవారికి దూరంగా హైదరాబాద్‌కు వచ్చిన ఇద్దరు మైనర్ బాలికలకు ఊహించని దారుణం ఎదురైంది. పరిచయస్తుడే కదా అని నమ్మి వెళ్తే, స్నేహం ముసుగులో ఉన్న కిరాతకులు వారి భవిష్యత్తును ప్రశ్నార్థకం చేశారు. ఎయిర్ హోస్టెస్ శిక్షణ పొందుతున్న ఇద్దరు పదిహేడేళ్ల బాలికలకు బలవంతంగా మద్యం తాగించి లైంగిక దాడికి పాల్పడిన ఘోర సంఘటన హైదరాబాద్‌లోని మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర కలకలం రేపింది.

నిజామాబాద్ జిల్లాకు చెందిన 17 ఏళ్ల బాలిక ఇంటర్మీడియట్ పూర్తి చేసిన అనంతరం తన కలల కెరీర్ అయిన ఎయిర్ హోస్టెస్ శిక్షణ కోసం హైదరాబాద్‌కు వచ్చింది. నగరంలోని వెస్ట్ శ్రీనివాస్ నగర్ కాలనీలో ఉన్న ఒక లేడీస్ హాస్టల్లో ఉంటూ ప్రముఖ ఏవియేషన్ అకాడమీలో శిక్షణ పొందుతోంది. అదే హాస్టల్లో దమ్మాయిగూడకు చెందిన మరో 17 ఏళ్ల మైనర్ బాలిక కూడా చేరి, ఇద్దరూ ఎయిర్ హోస్టెస్ కోర్సును అభ్యసిస్తున్నారు.
పోలీసులు వెల్లడించిన సమాచారం ప్రకారం, ఈ దారుణానికి ఒడిగట్టిన ప్రధాన నిందితుడు గణేశ్ కూడా నిజామాబాద్ జిల్లాకు చెందినవ్యక్తే. డిగ్రీ పూర్తి చేసిన అతను బోయిన్‌పల్లిలో ఉంటూ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నాడు. అతడి స్నేహితుడు తరుణ్ బాలానగర్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇతడు కూడా నిజామాబాద్‌కు చెందినవాడే.
బాధితురాలైన ఒక బాలికతో గణేశ్‌కు గతంలో ఒకే కళాశాలలో చదువుకున్న సమయంలో పరిచయం ఉంది. ఆ నమ్మకంతోనే నిందితులు దారుణమైన పథకం వేశారు. ఆదివారం రాత్రి 11:30 గంటల సమయంలో బాలానగర్‌లో ఓ ఫ్రెండ్లీ పార్టీ ఉందంటూ గణేశ్, తరుణ్ ఇద్దరూ కలిసి హాస్టల్ వద్దకు కారులో వచ్చి ఇద్దరు మైనర్ బాలికలను నమ్మించి తీసుకెళ్లారు.
గదికి తీసుకెళ్లిన తర్వాత, బాలికల వద్దంటున్నా... పట్టించుకోకుండా వారితో బలవంతంగా మద్యం తాగించారు. అనంతరం ఆ మైనర్లపై ఇద్దరు యువకులు లైంగిక దాడికి పాల్పడ్డారు. కలలో కూడా ఊహించని ఈ విపత్తుతో తీవ్ర దిగ్భ్రాంతికి గురైన బాలికలు, ధైర్యం తెచ్చుకుని తమకు జరిగిన అన్యాయంపై మధురానగర్ పోలీసులను ఆశ్రయించారు. నమ్మిన మిత్రులే ఇంతటి నీచానికి దిగజారారని బాధితులు కన్నీరుమున్నీరయ్యారు.
ఘటన తీవ్రతను అర్థం చేసుకున్న మధురానగర్ పోలీసులు వెంటనే స్పందించి నిందితులు గణేశ్, తరుణ్‌లపై పోక్సో చట్టంతో పాటు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని ముమ్మరంగా విచారిస్తున్నారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్ఎడిటర్గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


