సికింద్రాబాద్ - నాగర్ సోల్ మధ్య వన్ వే స్పెషల్ ట్రైన్ - వయా నిజామాబాద్!
ప్రయాణికుల రద్దీని దృష్ట్యా దక్షణ మధ్య రైల్వే సికింద్రాబాద్ నుంచి నగర్ సోల్ వరకు వన్ వే స్పెషల్ ట్రైన్ (07099) ప్రకటించింది. అక్టోబర్ 28న రాత్రి బయలుదేరనుంది.
సికింద్రాబాద్ నుంచి ప్రయాణించే ప్రయాణికులకు దక్షణ మధ్య రైల్వే ముఖ్యమైన అప్డేట్ అందించింది. పండగలు, సెలవుల నేపథ్యంలో పెరిగిన ప్రయాణికుల రద్దీని నియంత్రించేందుకు…. ప్రయాణాన్ని సులభతరం చేసేందుకు గాను సికింద్రాబాద్ - నాగర్ సోల్ మధ్య ప్రత్యేక రైలును నడపాలని నిర్ణయించింది.

ట్రైన్ టైమింగ్స్ - వివరాలు….
- రైలు సంఖ్య: 07099 (సికింద్రాబాద్ – నాగర్ సోల్)
- ప్రయాణ తేదీ: 2026 అక్టోబర్ 28, బుధవారం
- బయలుదేరు సమయం: సికింద్రాబాద్ స్టేషన్ నుంచి బుధవారం రాత్రి 21:25 గంటలకు (రాత్రి 9:25 గంటలు) బయలుదేరుతుంది.
- చేరుకునే సమయం: మరుసటి రోజు (గురువారం) ఉదయం 09:55 గంటలకు నగర్ సోల్ చేరుకుంటుంది
సికింద్రాబాద్ లో బయలుదేరే ఈ ప్రత్యేక రైలు మార్గమధ్యంలో తెలంగాణతో పాటు మహారాష్ట్రలోని కీలకమైన స్టేషన్లలో ఆగుతుంది. ఇందులో కామారెడ్డి, నిజామాబాద్, బాసర, ధర్మాబాద్, ముద్ఖేడ్, హెచ్.ఎస్. నాందేడ్, పూర్ణ, పర్భణి, జాల్నా , ఛత్రపతి సంభాజీనగర్ (ఔరంగాబాద్) స్టేషన్లలో ఈ రైలుకు స్టాపేజీలు కల్పించారు.
ప్రయాణికుల సౌకర్యార్థం ఈ రైలులో అన్ని రకాల తరగతుల కోచ్‌లను అందుబాటులో ఉంచారు. ఫస్ట్ ఏసీ , సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ, స్లీపర్ క్లాస్,జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఇందులో ఉన్నాయి. ప్యాసింజర్లు తమ వీలును బట్టి టికెట్లను బుక్ చేసుకోవచ్చని దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ ఓ ప్రకటనలో తెలిపారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

