...
...
Next Story

Jio IPO GMP today : భారీగా పెరిగిన జియో ఐపీఓ జీఎంపీ.. తగిలితే 22శాతం లాభాలు!

ముకేష్ అంబానీ సారథ్యంలోని జియో ప్లాట్‌ఫామ్స్ అక్టోబర్ 21న మార్కెట్లో హిస్టారిక్ ఐపీఓను ప్రారంభించనుంది. ప్రైస్ బ్యాండ్, గ్రే మార్కెట్ ప్రిమియం (జీఎంపీ), లాట్ సైజు, ఆకర్షణీయమైన లిస్టింగ్ లాభాల సమగ్ర వివరాలు ఇక్కడ పరిశీలించండి..

Published on: Oct 19, 2026, 10:45:59 IST
Advertisement

భారతీయ స్టాక్ మార్కెట్ చరిత్రలోనే సరికొత్త అధ్యాయం లిఖించేందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ ‘జియో ప్లాట్‌ఫామ్స్’ సిద్ధమైంది. సబ్‌స్క్రిప్షన్ కోసం అక్టోబర్ 21న తెరచుకోనున్న ఈ మెగా ఐపీఓ ద్వారా కంపెనీ ఏకంగా రూ. 30,213 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. గతంలో హ్యుందాయ్ మోటార్ ఇండియా పేరిట ఉన్న రూ. 27,800 కోట్ల ఐపీఓ రికార్డును ఇది తుడిచిపెట్టనుంది.

రిలయన్స్ జియో జీఎంపీ అప్డేట్స్..
రిలయన్స్ జియో జీఎంపీ అప్డేట్స్..

ఈ నేపథ్యంలో రిలయన్స్ జియో ఐపీఓ జీఎంపీ, ప్రైస్ బ్యాండ్ సహా ఇతర వివరాలను ఇక్కడ డీటైల్డ్​గా తెలుసుకోండి..

జియో ఐపీఓ ప్రైస్ బ్యాండ్, కనీస పెట్టుబడి వివరాలు

జియో ఐపీఓలో పాల్గొనాలనుకునే సామాన్య (రిటైల్) ఇన్వెస్టర్ల కోసం కంపెనీ ప్రైస్ బ్యాండ్‌ను రూ. 1,065 నుంచి రూ. 1,119 గా ఖరారు చేసింది. ప్రతి షేరు ముఖ విలువ రూ. 10 కాగా, రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 1 లాట్ (12 షేర్లు) కోసం బిడ్ దాఖలు చేయాల్సి ఉంటుంది. అంటే ఒక లాట్ కోసం కనీసం రూ. 13,428 పెట్టుబడి పెట్టాలి. ఈ ఐపీఓ ద్వారా లభించే 27 కోట్ల కొత్త ఈక్విటీ షేర్లు, కంపెనీ ఈక్విటీ క్యాపిటల్‌లో దాదాపు 2.93 శాతానికి సమానం.

జియో ఐపీఓ గ్రే మార్కెట్‌లో జోరు: 22% లిస్టింగ్ లాభాలు?

స్టాక్ మార్కెట్ వర్గాల్లో జియో ఐపీఓపై విపరీతమైన ఆసక్తి నెలకొంది. మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం అక్టోబర్ 19 ఉదయం వేళకు జియో ఐపీఓ గ్రే మార్కెట్ ప్రిమియం (జీఎంపీ) షేరుకు రూ. 245 నుంచి రూ. 249 వరకు పలికింది. అప్పర్ ప్రైస్ బ్యాండ్ రూ. 1,119కి ఈ ప్రిమియం కలిపితే, లిస్టింగ్ రోజున షేరు ధర రూ. 1,368కి చేరే అవకాశం ఉంది! అంటే మొదటి రోజే ఇన్వెస్టర్లకు దాదాపు 22.25 శాతం మేర ఆకర్షణీయమైన లాభాలు లభించవచ్చని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

అయితే, కేవలం గ్రే మార్కెట్​ ప్రీమియలో ఉన్న డిమాండ్​ చూసి ఐపీఓకి అప్లై చేయకూడదు అని, కంపెనీ ఫండమెంటల్స్​ గురించి తెలుసుకోవాలని స్టాక్ మార్కెట్, ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

జియో ఐపీఓ కీలక తేదీలు..

జియో ప్లాట్​ఫామ్స్ ఐపీఓ ప్రారంభ తేదీ: అక్టోబర్ 21 (బుధవారం)

ఐపీఓ ముగింపు తేదీ: అక్టోబర్ 23 (శుక్రవారం)

షేర్ల కేటాయింపు : అక్టోబర్ 26

స్టాక్ మార్కెట్ లిస్టింగ్: అక్టోబర్ 28 (ఎన్​ఎస్​ఈ, బీఎస్​ఈ)

టెలికాం, డిజిటల్ సేవుల్లో తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తున్న జియోలో పెట్టుబడి పెట్టేందుకు చిన్న తరహా ఇన్వెస్టర్లు సిద్ధమవుతున్నారు. ఈ నిధుల ద్వారా కంపెనీ రుణ భారాన్ని తగ్గించుకోవడమే కాక భవిష్యత్ డిజిటల్ విస్తరణకు పటిష్టమైన బాటలు వేసుకోనుంది.

(గమనిక- ఇది సమాచారం కోసం రూపొందించిన కథనం మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ఐపీఓలో ఇన్వెస్ట చేసే ముందు సెబీ రిజిస్టర్డ్ ఫైనాన్షియల్ అడ్వైజర్​ని సంప్రదించడం శ్రేయస్కరం.)

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks