జోసా కౌన్సెలింగ్ 2026 షెడ్యూల్ విడుదల: రేపటి నుంచే రిజిస్ట్రేషన్లు

దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిష్టాత్మక ఐఐటీలు, ఎన్‌ఐటీలలో ప్రవేశాల కోసం నిర్వహించే జోసా (JoSAA) 2026 కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. జూన్ 2 సాయంత్రం నుంచి అధికారిక వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది.

Updated on: Jun 01, 2026 1:54 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాల కోసం విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న జోసా (JoSAA) 2026 కౌన్సెలింగ్ షెడ్యూల్ వచ్చేసింది. జాయింట్ సీట్ అలోకేషన్ అథారిటీ ఈ మేరకు అధికారిక వెబ్‌సైట్ josaa.nic.in లో పూర్తి వివరాలను అందుబాటులో ఉంచింది. జేఈఈ అడ్వాన్స్‌డ్ (JEE Advanced 2026) లో ర్యాంకు సాధించిన విద్యార్థులు ఐఐటీ సీట్ల కోసం, జేఈఈ మెయిన్స్ అర్హులు ఎన్‌ఐటీ సీట్ల కోసం రేపటి (జూన్ 2) నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియకు దరఖాస్తు చేసుకోవచ్చు.

జోసా కౌన్సెలింగ్ 2026 షెడ్యూల్ విడుదల: రేపటి నుంచే రిజిస్ట్రేషన్లు
జోసా కౌన్సెలింగ్ 2026 షెడ్యూల్ విడుదల: రేపటి నుంచే రిజిస్ట్రేషన్లు

రిజిస్ట్రేషన్ మరియు వెబ్ ఆప్షన్ల (Choice filling) ప్రక్రియ జూన్ 2వ తేదీ సాయంత్రం 5 గంటలకు ప్రారంభమవుతుంది. విద్యార్థులు తమకు నచ్చిన కాలేజీలు, కోర్సులను ఎంచుకోవడానికి జూన్ 11వ తేదీ వరకు గడువు ఇచ్చారు. జూన్ 7 నాటికి విద్యార్థులు నమోదు చేసుకున్న ఆప్షన్ల ఆధారంగా జూన్ 8న మొదటి మాక్ సీట్ అలాట్‌మెంట్ (Mock seat allotment) జాబితాను విడుదల చేస్తారు. ఆ తర్వాత జూన్ 10న రెండో మాక్ సీట్ అలాట్‌మెంట్ జాబితాను ప్రకటిస్తారు. దీనివల్ల విద్యార్థులకు తమ ర్యాంకుకు ఏ కాలేజీలో సీటు వచ్చే అవకాశం ఉందో ఒక అంచనా లభిస్తుంది.

జూన్ 13న మొదటి విడత సీట్ల కేటాయింపు

షెడ్యూల్ ప్రకారం జూన్ 13న రౌండ్-1 సీట్ల కేటాయింపు ఫలితాలను విడుదల చేస్తారు. సీట్లు పొందిన అభ్యర్థులు అదే రోజు నుంచి ఆన్‌లైన్ రిపోర్టింగ్ చేయడం, ఫీజు చెల్లించడం, అవసరమైన పత్రాలను (Documents) అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. మొదటి విడత ఫీజు చెల్లింపునకు జూన్ 26వ తేదీని చివరి గడువుగా నిర్ణయించారు. ఐఐటీల్లో సీటు సాధించాలనుకునే జేఈఈ అడ్వాన్స్‌డ్ ర్యాంకర్లందరూ ఈ సంయుక్త సీట్ల కేటాయింపు ప్రక్రియలో పాల్గొనడం తప్పనిసరి. 2026-27 విద్యాసంవత్సరానికి గాను ఐఐటీలు ఆఫర్ చేస్తున్న కోర్సుల పూర్తి వివరాలు ఆన్‌లైన్ ఛాయిస్ ఫిల్లింగ్ సమయంలో అందుబాటులో ఉంచుతారు.

జోసా కౌన్సెలింగ్ 2026కు రిజిస్ట్రేషన్ చేసుకునే విధానం

విద్యార్థులు కౌన్సెలింగ్ ప్రక్రియను సులభంగా పూర్తి చేయడానికి క్రింది పద్ధతిని అనుసరించవచ్చు:

  • మొదట జోసా అధికారిక వెబ్‌సైట్ josaa.nic.in ను సందర్శించండి.
  • హోమ్‌పేజీలో అందుబాటులో ఉన్న 'JoSAA Counselling 2026 Registration' లింక్‌పై క్లిక్ చేయండి.
  • ఓపెన్ అయిన కొత్త పేజీలో మీ జేఈఈ రిజిస్ట్రేషన్ వివరాలను నమోదు చేయండి.
  • లాగిన్ అయిన తర్వాత అప్లికేషన్ ఫారమ్‌ను పూర్తిగా నింపండి.
  • నిర్ణీత రిజిస్ట్రేషన్ ఫీజును ఆన్‌లైన్ ద్వారా చెల్లించండి.
  • అన్ని వివరాలను సరిచూసుకుని 'Submit' బటన్‌పై క్లిక్ చేయడంతో మీ రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది.
  • భవిష్యత్తు అవసరాల కోసం కన్ఫర్మేషన్ పేజీని డౌన్‌లోడ్ చేసుకుని, ఒక ప్రింటవుట్ దగ్గర ఉంచుకోండి.
  • షెడ్యూలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

1. జోసా 2026 కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్ ఎప్పుడు ప్రారంభమవుతుంది? చివరి తేదీ ఏది?

జోసా కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్, ఛాయిస్ ఫిల్లింగ్ ప్రక్రియ జూన్ 2, 2026 న సాయంత్రం 5 గంటలకు ప్రారంభమవుతుంది. ఆప్షన్లు నమోదు చేసుకోవడానికి జూన్ 11, 2026 వరకు గడువు ఉంటుంది.

2. మొదటి విడత సీట్ల కేటాయింపు ఫలితాలు ఎప్పుడు విడుదల చేస్తారు?

మొదటి రౌండ్ సీట్ల కేటాయింపు ఫలితాలను జూన్ 13, 2026న విడుదల చేస్తారు. సీటు వచ్చిన అభ్యర్థులు జూన్ 26, 2026 లోపు ఆన్‌లైన్ రిపోర్టింగ్ పూర్తి చేసి ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

3. మాక్ సీట్ అలాట్‌మెంట్ జాబితాలను ఎప్పుడు ప్రకటిస్తారు?

విద్యార్థులు పెట్టుకున్న ఆప్షన్ల ఆధారంగా మొదటి మాక్ సీట్ అలాట్‌మెంట్ జాబితాను జూన్ 8న, రెండవ జాబితాను జూన్ 10న విడుదల చేస్తారు.

  • Praveen Kumar Lenkala
    ABOUT THE AUTHOR
    Praveen Kumar Lenkala

    ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More