Keeway Hypevolt R : అడాస్ ఫీచర్‌తో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్- 180 కి.మీ రేంజ్! ధర..
Keeway Hypevolt R : కీవే హైప్‌వోల్ట్- ఆర్ పేరుతో ఒక ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్ ఇండియాలో లాంచ్ అయ్యింది. దీని రేంజ్ 180 కి.మీ. ఇందులో అడాస్ ఫీచర్ ఉండటం హైలైట్. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ వివరాలను ఇక్కడ చూసేయండి..
భారతదేశపు ప్రీమియం ఎలక్ట్రిక్ టూ-వీలర్ మార్కెట్లోకి హంగేరియన్ బ్రాండ్ కీవే గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది! పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్, సరికొత్త బాబర్ స్టైల్ డిజైన్‌తో కూడిన ‘హైప్‌వోల్ట్-ఆర్’ అనే పేరుతో ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసింది. పూర్తి వివరాలను ఇక్కడ చూసేయండి..

బుకింగ్స్ ప్రారంభం.. మోటో వాల్ట్ ద్వారా విక్రయాలు
ఆదిశ్వర్ ఆటో రైడ్ ఇండియా నేతృత్వంలోని మల్టీ-బ్రాండ్ 'మోటో వాల్ట్' షోరూమ్‌ల ద్వారా ఈ కీవే హైప్‌వోల్ట్-ఆర్ స్కూటర్‌ను భారత్‌లో విక్రయించనున్నారు. ప్రీమియం పెర్ఫార్మెన్స్ సెగ్మెంట్లో లాంచ్ అయిన ఈ స్కూటర్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 1.99 లక్షలుగా ఉంది. కస్టమర్లు కేవలం రూ. 5,000 టోకెన్ అమౌంట్ చెల్లించి ఈ సరికొత్త ఈవీని బుక్ చేసుకోవచ్చు.
కీవే హైప్‌వోల్ట్-ఆర్ ఎలక్ట్రిక్ స్కూటర్- అదిరిపోయే బాబర్ స్టైల్ డిజైన్..
కీవే హైప్‌వోల్ట్-ఆర్ డిజైన్ మార్కెట్లో ఉన్న సాధారణ స్కూటర్లలా కాకుండా అత్యంత భిన్నంగా, ఫ్యూచరిస్టిక్‌గా ఉంటుంది. ఇది టీవీఎస్ ఎక్స్, బీఎండబ్ల్యూ Cఈ-02 వంటి ప్రీమియం మోడళ్లకు గట్టి పోటీని ఇవ్వనుంది.
ప్రత్యేకతలు: ఈ కీవే హైప్‌వోల్ట్-ఆర్ ఎలక్ట్రిక్ స్కూటర్లో సాధారణ స్కూటర్లలా ఫ్లాట్ ఫుట్‌బోర్డ్ ఉండదు, మధ్యలో సెంట్రల్ స్పైన్ డిజైన్‌ను అందించారు. రైడర్, పిలియన్ సీట్లు ఫ్లాట్‌గా ఉంటాయి.
లైటింగ్ అండ్ లుక్: వర్టికల్ (నిలువు) హెడ్‌ల్యాంప్స్ నేరుగా ఫ్రంట్ ఏప్రాన్‌పైనే అమర్చి ఉంటాయి. ఎలక్ట్రిక్ స్కూటర్ వెనుక భాగం వీల్స్ వరకు సాగకుండా కట్ చేసినట్లు ఉండటం వల్ల దీనికి ఒక క్లాసిక్ ‘బాబర్-స్టైల్’ లుక్ వచ్చింది. ఎల్‌ఈడీ టెయిల్ ల్యాంప్స్, టైర్ హగ్గర్ దీని సొంతం.
కలర్ ఆప్షన్లు: ఇది క్రిస్టల్ వైట్, ప్లాటినం గ్రే అనే రెండు ఆకర్షణీయమైన రంగులలో లభిస్తుంది.
కీవే హైప్‌వోల్ట్-ఆర్ ఎలక్ట్రిక్ స్కూటర్- అడాస్ ఫీచర్‌తో!
టెక్నాలజీ పరంగా కీవే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో సరికొత్త ఫీచర్లను జోడించింది. బ్లూటూత్ కనెక్టివిటీ, కాల్/మెసేజ్ అలర్ట్స్, మ్యాప్ ప్రొజెక్షన్‌తో కూడిన నావిగేషన్‌ను సపోర్ట్ చేసే 5-ఇంచ్ టీఎఫ్‌టీ డిస్‌ప్లే ఇందులో ఉంది.
భద్రత కోసం అందించిన ఫీచర్లు:
కీలెస్ గో (స్మార్ట్ కీ సిస్టమ్)
ట్రాక్షన్ కంట్రోల్, డ్యూయల్-ఛానల్ ఏబీఎస్
హిల్-హోల్డ్, హిల్-డిసెంట్ కంట్రోల్
ఇంటెలిజెంట్ క్రూయిజ్ కంట్రోల్, రివర్స్ మోడ్
బ్లైండ్‌స్పాట్ డిటెక్షన్‌తో కూడిన రివర్స్ కెమెరా, అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (అడాస్) ఫీచర్లు.
కీవే హైప్‌వోల్ట్-ఆర్ ఎలక్ట్రిక్ స్కూటర్- పవర్‌ట్రెయిన్, రేంజ్, ఛార్జింగ్..
కీవే హైప్‌వోల్ట్-ఆర్‌లో 5 కేడబ్ల్యూహెచ్ సామర్థ్యం కలిగిన రెండు రిమూవబుల్ (బయటకు తీయగలిగే) బ్యాటరీలను అందించారు. ఇవి సింగిల్ ఛార్జ్‌పై గరిష్టంగా 180 కిలోమీటర్ల అద్భుతమైన రేంజ్‌ను అందిస్తాయని కంపెనీ క్లెయిమ్ చేస్తోంది. ఈ బ్యాటరీలను స్కూటర్ లోపల ఉంచి లేదా విడిగా బయటకు తీసి కేవలం 3 గంటల్లోనే 0 నుంచి 80 శాతం వరకు ఫాస్ట్ ఛార్జ్ చేసుకోవచ్చు.
కీవే హైప్‌వోల్ట్-ఆర్ ఎలక్ట్రిక్ స్కూటర్- హార్డ్‌వేర్..
ఈ స్కూటర్ ముందు వైపు 100/80, వెనుక వైపు 120/70 ప్రొఫైల్ గల టైర్లతో కూడిన 14-ఇంచుల స్టైలిష్ అల్లాయ్ వీల్స్‌పై నడుస్తుంది. కంఫర్ట్ రైడింగ్ కోసం ముందు టెలిస్కోపిక్ ఫోర్క్స్, వెనుక ట్విన్ షాక్ అబ్జార్బర్స్ సస్పెన్షన్ ఉన్నాయి. బ్రేకింగ్ కోసం రెండు వైపులా డిస్క్ బ్రేకులు ఇచ్చారు.
గ్రౌండ్ క్లియరెన్స్: 130ఎంఎం
సీట్ హైట్: 770 ఎంఎం (తక్కువ హైట్ ఉన్నవారికైనా సులభంగా సరిపోతుంది)
బూట్ స్పేస్: సీటు కింద 27 లీటర్ల స్టోరేజ్ స్పేస్ లభిస్తుంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


